పాలకొండ

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ మండలం లోని జనగణన పట్టణం


పాలకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఈ పట్టణం పాలకొండ రెవిన్యు డివిజన్,పాలకొండ మండలానికి ప్రధాన కేంద్రం.[1] పాలకొండ మేజర్ పంచాయతీ హోదాతో కలిగిన పట్టణం. పిన్ కోడ్ నం. 532 440., యస్.టీ.డీ.కోడ్ = 08941.

పాలకొండ వద్ద తూర్పు కనుమలు
Map

ఇది నూతనంగా ఏర్పడిన పురపాలక సంఘం. దీనికి 2014 ఎన్నికలలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించింది.1881లో ప్రచురితమైన భారతదేశ ఇంపీరియల్ గెజెటర్ ప్రకారం 1,300 కి.మీ.2 (502 చదరపు మైళ్ళు) వైశాల్యంతో పాలకొండ తాలూకా వైజాగ్ జిల్లాలో ఉండేది. సాగు భూములు నాగావళి నదిపై అధారపడి ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో 150 కి.మీ.2 వైశాల్యంగల అభయారణ్యం ఉంది. ఇక్కడ కోయ, సవర, ఇతర కొండజాతులకు చెందిన సుమారు 11,000 జనాభా 106 గ్రామాలలో నివసిస్తున్నారు.1891లో 2,01,331 జనాభాతో పోలిస్తే, 1901లో 2,15,376 జనాభా ఉంది.

గణాంకాలుసవరించు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం- మొత్తం 74,972 - పురుషులు 36,871 - స్త్రీలు 38,101

రవాణా సదుపాయాలుసవరించు

దగ్గరలోని రైల్వే స్టేషన్లు శ్రీకాకుళం, ఆముదాలవలస పార్వతీపురం. పొందూరు.

పాలకొండ శాసనసభ నియోజకవర్గం వివరాలుసవరించు

పాలకొండ పురపాలక సంఘంసవరించు

2014 ఎన్నికలుసవరించు

  • మొత్తం ఓటర్లు : 18420
  • పోలయిన ఓట్లు : 14215

2014 ఎన్నికలలో బలాబలాలు

  తెలుగుదేశం (40%)
  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (26%)
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 పాలకొండ తెలుగుదేశం 15761 12
2014 పాలకొండ కాంగ్రెస్ 86 0
2014 పాలకొండ వై.కా.పార్టీ 3734 3మూలాలుసవరించు

  1. "District Census Handbook-Srikakulam" (PDF). Census of India. pp. 26–28, 54. Retrieved 18 January 2015.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పాలకొండ&oldid=3153324" నుండి వెలికితీశారు