పాల్వాయి హరీశ్

తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు

పాల్వాయి హరీష్ బాబు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

పాల్వాయి హరీశ్ బాబు

పదవీ కాలం
03 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు కోనేరు కోనప్ప
నియోజకవర్గం సిర్పూర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1981
రెబ్బెన, బెజ్జూర్‌ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పాల్వాయి పురుషోత్తమ రావు, పాల్వాయి రాజ్యలక్ష్మి
నివాసం కాగజ్​నగర్​[1]

జననం, విద్యాభాస్యం మార్చు

పాల్వాయి హరీష్ బాబు 1981లో తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, బెజ్జూర్‌ మండలం, రెబ్బెన గ్రామంలో పాల్వాయి పురుషోత్తమ రావు, పాల్వాయి రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు. తన తండ్రి పాల్వాయి పురుషోత్తమ రావు 1989, 1999లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, తల్లి పాల్వాయి రాజ్యలక్ష్మి 1999లో ఎమ్మెల్యేగా పని చేసింది. హరీష్ బాబు ప్రాథమిక విద్యను సిర్పూర్ కాగజ్‌నగర్ లోని ఫాతిమా కాన్వెంట్ లో నర్సరీ నుండి పదో తరగతి వరకు, ఇంటర్మీడియట్ గుంటూరులో వికాస్ జూనియర్ కళాశాలలో, ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, చెన్నైలోని రామచంద్రయ్య విశ్వవిద్యాలయంలో ఎంఎస్ ఆర్థో విద్యను, 2010-11లో అమెరికాలో ఫెలోషిప్ పూర్తి చేసి తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రిలో చిన్న పిల్లల ఎముకల వైద్య నిపుణులుగా చేరాడు.

రాజకీయ జీవితం మార్చు

డా. పాల్వాయి హరీష్ బాబు తన తల్లితండ్రులు పాల్వాయి పురుషోత్తమ రావు, పాల్వాయి రాజ్యలక్ష్మి[4] అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2018 మే నెలలో నియోజకవర్గంలో బెజ్జూరు మండలం రెబ్బెన పంచాయతీ పరిధిలోని లుంబినీ నగర్ నుండి ప్రారంభించి 600 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టాడు. ఆయన 2018 ఆగష్టులో కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో 24,036 ఓట్లు తేడాతో ఓడిపోయాడు.

డా. పాల్వాయి హరీష్ బాబు ఫిబ్రవరి 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి, ఏప్రిల్ నెలలో పెంచికలేపేట్  మండలం కొండపల్లి పోడు రైతుల పక్షాన పోరాడి 40 రోజుల జైలు జీవితం అనుభవించాడు.[5] ఆయన 2022లో ప్రాణహిత ప్రాజెక్టు సాధన కోసం 75 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు.

పాల్వాయి హరీష్ బాబు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి[6] తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై 3043 ఓట్ల మెజారిటీతో గెలిచి[7] తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[8][9]

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడుశాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[10]

పాల్వాయి హరీష్ బాబును 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[11] ఆయనను ఫిబ్రవరి 14న బీజేపీ శాసనసభ చీఫ్ విప్‌గా నియమించింది.[12]

మూలాలు మార్చు

 1. "Palvai Harish Babu 2023 Election Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 16 December 2023. Retrieved 16 December 2023.
 2. News18 తెలుగు (4 December 2023). "అసెంబ్లీలో అధ్యక్షా అననున్న డాక్టర్లు.. ఎమ్మెల్యేలుగా 16 మంది వైద్యులు..!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. The Hindu (8 December 2023). "New wave, new wins" (in Indian English). Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
 4. Namaste Telangana (4 December 2023). "అప్పట్లో తల్లి, తండ్రి.. ఇప్పుడు తనయుడు.. ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి హరీశ్‌". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
 5. V6 Velugu (18 April 2021). "ఆస్పత్రిలో ఉన్న బీజేపీ నేత అరెస్ట్.. వీల్ చైర్‌పై తీసుకెళ్లిన పోలీసులు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 6. Sakshi (23 October 2023). "హరీశ్‌బాబుకు టికెట్‌ ఖరారు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
 7. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
 8. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
 9. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
 10. NTV Telugu (14 December 2023). "ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
 11. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
 12. Andhrajyothy (14 February 2024). "బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.