పాడనా తెనుగు పాట
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పాడనా తెలుగు పాట అమెరికా అమ్మాయి (1976) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన అద్భుతమైన తెలుగు పాట. దీనిని పి. సుశీల మధురంగా గానం చేయగా జి.కె.వెంకటేష్ సంగీతాన్ని సమకూర్చారు.
నేపథ్యం
మార్చుఅమెరికానుండి తిరిగి వస్తూ ఒక యువకుడు (శ్రీధర్) 'డెబొరా' అనే ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకొని వెంటతీసుకొస్తాడు. ఆ కుర్రవాని పెళ్ళికై పెద్దవాళ్ళు అనుకొన్న ఆశలు వమ్ము కాగా వారు మనస్తాపానికి గురౌతారు. క్రమంగా ఆ డెబొరా 'దేవి'గా మారి తెలుగు కట్టు, బొట్టు, మాట, పాటలు అలవరచుకొని అందరినీ ఆకట్టుకోవడం సందర్భంలో ఈ పాటను రంగస్థలం మీద డెబొరా గా నటించిన ఫ్రెంచి వనిత ఆన్నే షేమోటీ అభినయిస్తుంది. ముగ్ధులైన అబ్బాయి తల్లిదండ్రులు ఆ అమెరికా అమ్మాయితో పెళ్ళికి అంగీకరిస్తారు.
పాట
మార్చుపల్లవి:
పాడనా తెలుగు పాట - పరవశనై - నే
పరవశనై మీ యెదుట మీ పాట ||| పాడనా |||
చరణం 1:
కోవెల గంటల గణగణలో - గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపులపైన - మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట ... ఒక పాట ||| పాడనా |||
చరణం 2:
త్యాగయ, క్షేత్రయ, రామదాసులు - తనివితీర వినిపించినదీ
నాడు నాడున కదిలించేదీ - వాడవాడలా కరిగించేదీ
చక్కెర మాటల మూట - చిక్కని తేనెల ఊట ... ఒక పాట ||| పాడనా |||
చరణం 3:
ఒళ్ళంత ఒయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి - మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెల - అల్లనల్లన నడయాడే
తెలుగుతల్లి పెట్టనికోట - తెనుగునాట ప్రితినోట ... ఒక పాట ||| పాడనా |||
వివరణ
మార్చుఈ పాట మొదటి చరణంలో తెలుగు భాష తియ్యదనాన్ని వివరిస్తుంది. రెండవ చరణంలో కర్ణాటక సంగీత వాగ్గేయకారుల్ని తనివితీరగా వినిపించిన మహోన్నతమైనదిగా తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు. మూడవ చరణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయలలో తెలుగువారి కట్టు బొట్టు హుందాతనాన్ని పాశ్చాత్య దిశగా పయనిస్తున్న ఆధునిక యువతకు తెలియజేసింది.