పచ్చయప్ప కళాశాల

పచ్చయప్ప కళాశాల (ఆంగ్లం: Pachaiyappa's College) మద్రాసు లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది 1842 సంవత్సరంలో పచ్చయప్పా ముదలియార్ వీలునామాను అనుసరించి స్థాపించబడింది.

పచ్చయప్ప కళాశాల
Pachaiyappa's College
నినాదంMens Agitat Molem
ఆంగ్లంలో నినాదం
(Mind Moves Matter)
స్థాపితం1842
ప్రధానాధ్యాపకుడుడా. పి.గజవరదన్, M.Sc.,M.Phil.,Ph.D.
స్థానంచెన్నై, తమిళనాడు, భారతదేశం
13°4′23.25″N 80°13′59.05″E / 13.0731250°N 80.2330694°E / 13.0731250; 80.2330694
కాంపస్పట్టణ

నేపథ్యం

మార్చు

పచ్చయ్యప్ప కళాశాలను విద్యాదాత పచ్చయప్ప మొదలియార్ తన వీలునామాలో విద్యాదానం కొరకు కేటాయించిన సొమ్ముతో నిర్మించారు. పచ్చయప్ప మరణానంతరం వారు వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు తినివేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు 1832లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పోలీసు సూపరింటెండెంటు, దాత వెంబాకం రాఘవాచార్యులు అధ్యక్షునిగా, విద్యాదాత కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై ఒకానొక ధర్మకర్తగా ఉన్నారు. 1842లో వెంబాకం రాఘవాచార్యులు మరణించాకా అప్పటి నుంచి శ్రీనివాసపిళ్ళై అధ్యక్షుడై 1852లో తాను మరణించేవరకూ కొనసాగారు. ఈ క్రమంలోనే ఆ ధర్మనిధితో పచ్చయప్ప కళాశాలను నిర్మించారు.[1]

పచ్చయప్పా ముదలియార్

మార్చు

ప్రధానోపాధ్యాయులు

మార్చు
  • జాన్ ఆడమ్ (1884 -1894)
  • ఎరిక్ డ్రూ (1906 - 1912)
  • సి.ఎల్.రెన్ (1920 - 1921)
  • ఎం.రుతునాస్వామి (1921 - 1927)
  • కె.చిన్న తంబిపిళ్ళై (1927 - 1935)
  • పి.ఎన్.శ్రీనివాసాచారి (1935 -1938)
  • డి.ఎస్.శర్మ (1938 -1941)
  • వి.తిరువెంగటసామి (1942-1942)
  • బి.వి.నారాయణస్వామి నాయుడు (1942-1947)
  • ఆర్.కృష్ణమూర్తి (1947-1961)
  • సి.డి.రాజేశ్వరన్ (961-1963)
  • టి.ఎస్.శంకరనారాయణ పిళ్ళై (1963-1966)
  • ఎస్.పి.షణ్ముగనాథన్ (1966-1982)
  • ఎం.కె.దశరథన్ (1982-1984)
  • టి.ఆర్.రామచంద్రన్ (1984-1985)
  • జి.నాగలింగం (1985-1986)
  • ఎన్.పి.కళ్యాణం (1986-1987)
  • ఎన్.కె.నారాయణన్ (1989)
  • ఏ.పి.కమలాకర రావు

ప్రముఖులైన పూర్వ విద్యార్ధులు

మార్చు

కళాశాల అధికారిక వెబ్‌సైట్ లో చాలా మంది ప్రముఖ పూర్వవిద్యార్థులను పేర్కొన్నారు.[2] వారిలో కొందరు:

మూలాలు

మార్చు
  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  2. "Pachaiyappa's College Alumni". Pachaiyappa's College. Archived from the original on 2012-04-03. Retrieved 2012-03-20.

బయటి లింకులు

మార్చు