పానీ పూరి

భారతీయ చిరుతిండి

పానీ పూరి ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న పూరీలను మధ్యలో ఒక ప్రత్యేక పానీయం ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు.

పానీ పూరి

చరిత్ర

మార్చు

పానీపూరీ ఉత్తర ప్రదేశ్ ప్రాంతం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది బెనారస్ ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు.[1][2] 1970 ప్రాంతాల్లో బెంగుళూరుకు గుజరాతీయుల రాకతో ఇది ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందింది.

తయారీ

మార్చు

కర కరలాడే చిన్నపాటి పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. ఇవి ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి.

మూలాలు

మార్చు
  1. "Some visitors are impressed with the unique foods of the city, famous among them are Aalu Chap (a hot potato preparation), Golgappa (a juicy preparation)..",The National Geographical Journal of India - Page 116, Published by National Geographical Society of India, 1955
  2. "Suddenly my gaze travelled to the nearby Banarsi golgappa seller's hand trolley.."The Dreamer - Page 50, by Krishan Chandar, Jai Ratan - Short stories, Indic (English). - 1970 - 160 pages
"https://te.wikipedia.org/w/index.php?title=పానీ_పూరి&oldid=3887386" నుండి వెలికితీశారు