పాట్ కమ్మిన్స్
పాట్రిక్ జేమ్స్ కమిన్స్ (ఆంగ్లం: Pat Cummins; జననం 1993 మే 8) ఒక ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటర్, అతను టెస్ట్ ఇంకా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అతను ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. 2023 జనవరి నాటికి, కమిన్స్ ICC టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. కమ్మిన్స్ 2015 క్రికెట్ ప్రపంచ కప్ - 2021 ICC T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియన్ జట్టులో సభ్యుడు,2023 ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విజేతగా నిలిచాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పాట్రిక్ జేమ్స్ కమిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వెస్ట్‌మీడ్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా | 1993 మే 8|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | కమ్మో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 189 cమీ. (6 అ. 2 అం.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయిfast | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 423) | 2011 17 నవంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 28 జూలై - ఇంగ్లండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 189) | 2011 19 అక్టోబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2022 22 నవంబర్ - ఇంగ్లండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 30 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 51) | 2011 13 అక్టోబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 4 నవంబర్ - ఆఫ్ఘనిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 30 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11–present | న్యూ సౌత్ వేల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | సిడ్నీ సిక్సర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013/14 | పెర్త్ స్కార్చర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | కోల్‌కతా నైట్ రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014/15–2018/19 | సిడ్నీ థండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | ఢిల్లీ డేర్‌డెవిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–2022 | కోల్‌కతా నైట్ రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 21 June 2023 |
కమిన్స్ తన 18వ ఏట 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గాయాలు అతన్ని 2015 వరకు అంతర్జాతీయ క్రికెట్‌కు,2017 వరకు టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉంన్నాడు. 2019 క్రికెట్ సీజన్ పూర్తయిన తర్వాత, కమ్మిన్స్‌కు ఆ సంవత్సరపు ఉత్తమ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా అలన్ బోర్డర్ మెడల్,ICC టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండూ లభించాయి.2021 నవంబరులో ఆస్ట్రేలియా కెప్టెన్గా ఎంపికయ్యాడు.[2] పాట్రిక్ జేమ్స్ కమిన్స్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అతను 145 కిమీ/గం కంటే ఎక్కువ వేగంగా బంతులు వేయగల బౌలర్.
ప్రారంభ జీవితం
మార్చుకమ్మిన్స్ తన ఇద్దరు సోదరులు,ఇద్దరు సోదరీమణులతో కలిసి బ్లూ మౌంటైన్స్‌లోని మౌంట్ రివర్‌వ్యూలో పెరిగాడు. అతను సెయింట్ పాల్స్ గ్రామర్ స్కూల్లో చదివాడు. చిన్నతనంలో అతను బ్రెట్ లీని ఆరాధించాడు, అతనితో అతను తరువాత అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.[3][4]
మూడు సంవత్సరాల వయస్సులో, కమ్మిన్స్ తన సోదరి అనుకోకుండా తన చేతిపై తలుపు వేయటం వలన అతని కీలకమయిన కుడి చేతి మధ్య వేలు పైభాగాన్ని కోల్పోయాడు..[5] 2020 ఫిబ్రవరిలో, కమ్మిన్స్ తన చిరకాల స్నేహితురాలు బెకీ బోస్టన్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు; ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. వారు 2022 ఆగస్టు 1న వివాహం చేసుకున్నారు.అతని తల్లి మరియా కమ్మిన్స్ సుదీర్ఘకాలం అనారోగ్యంతో 2023 మార్చి 10న కన్నుమూశారు.
వృత్తి
మార్చుకమ్మిన్స్కు 2011 జూన్లో క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ లభించింది 2011 అక్టోబరు 13న, కమ్మిన్స్ దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున ట్వంటీ20 అరంగేట్రం చేశాడు . 2011 అక్టోబరు 19న, అతను దక్షిణాఫ్రికాపై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2011 నవంబరు 17న జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై కమిన్స్ తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇది అతని కెరీర్‌లో నాల్గవ ఫస్ట్-క్లాస్ మ్యాచ్, ఇయాన్ క్రెయిగ్ తర్వాత ఆస్ట్రేలియా యొక్క అతి పిన్న వయస్కుడైన టెస్ట్ క్రికెటర్ అయ్యాడు వివిధ గాయాల కారణంగా 1946 రోజులు (5 సంవత్సరాలు, 3 నెలలు, 27 రోజులు, లేదా సరిగ్గా 278 వారాలు) తర్వాత, కమిన్స్ 2017 మార్చి 17న టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు.యాషెస్ సిరీస్‌లో అత్యుత్తమంగా నిలిచాడు.[6]. 2022 నవంబరు 17న, ఆరోన్ ఫించ్ ఒక వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, కమ్మిన్స్ ODIలలో మొదటిసారి ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
కమ్మిన్స్ తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టోర్నమెంట్ యొక్క 2014 ఎడిషన్‌లో 2014లో అరంగేట్రం చేసాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు, అతను IPL 2015 కోసం తిరిగి వచ్చాడు. అతను IPL 2016లో ఆడలేదు, IPL 2017లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడాడు .2019 జనవరిలో, కమిన్స్ ట్రావిస్ హెడ్‌తో పాటు ఆస్ట్రేలియా యొక్క ఇద్దరు టెస్ట్ వైస్-కెప్టెన్‌లలో ఒకడు అయ్యాడు.2022 ఏప్రిల్లో, కమిన్స్ IPL 2022లో ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లో 50 పరుగులు చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును సమం చేశాడు. అతను ఈ రికార్డును KL రాహుల్‌తో పంచుకున్నాడు.తుంటి ఎముక గాయం కారణంగా కమిన్స్ ఐపీఎల్ 2022 నుంచి వైదొలిగాడు.[7].7- 2023 జూన్ 11 మధ్య భారత్‌తో జరిగిన ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 లో కమిన్స్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు .
2023 యాషెస్‌లో 4వ టెస్టు తర్వాత, కెప్టెన్‌గా కమిన్స్ వ్యూహాలపై ఆందోళనలు జరిగాయి, 2023 ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు.[8]
మూలాలు
మార్చు- ↑ "Pat Cummins". www.cricket.com.au. Retrieved 28 January 2019.
- ↑ "Cummins confirmed as Test captain, Smith his deputy after being usurped". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 26 November 2021.
- ↑ "Pat Cummins is tickled pink to be a sixer". Daily Telegraph. 16 July 2011.
- ↑ "Pat Cummins is world cricket's next big thing". Herald Sun. 18 November 2011.
- ↑ "The unusual tale of Pat's short finger". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 18 March 2017.
- ↑ Sai, Anand. "Pat Cummins : ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ జట్టుకు షాక్.. భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కెప్టెన్ దూరం!". Hindustantimes Telugu. Retrieved 2023-08-16.
- ↑ "Pat Cummins IPL: ఐపీఎల్ నుంచి కోల్‌కతా పేసర్ పాట్ కమిన్స్ ఔట్.. కారణం ఇదే!". Zee News Telugu. 2022-05-13. Retrieved 2023-08-16.
- ↑ Staff, Scroll (2023-08-07). "ICC Men's ODI World Cup 2023: Pat Cummins set to lead Australia as preliminary squad announced". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-16.