పాలకుర్తి మండలం (జనగామ జిల్లా)

తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం

పాలకుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జనగామ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం పాలకుర్తి

పాలకుర్తి
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, పాలకుర్తి స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, పాలకుర్తి స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, పాలకుర్తి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°39′56″N 79°25′39″E / 17.665614°N 79.427605°E / 17.665614; 79.427605
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం పాలకుర్తి (జనగాం జిల్లా)
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 255 km² (98.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 58,194
 - పురుషులు 29,315
 - స్త్రీలు 28,879
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.73%
 - పురుషులు 59.42%
 - స్త్రీలు 33.56%
పిన్‌కోడ్ 506252
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభా సవరించు

 
పాలకుర్తి మండలం పోలీస్ స్టేషన్.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 58,194, పురుషులు 29,315, స్త్రీలు 28,879. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 255 చ.కి.మీ. కాగా, జనాభా 58,194. జనాభాలో పురుషులు 29,315 కాగా, స్త్రీల సంఖ్య 28,879. మండలంలో 14,060 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు సవరించు

రెవెన్యూ గ్రామాలు సవరించు

 1. కోతులాబాద్
 2. ఇరవెన్ను
 3. తిర్మలగిరి
 4. గూడూర్
 5. బమ్మెర
 6. అయ్యంగారిపల్లి
 7. తొర్రూర్
 8. శాతాపురం
 9. విస్నూర్
 10. లక్ష్మీనారాయణపురం
 11. పాలకుర్తి
 12. కొండాపురం
 13. దర్దెపల్లి
 14. తీగారం
 15. మైలారం
 16. చెన్నూర్
 17. మంచుప్పుల
 18. వల్మిడి
 19. ముత్తారం
 20. మల్లంపల్లి
 21. వావిలాల

మండలం లోని ప్రముఖులు సవరించు

ప్రధాన వ్యాసం: పాల్కురికి సోమనాథుడు

సోమనాథుడు సా.శ. 1190 లో పాలకుర్తి మండలం,పాలకుర్తి గ్రామంలో విష్ణురామిదేవుడు శ్రియాదేవి దంపతులకు జన్మించాడు.సోమేశ్వరుని భక్తుడై ఆ స్వామిమీద సోమనాథ స్తవం రాశాడు. జానపద తెలుగు కవిత్వానికి,ద్విపద ఛందస్సుకు ప్రాచుర్యాన్ని చేకూర్చాడు. వీర శైవ మతావలంబకుడు. తెలుగు, కన్నడ భాషలలో రచనలు చేశాడు. తెలుగులో ఆనాటి సంప్రదాయానికి భిన్నంగా దేశభాషలో ద్విపద రచనలు చేశాడు.

మామిండ్ల రమేశ్ రాజా సవరించు

మామిండ్ల రమేశ్ రాజా, కవి,రచయిత, విప్లవ మూర్తి ఐలమ్మ, వికసించని మందారాలు, సామాజిక కిరణాలు పుస్తకాలు రాశారు.

మూలాలు సవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు సవరించు