లాటిన్ భాషలో paganus అంటే పల్లెటూరివాడు అని అర్థం. పశ్చిమ దేశాలలో యూదా, క్రైస్తవ, ఇస్లాం మతాలు కాకుండా ఇతర విగ్రహారాధక మతాలని నమ్మేవారిని పాగన్లని అంటారు. పశ్చిమ దేశాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు కూడా కొన్ని గణాల ప్రజలు విగ్రహారాధక మతాలని నమ్ముతారు. వీరిని ఇంగ్లిష్ భాషలో పాగన్ లేదా హీదెన్ (Heathen) అని అంటారు.

"మాయా" సమాజం పూజారులు అగ్ని చుట్టూ నాట్యం చేయడం. మాయా జానపద మతాచారాలు పాగనిజం క్రిందికి వస్తాయి.

ఐరోపా లో పాగనిజం

మార్చు

యూరోపియన్ దేశాలని క్రైస్తవీకరంచిన తరువాత ఐరోపా లో పాగన్ మతాలు దాదాపుగా కను మరుగయ్యాయి. స్కాండినేవియాలో క్రైస్తవీకరణ క్రీస్తు శకం 800 సంవత్సరాల తరువాత మొదలైనప్పటికీ 1721 తరువాతి కాలంలో కూడా అక్కడ కొంత మంది పాగన్లు ఉండేవారు. ప్రాచీన గ్రీక్, రోమన్ మతాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఐరోపా లో నయా పాగనిజం (neo-paganism) పేరుతో కొంత మంది పాగన్ విశ్వాసాలని పునరుధ్దరిస్తున్నారు.

మధ్య అమెరికాలో పాగనిజం

మార్చు

సెంట్రల్ అమెరికాలో పాగనిజం ఇంకా సజీవంగా ఉంది. గ్వాటెమాలా దేశ ప్రభుత్వం స్థానిక మాయా మతానికి, మాయా భాషకి ప్రోత్సాహం అందిస్తోంది.

స్కాండినేవియా పాగనిజం

మార్చు

స్కాండినేవియా పాగనిజం (Norse paganism) ఒకప్పుడు స్కాండినేవియా ప్రజలు నమ్మిన మతం. క్రీస్తు శకం 800 సంవత్సరాల కాలానికి ముందు స్కాండినేవియా దేశాలలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందలేదు. ఆ కాలంలో స్కాండినేవియా ప్రజలు గణ మతాలు (folk religions) \విగ్రహారాధక మతాలు (pagan religions) ని నమ్మేవారు. స్కాండినేవియాని క్రైస్తవీకరించిన తరువాత (18వ శతాబ్దం చివరి నాటికి) స్కాండినేవియాలోని సంప్రదాయక విగ్రహారాధక గణ మతాలు పూర్తిగా కనుమరుగు అయ్యాయి. నార్స్ పాగన్లలో జంతు బలులతో పాటు నర బలులు కూడా ఇచ్చే సంప్రదాయం ఉండేది.

నయా పాగనిజం

మార్చు

నయా పాగనిజం (Neo-paganism) అనేది ప్రస్తుతం పశ్చిమ దేశాలలో కొనసాగుతున్న పాగన్ మతాల పునరుధ్దరణ ఉద్యమం. వీరు పాగన్ (విగ్రహారాధక మతాల) ఆచారాలలో యూదా క్రైస్తవ ఆచారాలని చేర్చి కొత్త తరహా పాగన్ మతాలని సృష్ఠిస్తున్నారు.

ఉత్తర అమెరికాలో నయా పాగనిజం - 2001లో జరిపిన సర్వే ప్రకారం ఉత్తర అమెరికాలో 307,000 మంది నయా పాగన్లు ఉన్నారు.[ఆధారం చూపాలి]

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పాగనిజం&oldid=4193933" నుండి వెలికితీశారు