పాంచాల పరాభవము (నాటకం)


పాంచాల పరాభవము (పంజాబు దురంతములు) 1921లో దామరాజు పుండరీకాక్షుడు రాసిన అయిదంకముల నాటకం. పంజాబ్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతంను మహాభారత కథలో ఇమడ్చి ఈ నాటకం రాయబడింది.[1]

పాంచాల పరాభవము
కృతికర్త: దామరాజు పుండరీకాక్షుడు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: చంద్రికా ముద్రాక్షరశాల, గుంటూరు
విడుదల: 1921
పేజీలు: 95

కథానేపథ్యం

మార్చు

భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశంలో జరుగుతున్న పోరాటం గురించి ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతం చేయడంకోసం ఉద్యమ నేపథ్యంలో నాటకాలు రచించబడేవి.

జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణకాండ నేపథ్యంలో జనరల్ డయ్యర్ ను దుశ్శాసునిగా, భారతమాతను పాంచాలిగా, మహాత్మా గాంధీని కృష్ణుడిగా పోలుస్తూ దామరాజు ఈ నాటకాన్ని రచించాడు. తెల్లదొరల చేతుల్లో ముక్కలైపోతున్న భారతమాతను ఓదార్చి మహాత్మా గాంధీ సత్యగ్రహ దీక్షతో ప్రజలను ఉద్యమంవైపుకు మరలిస్తాడు.

నిషేధం

మార్చు

నాటక ప్రదర్శనలో వేదికమీద డయ్యర్ దిష్టిబొమ్మ తగులబెట్టడంతో దానిపై ఇంగ్లాడ్ పార్లమెంటులో చర్చ జరిగి బ్రిటీషు ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించడంతోపాటు, ప్రతులను తగులబెట్టించింది.[2]

పాత్రలు

మార్చు
  1. కృష్ణుడు
  2. కర్ణుడు
  3. భారతమాత
  4. పాంచాలమాత
  5. సత్యపాల్
  6. కిచ్లూ
  7. ధీరసింగు
  8. వీరలాల్
  9. మధన్ మోహన్ (బాలుడు)
  10. మంగళీసింగు
  11. ఉత్తమసింగు
  12. ధనశెట్టి
  13. డాబ్ సింగు
  14. ఓడ్వయ్యర్
  15. డయ్యర్
  16. జాన్సన్
  17. భటులు
  18. నెహ్రూ
  19. మాలవ్యా
  20. తిలక్
  21. పాల్
  22. జితేంద్రలాల్ బెనర్జీ
  23. షౌకతాలీ
  24. మహమ్మదాలీ
  25. సి.ఆర్. దాస్
  26. హంటరు
  27. జగత్ నారాయణ్

మూలాలు

మార్చు
  1. తెల్లవారిపై సంధించిన అస్త్రం పాంచాల పరాభవము, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 26 జూన్ 2017, పుట.14
  2. నవతెలంగాణ, సోపతి-స్టోరి (26 March 2016). "'నాటకం' నడుస్తూనే... ఉంటుంది". NavaTelangana. Archived from the original on 4 ఏప్రిల్ 2016. Retrieved 18 August 2019.

ఇతర లంకెలు

మార్చు