స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజను
స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. జనగామ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 5 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం, స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
మార్చుస్టేషన్ ఘన్‌పూర్ డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | స్టేషన్ ఘన్‌పూర్ మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
2 | చిల్పూర్ మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
3 | జాఫర్‌గఢ్ మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
4 | పాలకుర్తి మండలం | 21 రెవెన్యూ గ్రామాలు |
5 | కొడకండ్ల మండలం | 9 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-06-02.
- ↑ "Revenue Mandals | JANGAON DISTRICT | India". www.jangaon.telangana.gov.in. Archived from the original on 2021-04-19. Retrieved 2022-06-02.
- ↑ "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-06-02.