పాక్ జలసంధి
భారతదేశం యొక్క తమిళనాడు రాష్ట్రానికి, ద్వీప దేశమైన శ్రీలంక యొక్క ఉత్తర ప్ర్రాంతంలోని మన్నార్ జిల్లాకు మధ్యనున్న ఒక జలసంధి పాక్ జలసంధి. ఇది పాక్ అఖాతంతో ఈశాన్యంలోని బంగాళాఖాతాన్ని, అక్కడనుండి నైరుతిలోని మన్నార్ గల్ఫ్ తో కలుపుతుంది. ఈ జలసంధి 33 నుంచి 50 మైళ్ళ (53 నుంచి 80 కిలోమీటర్లు) విస్తృతంగా ఉంటుంది. తమిళనాడులోని వైగై నది సహా అనేక నదులు దీని లోకి ప్రవహిస్తాయి. ఈ జలసంధికి రాబర్ట్ పాక్ పేరు పెట్టారు, ఇతను కంపెనీ రాజ్ కాలంలో (1755-1763) మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్.
భౌగోళిక స్థితిసవరించు
ఇది అల్ప ద్వీపాల, ఇసుకమేట దిబ్బల వంటి వాటి యొక్క చైన్ తో దక్షిణ ముగింపు వద్ద నిండి ఉంటుంది, వీటిని సమష్టిగా ఆడం బ్రిజ్ అంటారు. ఈ గొలుసు తమిళనాడులోని పంబన్ ద్వీపం ధనుష్కోడి (రామేశ్వరం ద్వీపం), శ్రీలంకలోని మన్నార్ ద్వీపం మధ్య విస్తరించివుంది. రామేశ్వరం ద్వీపం పంబన్ వంతెన ద్వారా భారత ప్రధాన భూభాగానికి అనుసంధానించబడింది.
చరిత్రసవరించు
1914 నుండి, మద్రాసు నుండి ధనుష్కోడికి రెగ్యులర్ రైళ్లు, మన్నార్ ద్వీప తలైమన్నార్ కు ఒక ఫెర్రీ, అక్కడి నుండి కొలంబోకి ఒక రైలు ఉండేది. 1964 తుపాను తరువాత ఇది ఆగిపోయింది.[1]
మూలాలుసవరించు
- ↑ "The Hindu : LAND'S END". web.archive.org. 2004-10-14. Archived from the original on 2004-10-14. Retrieved 2023-02-17.