అమెరికా అమ్మాయి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పాశ్చాత్య ధోరణుల పట్ల వెర్రి వ్యామోహం పెంచుకొనే యువతకు మన నాగరికత విశిష్టతను గుర్తు చేసే ఈ చిత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక ముఖ్యమైన చిత్రం. అమెరికానుండి తిరిగి వస్తూ ఒక యువకుడు (శ్రీధర్) 'డెబొరా' అనే ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకొని వెంటతీసుకొస్తాడు. ఆ కుర్రవాని పెళ్ళికై పెద్దవాళ్ళు అనుకొన్న ఆశలు వమ్ము కాగా వారు మనస్తాపానికి గురౌతారు. క్రమంగా ఆ డెబొరా 'దేవి'గా మారి తెలుగు కట్టు, బొట్టు, మాట, పాటలు అలవరచుకొని అందరినీ ఆకట్టుకోవడం ఈ చిత్ర కథాంశం.
అమెరికా అమ్మాయి (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
---|---|
తారాగణం | ఆన్నే షేమోటీ (Anne Chaymotty), శ్రీధర్, దీప, రంగనాథ్, పండరీబాయి |
సంగీతం | జి.కె.వెంకటేష్ |
నేపథ్య గానం | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్ |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
నిర్మాణ సంస్థ | నవత ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కొన్ని విశేషాలు
మార్చు- ఈ చిత్రాన్ని ఎంతో శ్రమకోర్చి తీశారు. ముందుగా ఒక పాశ్చాత్య యువతిని 'అమెరికా అమ్మాయి'గా ఎంపిక చేయగా ఆమె మధ్యలో (వీసా సమస్య వల్ల) దేశంనుండి నిష్క్రమించింది. అప్పుడు ఆన్నే షేమోటీ (Anne Chaymotty) అనే 'ఫ్రెంచి వనిత'ను 'అమెరికా అమ్మాయి'గా తీసుకొన్నారు. ఆమెకు నాట్యంలో విశిష్టమైన శిక్షణ ఇచ్చారు (వెంపటి చినసత్యం?)
- కథానాయిక చిదంబర దేవస్థానం మండపంలో 'ఆనంద తాండవమాడే శివుడు' పాటకు అద్భుతంగా నర్తించింది.
- స్టేజిమీద యువతీయువకులు (దీప, రంగనాధ్ వగైరా) 'లవ్ మి లవ్ మి లవ్ మి' అనే ఇంగ్లీషు పాటకు డాన్స్ చేస్తారు. ఇలా ఇంగ్లీషు వారెవరైనా తెలుగు పాట ప్రదర్శించలేరు అని రంగనాధ్ సవాలు చేయగా 'అమెరికా అమ్మాయి' "పాడనా తెలుగు పాట" అనే పాట పాడుతుంది. ఈ పాట ఊరూరా మారుమ్రోగింది.
- తరువాత ఆన్నే షేమోటీ "దేవయాని" అనే పేరుమీద ప్రసిద్ధ భరతనాట్య నర్తకి అయ్యింది. ఆ వివరాలు ఇక్కడ, ఆమెతో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చును.
పాటలు
మార్చుసంఖ్య | పాట | గాయకులు | గీతరచన | సంగీతం |
---|---|---|---|---|
1. | ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు | పి.సుశీల | సి.నారాయణరెడ్డి | జి.కె.వెంకటేష్ |
2. | ఆమె తోటి మాటుంది | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం | మైలవరపు గోపి | జి.కె.వెంకటేష్ |
3. | పాడనా తెలుగు పాట పరవశమై నే పరవశమై మీ ఎదుట ఈపాట | పి.సుశీల | దేవులపల్లి కృష్ణశాస్త్రి | జి.కె.వెంకటేష్ |
4. | ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక | జి. ఆనంద్ | మైలవరపు గోపి | జి.కె.వెంకటేష్ |
5. | జిలిబిలి సిగ్గుల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | ఆరుద్ర | జి.కె.వెంకటేష్ |
6. | లవ్ మి లవ్ మి లవ్ మి ఓ టెల్ మి టెల్ మి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | ఆరుద్ర | జి.కె.వెంకటేష్ |
7. | డార్లింగు లింగు లిటుకు | మాధవపెద్ది రమేష్, బి.వసంత | ఆరుద్ర | జి.కె.వెంకటేష్ |
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.