పాకిస్తాన్‌లో కోవిడ్-19 మహమ్మారి

కోవిడ్-19 పాకిస్తాన్లో మహమ్మారి కొనసాగుతుంది. కరోనా వ్యాధి 2019లో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధిగా చైనాలో పుట్టింది. 2020 ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. జూన్ 17 నాటికి, పాకిస్తాన్‌లోని ప్రతి జిల్లా కనీసం ఒక కోవిడ్-19 కేసున నమోదయ్యాయి.[1][2]

పాకిస్తాన్‌లో కోవిడ్-19 మహమ్మారి
వ్యాధికరోనా వైరస్
ప్రదేశంపాకిస్తాన్‌
మొదటి కేసుకరాచీ
ప్రవేశించిన తేదీ26 పిబ్రవరి 2020
మూల స్థానంచైనా హూహన్

పాకిస్తాన్‌లోని అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్, పంజాబ్, ఇప్పటివరకు అత్యధికంగా ధ్రువీకరించబడిన కేసులు (334,000) మరణాలు (9,770) నమోదయ్యాయి. దేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ అయిన సింధ్ అత్యధిక ధ్రువీకరించబడిన కేసులను (308,000) మరణాలు (4,910) నమోదయ్యాయి. బలూచిస్తాన్ యొక్క చిన్న, శుష్క ప్రావిన్స్‌లో అత్యల్ప ధ్రువీకరించబడిన కేసుల సంఖ్య (24,500) అత్యల్ప మరణాల సంఖ్య (270) ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో అమలైనది. మే 9 వరకు రెండుసార్లు పొడిగించబడింది.తర్వాత, లాక్ డౌన్ దశలవారీగా సడలించబడింది.[3][4].[5] [6][7][8]

నేపథ్య

మార్చు

చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌. కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్. ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్‌"గా గుర్తించారు. ఈ వ్యాధికి ప్రస్తుతం చాలా రకాల టీకాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్.[9][10][11][12][13]

నివారణ చర్యలు ప్రతిస్పందన

మార్చు

2020 మార్చి పాకిస్తాన్, చైనా మధ్య విమాన కార్యకలాపాలను జనవరి 30 వరకు నిలిపివేయాలని నిర్ణయించింది.చైనాలో వందలాది కేసులు నమోదవుతున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాన విమానాశ్రయాలలో స్క్రీనింగ్ చర్యలను ప్రవేశపెట్టింది.మార్చి 21న కరాచీ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికుల కోసం స్క్రీనింగ్ కూడా ప్రారంభించబడింది.మార్చి 13న ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో అన్ని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను ఏప్రిల్ 5 వరకు మూసివేయాలని నిర్ణయించారు.23 మార్చి జరుగనున్న అన్ని ప్రజా ఈవెంట్స్ రద్దు చేశారు.మార్చి 21 న, అన్ని అంతర్జాతీయ విమానాలు రెండు వారాల పాటు రద్దు చేశారు. రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ 42 రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.దేశవ్యాప్తంగా 35కి పైగా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది.118,000 కంటే ఎక్కువ పడకలు ఉన్నాయి.ప్రభుత్వాలు విధించిన వివిధ లాక్‌డౌన్ల కారణంగా, మార్చి చివరిలో సరుకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. అందువల్ల, వస్తువుల రవాణాను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా రహదారులు, రహదారులు తెరిచి ఉంచాలని ఫెడరల్ ప్రభుత్వం మార్చి 29న నిర్ణయించింది.ఏప్రిల్ 2 న, దేశంలో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి దేశం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు మంత్రి అసద్ ఉమర్ ప్రకటించారు. ఏప్రిల్ 24న, మరోసారి దేశంలో లాక్‌డౌన్‌ను మే 9 వరకు పొడిగించింది.

ప్రభావం

మార్చు

కరోనావైరస్ మహమ్మారి కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రూ.2.5 ట్రిలియన్లను కోల్పోయిందని ఏప్రిల్ 2 న పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షోభం సమయంలో నిర్వహించబడ్డాయి.జూన్ 2న, మహమ్మారి కారణంగా మామిడి ఎగుమతులు క్షీణించాయని ప్రకటించారు.

మూలాలు

మార్చు
  1. Khan, Naimat (26 February 2020). "Pakistan prepares to fight back as two coronavirus cases emerge in country". Arab News PK. Retrieved 22 May 2021.
  2. "Coronavirus updates, March 18: Latest news on the coronavirus outbreak from Pakistan and around the world". Geo News. 18 March 2020. Retrieved 23 April 2020.
  3. Shehzad, Rizwan (24 April 2020). "Countrywide lockdown stretched till May 9". The Express Tribune. Retrieved 25 April 2020.
  4. Coronavirus pandemic: Pakistan to extend lockdown for 2 more weeks as death toll reaches 31 Archived 8 ఏప్రిల్ 2020 at the Wayback Machine, The Statesman, 2 April 2020
  5. Khan, Omer Farooq (7 May 2020). "Pakistan announces to ease lockdown from Saturday". The Times of India. Retrieved 22 May 2021.
  6. "Coronavirus updates, April 4: Latest news on the COVID-19 pandemic from Pakistan and around the world". Geo News. Archived from the original on 6 April 2020. Retrieved 4 April 2020.
  7. "Number of cases expected to rise to 50,000 by April 25, govt tells Supreme Court". Geo News. Archived from the original on 6 April 2020. Retrieved 4 April 2020.
  8. "LIVE: PM Imran urges Pakistanis to be steadfast in their faith amid COVID-19 crisis". The Express Tribune. 4 April 2020. Retrieved 4 April 2020.
  9. Elsevier. "Novel Coronavirus Information Center". Elsevier Connect. Archived from the original on 30 January 2020. Retrieved 15 March 2020.
  10. Reynolds, Matt (4 March 2020). "What is coronavirus and how close is it to becoming a pandemic?". Wired UK. ISSN 1357-0978. Archived from the original on 5 March 2020. Retrieved 5 March 2020.
  11. "Crunching the numbers for coronavirus". Imperial News. Archived from the original on 19 March 2020. Retrieved 15 March 2020.
  12. "High consequence infectious diseases (HCID); Guidance and information about high consequence infectious diseases and their management in England". Government of the United Kingdom. Archived from the original on 3 March 2020. Retrieved 17 March 2020.
  13. "World Federation Of Societies of Anaesthesiologists – Coronavirus". wfsahq.org. Archived from the original on 12 March 2020. Retrieved 15 March 2020.

వెలుపల లింకులు

మార్చు