పాల్వాయి రంగయ్య నాయుడు

పాల్వాయి రంగయ్య నాయుడు (18281902) భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. భారత జాతీయ కాంగ్రేసు తొలిదశల్లో ప్రముఖ నాయకుడు.

ప్రారంభ జీవితం

మార్చు

రంగయ్య నాయుడు 1828లో[1] మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక తెలుగు కమ్మ నాయుడు కుటుంబంలో జన్మించాడు. న్యాయవిద్యలో పట్టభద్రుడై, విజయవంతమైన న్యాయవాద ప్రాక్టీసును కొనసాగించాడు. త్వరలోనే మద్రాసు హైకోర్టుకు నియమితుడయ్యాడు.

రాజకీయాలు

మార్చు

ప్రభుత్వంలో భారతీయులకు మరింత ప్రాతినిధ్యాన్ని, స్వయంపాలనను కోరిన అనేక భారతీయ నాయకుల్లో రంగయ్య నాయుడు ఒకడు. 1884లో మద్రాసు ప్రెసిడెన్సీలో తొలి భారతీయ రాజకీయసంస్థ ఐన మద్రాసు మహాజనసభ ఏర్పడినప్పుడు, రంగయ్యనాయుడు దానికి తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు.[2]

రంగయ్య నాయుడు 1885 డిసెంబరులో బొంబాయిలో జరిగిన తొలి భారత జాతీయ కాంగ్రేసు సమావేశానికి మద్రాసు నగరం తరఫున పాల్గొన్నాడు. ఈయన 1883 నుండి 1902 వరకు పచ్చయప్ప కళాశాల ట్రస్టీల్లో ఒకడిగా ఉన్నాడు[3]

రంగయ్య నాయుడు 1893లో మద్రాసు శాసనమండలికి ఎన్నికై, 1893 నుండి 1899 వరకు సభ్యుడిగా ఉన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తమిళ జిల్లాల్లో రంగయ్యనాయుడు కీలకపాత్ర వహించాడు.

రంగయ్య నాయుడు 1902లో ఎగ్మోరులో మరణించాడు. ఎగ్మోరులో ఒక వీధికి ఈయన పేరు, మరో వీధికి ఈయన తండ్రి వీరాస్వామి నాయుడు పేరు పెట్టారు.

మూలాలు

మార్చు
  1. S. R. Mehrotra (1971). The emergence of the Indian National Congress. Vikas Publications. pp. 386.
  2. Bhavan's Journal, Volume 32. Bharatiya Vidya Bhavan. 1985. p. 220.
  3. "Trustees of Pachaiyappa's College". Pachaiyappa College. Archived from the original on 2010-01-10. Retrieved 2017-11-07.