పామ్ జెమ్స్

ఆంగ్ల నాటక రచయిత్రి

పామ్ జెమ్స్ (1925, ఆగస్టు 1 - 2011, మే 13) ఆంగ్ల నాటక రచయిత్రి.[1][2] అనేక నాటకాలను రాయడంతోపాటు యూరోపియన్ నాటక రచయితలు రాసిన రచనలకు అనుసరణలు చేసింది. జెమ్స్ 1978లో రాసిన పియాఫ్ అనే సంగీత నాటకంతో ప్రసిద్ధి చెందింది.

పామ్ జెమ్స్
పుట్టిన తేదీ, స్థలం1925, ఆగస్టు 1
హాంప్‌షైర్‌, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
మరణం2011 మే 13(2011-05-13) (వయసు 85)
లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
వృత్తినాటక రచయిత్రి
భాషఆంగ్లం
రచనా రంగంనాటకరంగం
బంధువులుజోనాథన్ జెమ్స్ (కుమారుడు)

పామ్ 1925, ఆగస్టు 1న హాంప్‌షైర్‌లోని బ్రాన్స్‌గోర్ జన్మించింది. తన ఎనిమిదేళ్ల వయసులో ప్రాథమిక పాఠశాలలో తన తోటి విద్యార్థులచే గోబ్లిన్, దయ్యాల కథతో తన మొదటి నాటకం ప్రదర్శించింది. మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్రాన్ని అభ్యసించి 1949లో పట్టా పొందింది.[3] నలభై ఏళ్ళ వయసులో వృత్తిపరంగా రచనలు చేయడం ప్రారంభించింది. ఫ్రెంచ్ గాయకుడు ఎడిత్ పియాఫ్ గురించి 1978లో పియాఫ్‌ అనే సంగీత నాటకం రాసి ప్రసిద్ది చెందింది.[4]

1997లో స్టాన్లీ (ఉత్తమ నాటకం) నాటకం, 1999లో మార్లిన్ డైట్రిచ్ పాత్రలో సియాన్ ఫిలిప్స్ నటించిన మార్లీన్ (బెస్ట్ బుక్ ఆఫ్ ఎ మ్యూజికల్) అనే దానికి రెండుసార్లు టోనీ అవార్డులకు నామినేట్ చేయబడింది. హెన్రిక్ ఇబ్సెన్, ఫెడెరికో గార్సియా లోర్కా, అంటోన్ చెకోవ్ నుండి మార్గరీట్ డ్యూరాస్ వరకు నాటకకర్తల రచనలకు అనుసరణలకు స్వీకరించింది.

కుటుంబం

మార్చు

మైనపు మోడల్ తయారీదారుడు మాజీ ఆర్కిటెక్ట్ [5] కీత్ జెమ్స్ తో పాల్ వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు.[6]

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
1984 నైన్టీన్ ఎయిటీ-ఫోర్ చాకలి స్త్రీ

రచనల జాబితా

మార్చు
(నాటకం పేరు, సంవత్సరం, మొదటి ప్రదర్శన చేయబడిన ప్రదేశం)
  • బెట్టీస్ వండర్‌ఫుల్ క్రిస్మస్ (1972), కాక్‌పిట్ థియేటర్, లండన్
  • మై వారెన్ అండ్ ఆఫ్టర్ బర్త్‌డే (1973), ఆల్మోస్ట్ ఫ్రీ థియేటర్, లండన్
  • మిజ్ వీనస్ అండ్ వైల్డ్ బిల్ (1973), ఆల్మోస్ట్ ఫ్రీ థియేటర్, లండన్
  • ఆఫ్టర్ బర్త్ డే (1973)
  • ది అమియబుల్ కోర్ట్‌షిప్ ఆఫ్ మిజ్ వీనస్ అండ్ వైల్డ్ బిల్ (1974), ఆల్మోస్ట్ ఫ్రీ థియేటర్, లండన్
  • గో వెస్ట్ యంగ్ వుమన్ (1974), ది రౌండ్‌హౌస్, లండన్
  • అప్ ఇన్ స్వీడన్ (1975), హేమార్కెట్, లీసెస్టర్
  • మై నేమ్ పేరు రోసా లక్సెంబర్గ్ (అనుసరణ), (1975)
  • అప్ ఇన్ స్వీడన్ (1975)
  • రివర్స్ అండ్ ఫారెస్ట్స్ (అనుసరణ), (1976)
  • డెడ్ ఫిష్ (అకా దుసా, ఫిష్, స్టాస్ అండ్ వీ, 1976), ఎడిన్‌బర్గ్ ఫెస్టివల్
  • గినివెరే (1976), ఎడిన్‌బర్గ్ ఫెస్టివల్
  • ప్రాజెక్ట్ (1976), సోహో పాలీ, లండన్
  • ఫ్రాంజ్ ఏప్రిల్ (1977), ఐసిఏ, లండన్
  • క్వీన్ క్రిస్టినా (1977), అదర్ ప్లేస్, స్ట్రాట్‌ఫోర్డ్-ఆన్-అవాన్
  • పియాఫ్ (1978), అదర్ ప్లేస్, స్ట్రాట్‌ఫోర్డ్-ఆన్-అవాన్
  • లేడీబర్డ్, లేడీబర్డ్ (1979), ది కింగ్స్ హెడ్, ఇస్లింగ్టన్, లండన్
  • సాండ్రా (1979), లండన్
  • ఆంట్ మేరీ (1982), వేర్‌హౌస్ థియేటర్, లండన్
  • ది ట్రీట్ (1982), ఐసిఏ, లండన్
  • ది చెర్రీ ఆర్చర్డ్ (అనుకూలత) (1984)
  • వెరైటీ నైట్ (1982), లండన్
  • కామిల్లె (అనుసరణ) (1984)
  • లవింగ్ వుమెన్ (1984)
  • ది డాంటన్ ఎఫైర్ (1986)
  • పసియోనారియా (1985), ప్లేహౌస్ థియేటర్, న్యూకాజిల్ అపాన్ టైన్
  • ఆర్థర్ అండ్ గినివెరే (1990), ఎడిన్‌బర్గ్
  • ది సీగల్ (అనుసరణ) (1991)
  • ది బ్లూ ఏంజెల్ (1991), అదర్ ప్లేస్, స్ట్రాట్‌ఫోర్డ్-ఆన్-అవాన్
  • డెబోరాస్ డాటర్ (1994), మాంచెస్టర్
  • గోస్ట్స్ (అనుసరణ) (1994)
  • మార్లిన్ (1996), ఓల్డ్‌హామ్
  • స్టాన్లీ (1996), లండన్
  • ఎట్ ది విండో (1997)
  • ది స్నో ప్యాలెస్ (1998)
  • ఎబ్బా (1999)
  • గిరాబాల్డి, సి! (2000)
  • లిండర్‌హాఫ్ (2001)
  • మిస్సెస్ పాట్ (2002), థియేటర్ రాయల్, యార్క్
  • యెర్మా (అనుసరణ) (2003), రాయల్ ఎక్స్ఛేంజ్ థియేటర్ మాంచెస్టర్
  • నాట్ జోన్ ది మ్యూజికల్ (2003)
  • ది లేడీ ఫ్రమ్ ది సీ (అనుసరణ) (2003), ఆల్మెడ థియేటర్ లండన్
  • ది లిటిల్ మెర్మైడ్ (అనుసరణ) (2004), గ్రీన్‌విచ్ థియేటర్, రివర్‌సైడ్ థియేటర్, లండన్
  • నెల్సన్ (2004), నఫీల్డ్ థియేటర్, సౌతాంప్టన్
  • బ్రాడ్‌వే లేడీ (2007)
  • పియాఫ్ (2008), డోన్మార్ వేర్‌హౌస్, లండన్
  • వింటర్‌లోవ్ (2009), ది డ్రిల్ హాల్, లండన్[8]
  • డెస్పాచెస్ (2009), ది డ్రిల్ హాల్, లండన్[9]

మూలాలు

మార్చు
  1. Lyn Gardner Obituary: Pam Gems, The Guardian, 16 May 2011
  2. "Pam Gems profile at Film Reference.com". NetIndustries. Retrieved 2023-07-11.
  3. William Grimes (17 May 2011). "Pam Gems, British Playwright, Dies at 85". The New York Times.
  4. Lustig, Vera (8 June 1997). "How We Met: Pam Gems And Denise Black - Arts & Entertainment". The Independent. London: Independent Print. Archived from the original on 24 May 2022. Retrieved 2023-07-11.
  5. Queer Mythologies: The Original Stageplays of Pam Gems, Dimple Godiwada, Intellect Books, 2006
  6. "Pam Gems obituary". 16 May 2011.
  7. "Pam Gems". United Agents. Retrieved 2023-07-11.
  8. "Winterlove By Pam Gems". The Drill Hall. Retrieved 2023-07-11.
  9. "Despatches By Pam Gems". The Drill Hall. Retrieved 2023-07-11.

బాహ్య లింకులు

మార్చు