పాలవలస విక్రాంత్
పాలవలస విక్రాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 నవంబరు 11 న ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యాడు.[1]
పాలవలస విక్రాంత్ | |||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 2021 నవంబరు 23 – పదవిలో ఉన్నారు | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | పాలకొండ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1971 డిసెంబరు 23||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | పాలవలస రాజశేఖరం, ఇందుమతి | ||
జీవిత భాగస్వామి | గౌరీ పార్వతి | ||
బంధువులు | రెడ్డి శాంతి | ||
సంతానం | సాయి గణేష్, మణికంఠ కార్తికేయ | ||
నివాసం | పాలకొండ, శ్రీకాకుళం జిల్లా | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఈ | ||
మతం | హిందూ మతము |
జననం, విద్యాభాస్యం
మార్చుపాలవలస విక్రాంత్ 1971 డిసెంబరు 23 న ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, పాలకొండలో పాలవలస రాజశేఖరం, ఇందుమతి దంపతులకు జన్మించాడు. ఆయన బీఈ ( బ్యాచ్‌లర్ ఆఫ్ ఇంజనీరింగ్) పూర్తి చేశాడు.[2]
కుటుంబ నేపథ్యం
మార్చుపాలవలస విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖరం ఉణుకూరు నియోజక వర్గం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, శ్రీకాకుళం జిల్లా జెడ్పీ ఛైర్మన్‌గా పనిచేశాడు. సోదరి రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా, తల్లి ఇందుమతి, రేగిడి జెడ్పీటీసీగా, భార్య గౌరీ పార్వతి, పాలకొండ జెడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.[3]
రాజకీయ జీవితం
మార్చుపాలవలస విక్రాంత్ తన తండ్రి పాలవలస రాజశేఖరం అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా పనిచేశాడు.[4] ఆయనను 2021 నవంబరు 11 న ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఆయనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నవంబరు 16 న బీఫాం అందజేయగా సచివాలయంలో నామిషన్ దాఖలు చేశాడు.[5]
మూలాలు
మార్చు- ↑ Sakshi (11 November 2021). "ముగ్గురు ఎమ్మెల్సీల ఖరారు". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
- ↑ Sakshi Post (16 November 2021). "AP CM YS Jagan Hands Over B-forms To MLC Candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ Andhrajyothy (10 November 2021). "పాలవలస విక్రాంత్‌కు ఎమ్మెల్సీ". Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
- ↑ The Hans India (6 December 2019). "Srikakulam: DCCB, DCMS chairmen assume office" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ TV9 Telugu, TV9 (16 November 2021). "ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం వైఎస్ జగన్". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)