గడ్డం ప్రసాద్ కుమార్
గడ్డం ప్రసాద్ కుమార్ [2] తెలంగాణ రాష్ట్రానికి చెందిన వికారాబాద్ శాసన సభ సభ్యుడు, స్పీకర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత, లఘు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు.[3]
జి. ప్రసాద్ కుమార్ | |||
| |||
తెలంగాణ రాష్ట్ర శాసనసభ -స్పీకర్
| |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 14 - ప్రస్తుతం | |||
మాజీ చేనేత, జౌళి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2012 - 2014 | |||
తెలంగాణ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం | |||
ముందు | మెతుకు ఆనంద్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | వికారాబాద్ నియోజకవర్గం | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2008 - 2014 | |||
ముందు | ఎ.చంద్రశేఖర్ | ||
తరువాత | బి. సంజీవరావు | ||
నియోజకవర్గం | వికారాబాద్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1964 బెల్కటూరు, తాండూరు మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఎల్లమ్మ, ఎల్లయ్య | ||
జీవిత భాగస్వామి | కే.శే.శైలజ | ||
సంతానం | అనన్య[1],ఈశ్వర్ | ||
నివాసం | వికారాబాద్ |
జననం, విద్యాభాస్యం
మార్చుజి. ప్రసాద్ కుమార్ 1964లో తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం, బెల్కటూరు గ్రామంలో పాల ఎల్లమ్మ, ఎల్లయ్య దంపతులకు జన్మించాడు. ఆయన తాండూరు విలియమూన్ హైస్కూల్‌లో ఒకటి నుంచి పదో తరగతి వరకు, తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్, జహీరాబాద్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేశాడు.[4]
రాజకీయ జీవితం
మార్చుజి. ప్రసాద్ కుమార్ 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రంగారెడ్డి జిల్లా యువన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీ సెల్ జిల్లా, రాష్ట్ర కోఆర్డినేటర్‌గా వివిధ హోదాల్లో పనిచేసి 2002లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్పల్లి మండలం కొంశెట్‌పల్లి నుంచి ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ప్రసాద్ కుమార్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించగా, ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో పొత్తులో భాగంగా వికారాబాద్ స్థానం టీఆర్ఎస్ కు దక్కగా, ఆ పార్టీ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ విజయంలో కీలకంగా పనిచేశాడు.
తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[5]
గడ్డం ప్రసాద్ కుమార్ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పనిచేశాడు.[6] ఆయన 2014 & 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7] గడ్డం ప్రసాద్‌కుమార్ 2022 డిసెంబరు 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితురాలయ్యాడు .[8][9]
గడ్డం ప్రసాద్ కుమార్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాదు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి[10], 2023 డిసెంబరు 07న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యాడు.[11][12][13] ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా డిసెంబరు 13న నామినేషన్ దాఖలు చేయగా బీఆర్‌ఎస్ పార్టీ ఆయనకు మద్దతు తెలిపింది.[14] గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై, డిసెంబరు 14న బాధ్యతలు చేపట్టాడు.[15]
మూలాలు
మార్చు- ↑ Eenadu (8 December 2023). "కేడర్‌ను నిలబెట్టి.. విజయం చేపట్టి". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Reddy, Ravi (2023-12-07). "Prasad Kumar is Telangana Assembly Speaker". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-12-08.
- ↑ Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Andhrajyothy (14 December 2023). "శాసనసభ అధ్యక్ష పీఠంపై ప్రసాద్‌కుమార్". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ Andhrajyothy (14 December 2023). "ఎంపీటీసీ నుంచి శాసనసభ అధిపతి వరకు." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ Greatandhraupdates. (7 February 2012). "CM Kiran Kumar Reddy added three more ministers in his cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
- ↑ Sakshi (20 September 2018). "టీపీసీసీలో మనోళ్లకు ప్రాధాన్యం". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
- ↑ Andhra Jyothy (11 December 2022). "టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Eenadu (28 October 2023). "కాంగిరేసు అభ్యర్థులు వీరే". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
- ↑ Andhrajyothy (7 December 2023). "తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ Andhrajyothy (7 December 2023). "అధ్యక్ష పీఠం మనకే!". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ Eenadu (10 December 2023). "శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్‌కుమార్". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ Sakshi (13 December 2023). "అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ నామినేషన్.. బీఆర్‌ఎస్ మద్దతు". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Eenadu (14 December 2023). "తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవ ఎన్నిక". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.