పసల సూర్యచంద్రరావు
భారతీయ రాజకీయనాయకుడు
పసల సూర్యచంద్రరావు 1953 నుండి 1954 వరకు ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు తొలి ఉపసభాపతిగా పనిచేసిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త.[1][2] ఈయన కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరఫున అలంపురం నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.[3] ఈయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి రెండుసార్లు ఎన్నికయ్యాడు.[4] సూర్యచంద్రరావు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. ఈయన 2004 జనవరి 17న మరణించాడు. మరణం తరువాత, ఈయన ఆస్తులు వివాదాస్పద భూ లావాదేవీలలో చిక్కుకున్నాయి.[4]
పసల సూర్యచంద్రరావు | |
---|---|
తొలి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి | |
In office 24 నవంబరు 1953 – 15 నవంబరు 1954 | |
గవర్నర్ | చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది |
తరువాత వారు | కల్లూరు సుబ్బారావు |
వ్యక్తిగత వివరాలు | |
మరణం | 17 జనవరి 2004 |
రాజకీయ పార్టీ | కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ |
నివాసం | పశ్చిమ గోదావరి జిల్లా |
మూలాలు
మార్చు- ↑ "Former Deputy Speakers - Legislative Assembly". Andhra Pradesh State Legislature, Govt. of Andhra Pradesh. Archived from the original on 30 నవంబరు 2021. Retrieved 11 May 2023.
- ↑ A.P. Year Book (in ఇంగ్లీష్). Hyderabad Publications & Newspapers. 1979. p. 295.
- ↑ "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 2014-10-14.
- ↑ 4.0 4.1 "ఒకే ఆస్తి.. మూడు రిజిస్ట్రేషన్లు". Sakshi. 2016-04-16. Retrieved 2023-05-11.