పింగళి పార్వతీ ప్రసాద్

పింగళి పార్వతీ ప్రసాద్‌ (ఆగస్టు 9, 1947 - ఏప్రిల్ 12, 2020) ఆకాశవాణి, దూరదర్శన్‌ న్యూస్‌ రీడర్‌, రచయిత్రి. దాదాపు 35 ఏళ్లపాటు ఆకాశవాణిలోని సీనియర్ న్యూస్ రీడర్‌గా పనిచేసింది.[1]

పింగళి పార్వతీ ప్రసాద్
Pingali Parvathi Prasad.jpg
జననంఆగస్టు 9, 1947
మరణంఏప్రిల్ 12, 2020
జాతీయతభారతీయురాలు
వృత్తిఆకాశవాణి, దూరదర్శన్‌ న్యూస్‌ రీడర్‌, రచయిత్రి.

జీవిత విశేషాలుసవరించు

పార్వతీ ప్రసాద్‌ 1947, ఆగస్టు 9న జన్మించింది. మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో చదువుకుంది. పార్వతీ ప్రసాద్‌కు ముగ్గురు కుమారులు.[2]

న్యూస్ రీడర్ గాసవరించు

ఆకాశవాణిలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించిన పార్వతీ ప్రసాద్, కొంతకాలం తరువాత న్యూస్ రీడర్‌గా పదోన్నతి పొందింది. ఎంతోమంది కొత్త న్యూస్ రీడర్లకు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచిన పార్వతీ ప్రసాద్, జూనియ‌ర్స్‌ను ప్రోత్సహించి వారికి వార్తా పఠనంలోని మెళకువలను నేర్పించింది. అనువాదంలో ప్రావీణ్యం ఉన్న పార్వతీ ప్రసాద్ యోజన, ఇతర పత్రికలకు అనువాదాలతో పాటు ఎన్నో నాటికలు, వ్యాసాలు రాసింది. యూనిసెఫ్, సేవ్ ద చిల్డ్రన్ యూకే, ఆంధ్ర మహిళా సభ, పంచాయతీరాజ్ శాఖ మొదలైన సంస్థలకి ప్రచార వ్యాసాలను రాయడంలో సహకారం అందించింది. రహమత్ నగర్ పాఠశాల ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేసింది.

మరణంసవరించు

పార్వతీ ప్రసాద్‌ అనారోగ్యంతో 2020, ఏప్రిల్ 12వ తేది ఆదివారం ఉదయం హైదరాబాదు, అమీర్‌పేటలోని తన నివాసంలో మరణించింది.[3]

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 April 2020). "డీడీ న్యూస్‌ రీడర్‌ పార్వతీ ప్రసాద్‌ మృతి". www.andhrajyothy.com. Archived from the original on 13 April 2020. Retrieved 13 April 2020.
  2. ఈనాడు, ప్రధానాంశాలు (13 April 2020). "తొలితరం న్యూస్‌రీడర్‌ పార్వతీ ప్రసాద్‌ కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 13 April 2020. Retrieved 13 April 2020.
  3. నమస్తే తెలంగాణ, తెలంగాణ (12 April 2020). "ఆకాశ‌వాణి న్యూస్‌రీడ‌ర్ పింగ‌ళి పార్వ‌తీ ప్ర‌సాద్ క‌న్నుమూత‌". ntnews. Archived from the original on 13 April 2020. Retrieved 13 April 2020.