షేక్ రషీద్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ అండర్–19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022 కు బీసీసీఐ ప్రకటించిన పదిహేడు మంది సభ్యులలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[1]
జననం
మార్చుప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ బాలీషా, జ్యోతిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రియాజ్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతుండగా, రెండవ కుమారుడు రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. తండ్రి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి.[2]
కోచ్ కృష్ణారావు
మార్చుకోచ్ కృష్ణారావు ఆధ్వర్యంలో మంగళగిరి క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన రషీద్ వినూ మాన్కడ్ టోర్నీలో మూడు శతకాలు బాది సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి, భారత అండర్-19 జట్టుకి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
క్రీడా ప్రస్థానం
మార్చు- తొమ్మిదో ఏటనే అండర్-14 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రషీద్ అంతర్ జిల్లాల పోటీల్లో భాగంగా శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ చేసాడు.
- 2017లో అండర్-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే హయ్యెస్ట్ రన్నర్‌గా రషీద్ నిలిచాడు.
- 2018 లో అండర్-19లో 680 రన్స్‌తో జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
- 2021 లో వినూ మన్కడ్‌లో ఆరు మ్యాచ్‌లాడిన రషీద్ రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలతో 400కు పైగా పరుగులు చేసాడు.
- చాలెంజర్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన రషీద్ ఒక అజేయ సెంచరీ సహా 275 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.[3]
సచిన్ నా ఆరాధ్య క్రికెటర్
మార్చుభారత అండర్-19 జట్టుకి వైస్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసిన షేక్ రషీద్ సచిన్ తన ఆరాధ్య క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు.
మూలాలు
మార్చు- ↑ "భారత్ క్రికెట్‌లో మెరిసిన తెలుగు తేజం.. కీలక బాధ్యతల్లో." Sakshi. 2021-12-20. Retrieved 2022-01-18.
- ↑ "U-19 World Cupకి భారత్ జట్టు వైస్ కెప్టెన్‌గా గుంటూరు కుర్రాడు". Samayam Telugu. Retrieved 2022-01-18.
- ↑ "Sheikh Rashid: టీమిండియా వైస్ కెప్టెన్ గా గుంటూరు మిర్చి.. బరిలోకి దిగాడంటే రికార్డుల మోతే..!". News18 Telugu. Retrieved 2022-01-18.