పాకాల్ దుల్ ఆనకట్ట

పాకల్ దుల్ ఆనకట్ట జమ్మూ కాశ్మీర్‌, కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదికి ఉపనది అయిన మరుసుదార్ నదిపై నిర్మాణంలో ఉన్న కాంక్రీట్-ఫేస్ రాక్-ఫిల్ డ్యామ్. ఆనకట్ట ప్రధాన ప్రయోజనం విద్యుదుత్పత్తి. ఇది 10 కి.మీ. (6.2 మై.) పొడవైన హెడ్‌రేస్ టన్నెల్ ద్వారా నీటిని దక్షిణానికి మళ్లించి, చీనాబ్‌ నదిపై ఉన్న దుల్ హస్తి డ్యామ్ జలాశయంపై ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రానికి పంపుతుంది.[1] 2014 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును దేశీయ, విదేశీ సంస్థల కన్సార్టియంకు ఇచ్చారు. ఇందులో AFCONS, JP అసోసియేట్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఉన్నాయి.[2] చీనాబ్‌ నదికి దిగువన ఉన్న పాకిస్తాన్, పాకాల్ దుల్ ఆనకట్ట సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపిస్తుంది.[3] అయితే ఇది ఒప్పంద నిబంధనలకు లోబడే ఉందని భారతదేశం పేర్కొంది. భారత వ్యాఖ్యాత హర్షిల్ మెహతా - కిరు, రాట్లే, ఉజ్ బహుళార్ధసాధక ప్రాజెక్టుల లాగానే ఈ ప్రాజెక్టుకు కూడా జలవిద్యుదుత్పత్తి మాత్రమే కాకుండా వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉందని రాశాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Pakal Dul H E Project". Chenab Valley Power Projects. Archived from the original on 28 జూలై 2012. Retrieved 22 May 2014.
  2. "Patel Engineering consortium lowest bidder for 1,000 MW hydel project". Economic Times of India. 7 February 2014. Archived from the original on 15 ఫిబ్రవరి 2014. Retrieved 22 May 2014.
  3. "Pakistan sees Indus Water Treaty violations in proposed Pakal Dul hydroelectric plant". HydroWorld. 22 January 2013. Retrieved 22 May 2014.
  4. Mehta, Harshil (2022-06-04). "India is All Set to Harness Hydropower With Eye on the China-Pakistan Axis". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-11-28.