పాకిస్తాన్ లొంగుబాటు పత్రం
పాకిస్తాన్ లొంగుబాటు పత్రం | |
---|---|
ఆమోదించిన తేదీ | 1971 డిసెంబరు 16 |
ప్రదేశం | ఢాకా, తూరెపు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) |
సంతకం చేసినవారు | ఎ.ఎ.కె.నియాజీ జగ్జిత్ సింగ్ అరోరా |
విషయం | పాకిస్తాన్ సైనికదళాల తూర్పు కమాండ్ లొంగుబాటు |
కారణం | బంగ్లాదేశ్ విమోచన యుద్ధం, భారత పాక్ యుద్ధం 1971 ల ముగింపు |
పాకిస్తాన్ లొంగుబాటు పత్రం అనేది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1971 నాటి ఇండో-పాకిస్తానీ యుద్ధాలను ముగించడానికి భారతదేశం (బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో పాటు), పాకిస్తాన్‌లు సంతకాలు చేసిన చట్టపరమైన పత్రం.[1][2][3] ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ప్రభుత్వం సాయుధ దళాల తూర్పు కమాండ్ లొంగిపోయింది.[4][5] తద్వారా తూర్పు పాకిస్తాన్ భూభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ స్థాపనకు వీలు కల్పించింది. 93,000 మంది పాకిస్తానీ సైనికుల లొంగిపోవడాన్ని ధృవీకరిస్తూ జగ్జిత్ సింగ్ అరోరా, పాకిస్తాన్‌కు చెందిన AAK నియాజీ లు ఈ పత్రంపై సంతకం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత లొంగిపోయిన సైనికుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు.[6][7] ఒప్పందంపై సంతకం పెట్టినప్పటికీ, 1974 ఫిబ్రవరి వరకు పాకిస్తాన్ అధికారికంగా బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని గుర్తించలేదు.[8][9]
ఈ ఒప్పందాన్ని అన్ని పక్షాలు అనుమోదించడంతో సంఘర్షణ సమయంలో పాకిస్తాన్ చేసిన బంగ్లాదేశ్ మారణహోమానికి ముగింపు పలికినట్లైంది. బంగ్లాదేశ్, భారత సాయుధ దళాలు 1971 లో పాకిస్తాన్ ఓటమి, లొంగుబాటుల వార్షికోత్సవాన్ని జరుపుకుంటాయి. డిసెంబరు 16 ని విజయ దినంగా పాటిస్తాయి.[10][11][12]
లొంగుబాటు వేడుక
మార్చులొంగుబాటు వేడుక 1971 డిసెంబరు 16 న తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్), డాకాలోని రామనా రేస్ కోర్స్‌లో జరిగింది: పాకిస్తాన్ సైన్యానికి చెందిన AAK నియాజీ అధికారికంగా భారత సైనిక అధికారి, బంగ్లాదేశ్ దళాల జాయింట్ కమాండర్ అయిన జగ్జిత్ సింగ్ అరోరాకు లొంగిపోయాడు. బంగ్లాదేశ్ దళాల డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ AK ఖండ్కర్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తరఫున ఈ వేడుకలో ప్రాతినిధ్యం వహించాడు.[13]
పాకిస్తాన్ ఈస్టర్న్ కమాండ్ నుండి పాకిస్తాన్ నేవీకి చెందిన మహ్మద్ షరీఫ్, పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన పాట్రిక్ డెస్మండ్ కల్లాఘన్ కూడా ఉన్నారు. వీరిద్దరూ నియాజీతో కలిసి ఒప్పందంపై సంతకం చేశారు. [14] సాగత్ సింగ్, ఇండియన్ IV కార్ప్స్ కమాండర్ ; హరి చంద్ దేవాన్, భారత తూర్పు ఎయిర్ కమాండ్ కమాండర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఇండియన్ ఈస్టర్న్ కమాండ్ అయిన JFR జాకబ్‌లు[15][16] భారతదేశం తరపున సాక్షులుగా వ్యవహరించారు.
నియాజీ లొంగిపోవడాన్ని అంగీకరించగానే, రేస్‌కోర్సులో ఉన్న జనం వెంటనే సంబరాల్లో మునిగిపోయారు.[17]
పత్రం లోని పాఠ్యం
మార్చులొంగుబాటు పత్రం ఇప్పుడు భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రభుత్వాల ఆస్తి. దీన్ని న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. ఈ పత్రం లోని పాఠ్యం క్రింది విధంగా ఉంది:[18][19]
లొంగుబాటు పత్రం
బంగ్లా దేశ్‌లోని పాకిస్తాన్ సాయుధ దళాలన్నిటినీ తూర్పు థియేటర్‌లోని భారత, బంగ్లా దేశ్ దళాల చీఫ్ కమాండింగ్ జనరల్ ఆఫీసరైన లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు అప్పగించడానికి పాకిస్తాన్ ఈస్టర్న్ కమాండ్ అంగీకరించింది. ఈ లొంగుబాటులో పాకిస్తాన్‌కుచ్ ఎందిన భూ, వైమానిక, నావికా బలగాలతో పాటు అన్ని పారా-మిలటరీ బలగాలు, పౌర సాయుధ బలగాలు కూడా భాగం. లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ఆధ్వర్యంలో ఈ బలగాలు తమ ఆయుధాలను వదిలి, వారు ప్రస్తుతం ఉన్న ప్రదేశాలలో లొంగిపోతారు. ఈ పత్రంపై సంతకం చేసిన వెంటనే పాకిస్థాన్ ఈస్టర్న్ కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా అధీనం లోకి వస్తుంది. ఆదేశాల ధిక్కరణ అనేది లొంగుబాటు నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అమల్లో ఉన్న చట్టాలు, యుద్ధ నిబంధనలకు అనుగుణంగా దీనిపై వ్యవహరిస్తారు. సరెండర్ నిబంధనలకు అర్థం లేదా వివరణపై ఏవైనా సందేహాలు తలెత్తితే లెఫ్టినెంట్-జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాదే తుది నిర్ణయం. లెఫ్టినెంట్-జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా లొంగిపోయిన సిబ్బందిని గౌరవంగా, హుందాగా చూస్తారని, జెనీవా ఒడంపబడిక నిబంధనల ప్రకారం లొంగిపోయిన పాకిస్తాన్ సైనికుల, అర్ధ సైనికుల భద్రత, శ్రేయస్సును కల్పిస్తామని గంభీరమైన హామీ ఇచ్చారు. లెఫ్టినెంట్-జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ఆధ్వర్యంలోని బలగాలు విదేశీ పౌరులు, జాతి మైనారిటీలు, పశ్చిమ పాకిస్తాన్ మూలాలకు చెందిన సిబ్బందికి రక్షణ కల్పిస్తాయి. | |
<సంతకం> | <సంతకం> |
(జగ్జీత్ సింగ్ అరోరా) |
(అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ) |
మూలాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Burke, S. M. (1974). Mainsprings of Indian and Pakistani foreign policies. Minneapolis: University of Minnesota Press. ISBN 978-0-8166-6172-5. OCLC 234380949.
...continuing deadlock over the release of some 93,000 Pakistani prisoners of war, including 15,000 civilian men, women and children, captured in East Pakistan (the few hundred prisoners captured by each side on the Western front were exchanged on December 1, 1972).
- ↑ "Dacca Captured". The New York Times. 17 December 1971.
- ↑ "An unprecedented surrender, and the birth of a nation". 16 December 2022.
- ↑ "The Surrender Document". The New York Times. 17 December 1971. Archived from the original on 16 December 2021. Retrieved 19 June 2021.
- ↑ "Flashback: From behind the barbed wire". Dawn (in ఇంగ్లీష్). 16 December 2012. Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
- ↑ Koul, Bill K. (2020). The Exiled Pandits of Kashmir: Will They Ever Return Home? (in ఇంగ్లీష్). Springer Nature. p. 254. ISBN 978-981-15-6537-3. Archived from the original on 27 July 2023. Retrieved 20 January 2022.
More than 90,000...., the largest ever since World War 2.
- ↑ "Country marks 50 years of 1971 war". The Hindu (in Indian English). 16 December 2021. ISSN 0971-751X. Archived from the original on 26 January 2022. Retrieved 2022-01-26.
It was the largest military surrender after the Second World War and the Indian armed forces, along with Mukti Bahini, liberated Bangladesh in a span of just 13 days and also the surrender of 93,000 Pakistani soldiers, the largest surrender of armed forces post Second World War.
- ↑ "Pakistan Admits That Bangladesh Exists as Nation". The New York Times. 23 February 1974.
- ↑ "Recognition, as equals". 17 March 2020.
- ↑ "Vijay Diwas '23: How Indian Army made Pakistani counterpart surrender in just 13 days & liberated Bangladesh". The Economic Times. 16 December 2023.
- ↑ "Victory Day celebrated". 16 December 2022.
- ↑ "Birth of a Nation". The New York Times. 25 December 1971.
- ↑ Howard S. Levie (January 1974). "The Indo-Pakistani Agreement of August 28, 1973". American Society of International Law.
- ↑ "A leaf from history: The fall and surrender". 13 May 2012.
- ↑ "Witnessing the surrender of Pakistan". 16 December 2020.
- ↑ "How Lt General JFR Jacob secured Pakistan's surrender in 1971". 16 December 2020.
- ↑ Kuldip Nayar (1998-02-03). "Of betrayal and bungling". Indian Express. Archived from the original on 2014-05-17. Retrieved 2014-05-17.
- ↑ "The Instrument of Surrender". Virtual Bangladesh. 2015. Archived from the original on 17 March 2018. Retrieved 9 December 2016.
- ↑ "The Separation of East Pakistan". Story of Pakistan. 2003-06-01. Archived from the original on 2 October 2018. Retrieved 2020-07-28.