పశ్చిమ చాళుక్యులు

పశ్చిమ చాళుక్యులు 10 నుంచి 12 శతాబ్దాల మధ్య కాలంలో దక్షిణ భారతదేశంలో చాలా వరకు పశ్చిమ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశం. ప్రస్తుతం కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న బసవకళ్యాణ్ వీరి రాజధానిగా ఉండేది. దానిపేరు మీదుగా వారికి కళ్యాణి చాళుక్యులు అనే పేరు కూడా వచ్చింది. వీరికంటే ముందు 6వ శతాబ్దంలో బాదామి ప్రాంతం కేంద్రంగా మరో చాళుక్య వంశం పరిపాలించింది. వారిని బాదామి చాళుక్యులు అని కూడా వ్యవహరిస్తారు. వీరికి సమకాలికులు, వేంగి ప్రాంతాన్ని కేంద్రంగా పరిపాలించిన తూర్పు చాళుక్యులు. ఇది మరో రాజవంశం. వీరినే వేంగి చాళుక్యులు అని కూడా వ్యవహరిస్తారు. ఈ చాళుక్యుల ప్రాభవానికి ముందు దక్కన్ లో చాలా ప్రాంతం, మధ్య భారతదేశాన్ని మాన్యఖేట సామ్రాజ్యానికి చెందిన రాష్ట్రకూటులు రెండు శతాబ్దాల పాటు నియంత్రించారు.

పశ్చిమ చాళుక్యులు

కల్యాణి చాళుక్యులు
975–1184[1]
Extent of Western Chalukya Empire, 1121 CE.[2]
Extent of Western Chalukya Empire, 1121 CE.[2]
స్థాయిసామ్రాజ్యం
(973 దాకా రాష్ట్రకూటులకు సామంత రాజ్యం)
రాజధానిమాన్యఖేట
బసవకల్యాణ్
సామాన్య భాషలుకన్నడ
సంస్కృతం
మతం
హిందు మతం
జైనమతం
ప్రభుత్వంరాజరికం
రాజు 
• 957 – 997
రెండవ తైలప
• 1184 – 1189
నాలుగవ సోమేశ్వరుడు
చరిత్ర 
• Earliest records
957
• స్థాపన
975
• పతనం
1184[1]
Preceded by
Succeeded by
రాష్ట్రకూటులు
హొయసల సామ్రాజ్యం
కాకతీయులు
యాదవులు

మూలాలు

మార్చు
  1. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 52–53. ISBN 978-93-80607-34-4.
  2. Schwartzberg, Joseph E. (1978). A Historical atlas of South Asia. Chicago: University of Chicago Press. p. 147, map XIV.3 (e). ISBN 0226742210.