పిఎస్‌ఎల్‌వి-సీ38

పిఎస్‌ఎల్‌వి-సీ38 అనునది ఇస్రోసంస్థ తయారుచేసిన ఉపగ్రహవాహకనౌక.పిఎస్‌ఎల్‌వి శ్రేణికి సంబంధించి ఇది 40వ ప్రయోగం.ఈ రాకెట్ ద్వారా కార్టోశాట్ శ్రేణికి చెందిన ఉపగ్రహన్ని అంతరిక్షంలో ప్రవేశ పెట్తుటకు ఇస్రో సిద్దమైనది. ఈ రాకెట్ ద్వారా 712 కిలోల బరువు ఉన్నకార్టోశాట్-2E ఉపగ్రహన్ని దృవీయ సూర్యానువర్తిత కక్ష్యలో ,భూమినుండి 505 కిమీ దృవీయ కక్ష్యలో చేర్చడం జరుగును. పిఎస్‌ఎల్‌వి-సీ38 రాకెట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని,నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికొటలో ఉన్న సతిసశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం లోని మొదటి ప్రయోగవేదిక నుంది ప్రయోగించుటకు సర్వ సన్నద్దమైనది.పిఎస్‌ఎల్‌వి-సీ38 రాకెట్, పిఎస్‌ఎల్‌వి శ్రేణిలో ఇది 17 వ XLరకానికి చెందిన ప్రయోగం.ఈ రాకెట్ ను జూన్ 23 న ప్రయోగించారు.పిఎస్‌ఎల్‌వి-సీ38 రాకెట్ ద్వారా కేవలం కార్టోశాట్-2 ఉపగ్రహన్నిమాత్రమే కాకుండా ఇంకా 30 చిన్న ఉపగ్రహాలను కూడా అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టుటకు నిర్ణయించారు .ఈ లఘుఉపగ్రహల మొత్తం బరువు 243 కిలోలు.ఇందులో 29 ఉపగ్రహాలు 14 విదేశాలకు ఆస్ట్రియా,బెల్జియం,చీలి,జెక్ రిపబ్లిక్, ఫిన్లాండు, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ,జపాన్, లాటివియ, స్లోవాకియా, బ్రిటన్, అమెరికా) చెందినవి కాగా, ఒకటి భారత దేశానికి చెందినది.[1] పీఎస్ఎల్వీ-సీ38 ద్వారా ప్రయోగించిన 30 సూక్ష్మ ఉపగ్రహాల్లో ఒకటి తమిళనాడు,కోయంబత్తూరు జిల్లాకు చెందిన నూరుల్ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన 15 కిలోల బరువు వున్నాఎన్ఐయూ శాట్ ఒకటి.

పిఎస్‌ఎల్‌వి-సీ38
మిషన్ రకంDeployment of 31 satellites
ఆపరేటర్ఇస్రో
వెబ్ సైట్ISRO website
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌకదృవీయ ఉపగ్రహవాహకనౌక
అంతరిక్ష నౌక రకంExpendable launch vehicle
తయారీదారుడుఇస్రో
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ09:29:00, 23 జూన్ 2017 (2017-06-23T09:29:00) (IST)
రాకెట్దృవీయ ఉపగ్రహవాహకనౌక
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష పరిసశోధన కేంద్రం
కాంట్రాక్టర్ఇస్రో
పేలోడ్
List of Satellites:
 

పీఎస్ఎల్వీ-సీ38 ఉపగ్రహ వాహకనౌక నిర్మాణ వివరాలు

మార్చు

ఇందులో మొత్తం నాలుగు దశలున్నాయి.మొదటి, మూడవ దశలో ఘన ఇంధనం,రెండవ , నాల్గవ దశలో ద్రవఇంధనంను రాకెట్ చోదనకై ఉపయోగిస్తారు.ఈ వాహకనౌక మొత్తం పొడవు 44.4 మీటర్లు. రాకెట్ మొత్తం బరువు (ఉపగ్రహం తో సహా)320 టన్నులు.మొదటి కోర్ ఆలోన్ దశను కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేష్ సెంటరులో తయారు చేసారు.ఈ దశ ప్రాధమిక స్థాయిలో రాకెట్ను గగనతలానికి తీసుకెళ్ళటానికి ఇందులో138.2 టన్నుల ఘనఇంధనం నింపబడివున్నది. పీఎస్ఎల్వీ-సీ38 ఉపగ్రహ వాహకనౌక XL రకానికి చెందినది కావున, మొదటి కోర్ఆలోన్ దశకు అదనంగా ఆరుXL స్ట్రాపాన్ బూస్టరులు అనుసంధానింప బడివున్నవి. ఒక్కో స్ట్రాపాన్ బూస్టరు 1 మీటరు వ్యాసం కల్గి వున్నది. ఒక్కో బూస్టరులో 12.5 టన్నుల ఘన ఇంధనం వుండును.మొదటి దశలో ఇంధనం 110.88 సెకన్లు మండును.రెండవదశ 2.8 మీటర్ల వ్యాసం కల్గివున్నది. ఇందులో 42 టన్నుల ద్రవఇంధనం నింపబడి ఉన్నది.ఇది 262 సెకన్లు మండును.ఈ దశను కూడా విక్రమ్ సారాభాయ్ స్పేష్ సెంటరులో తయారు చేసారు.మూడవదశ రెండు మీటర్ల వ్యాసం కల్గి వున్నది.ఇందులో 7.5 టన్నుల ఘనఇంధనం ఉన్నది. మూడవదశలో ఇంధనం 492.22సెకన్లు మండును. ఈదశను కూడా విక్రమ్ సారాభాయ్ స్పేష్ సెంటరులో తయారు చేసారు. నాల్గవదశలో 2.5టన్నుల ద్రవఇంధనం నింపబడి వుంది, దీని పైభాగంలో ఉపగ్రహం.ఉపగ్రహాలను అమర్చేచేరు.

కౌంట్డౌన్

మార్చు

పీఎస్ఎల్వీ-సీ38 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి కౌంట్ డౌన్ గురువారం ఉదయం 5:29గంటలకు ప్రారంభమై శుక్రవారం ఉదయం 9:28 గంటలవరకు ఎటువంటి ఆటంకంలేకుండా కొనసాగింది. 9:28గంటలకు సతీష్ ధవన్ అంతరిక్షకేద్రంలోని మొదటి ప్రయోగ వేదికనుండి పీఎస్ఎల్వీ-సీ38 గగన తలం వైపు విజయ వంతంగా దూసుకెళ్ళింది.బయలు దేరిన 16 నిమిషాలకు గమ్యాన్ని చేరింది

ప్రయోగ వివరాలు

మార్చు

శుక్రవారం ఉదయం కరెక్టుగా 9;29 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ38 నిప్పులు కక్కుకుంటూ నింగి వైపు దూసుకెళ్ళింది. మొదటిదశ ఇంజను రాకెట్‌ను 1.49 నిమిషాల్లో 68.4 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకు పోయి విడిపోయినది. రెండవదశ 4.21 నిమిషాల్లో రాకెట్‌ను ను225.3 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకుపోయి విడిపోయినది.తరువాత మూడోదశ ఇంజను 8.14 నిమిషాలకు రాకెట్ను 424.2 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళి విడి పోయినది.తరువాత నాల్గవదశ ఇంజను పనిచెయ్యడం ప్రారంభించి,16.01 నిమిషాలకు భూమికి 509.8 కిలోమీటర్ల ఎత్తుకు ఉపగ్రహాలను కల్గిన నాల్గవదశ చేరుకున్నది.ఈ దశలో శాస్త్రవేత్తలు, నాలగవ దశ ఇంజనును ఆపి వేసారు. గమనంలో ఉన్న రాకెట్ నాల్గవదశ 16.42 నిమిషాలకు 505 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగానే కార్టోశాట్-2ఈ ఉపగ్రహాన్ని 97.44 డిగ్రిల ఏటవాలులో కక్షలోకి నెట్టింది,[2].ఈ ఉపగ్రహం భూమధ్య రేఖకు 97.44 డిగ్రీల వాలులో ధ్రువ సుర్యానువర్తిత కక్ష్యలో చేరుకున్నది. తరువాత 10 సెకన్ల తరువాత 16:52నిమిషాలకు తమిళనాడు విద్యార్థులు చేసిన ఎన్‌ఐయూ శాట్ ఉపగ్రహం అదే కక్ష్యలో విడిపోయింది.అనంతరం 17నిమిషాలకు 511కిలో మీటర్ల ఎత్తుకు చేరుకోగానే మొదటి విదేశీ ఉపగ్రహం పిఈశాట్ -1(జపానుకు చెందిన)కక్ష్యలోకి చేరినది.తరువాత 28 సూక్ష్మఉపగ్రహాలున్న పీఎస్-4 రోదసిలో నియంత్రణ లేకుండా తిరుగుతున్నప్పుడు శాస్త్రవేత్తలు ఆ ఇంజనును ఆన్ ఆఫ్ చేస్తూ 350 నుండి 519 కిలోమీటర్ల ఎత్తులో 28 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి వదిలారు.23.20నిమిషాలకు అన్ని ఉపగ్రహాలు కక్ష్యల్లోకి విడుదల అయ్యాయి.[3]

కార్టోశాట్ -2 శ్రేణి ఉపగ్రహ సముదాయ వివరాలు

మార్చు

కార్టోశాట్ -2 శ్రేణి ఉపగ్రహాలను ఇస్రో దేశీయ అవసరాలకోసం ప్రయోగిస్తున్నది. భౌగోళిక సమాచార సేకరణ ఈ కార్టోశాట్ ఉపగ్రహాలప్రధాన లక్ష్యం. కార్టోశాట్ -2 ఉపగ్రహల సీరిస్‌ను 2005లో రూపొందించినారు. జనవరి 10,2007లో పీఎస్ఎల్వీ-సీ7 ద్వారా కార్టోశాట్ -2 ను ప్రయోగించారు.2008 ఏప్రిల్ 28 న పీఎస్ఎల్వీ-సీ9 ద్వారా కార్టోశాట్ -2A ను ప్రయోగించారు. 2010 జులై 12 న పీఎస్ఎల్వీ-సీ15 ద్వారా కార్టోశాట్ -2B ప్రయోగించారు.2016 జూన్ 22 న పీఎస్ఎల్వీ-సీ34 ద్వారా కార్టోశాట్ -2C ఉపగ్రహాన్ని ప్రయోగించారు.2016 ఫిబ్రవరి 15 న ప్రయోగించినకార్టోశాట్ -2D తో కలుపుకుని ఇప్పటికి 5 కార్టోశాట్ ఉపగ్రహాలు పనిచేస్తున్నవి.ఇప్పుడు ప్రయోగించిన కార్టోశాట్ -2E ఆరవ ఉపగ్రహం.దీని జీవితకాలం 5 సంవత్సరాలు. కార్టోశాట్ -2 ఉపగ్రహశ్రేణి ఉపగ్రహాలన్ని సుర్యానువర్తిత ద్రువీయ కక్ష్యలూ భూమికి 500-520 కిమీ పైబడిన ఎత్తులో, భూమి చుట్టూతిరుగుచున్నవి.ఈ ఉపగ్రహ వ్యవస్థలో ఉపగ్రహాలు సుర్యానువర్తిత ద్రువీయ కక్ష్యలో వివిధ దిశల్లో పరిభ్రమిస్తూ భౌగోళికమైన సమాచారాన్ని సేకరించి అందించును[4].ఉపగ్రహ వ్యవస్థలో అమర్చిన ఫ్రాంకోమాటిక్ మల్టిస్ప్రేక్టరు కెమరా అత్యంత నాణ్యమైన నలుపుతెలుపు భూపటల చిత్రాలను తీసి పంపించును. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్రతీర ప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ,నీటి పంపిణి, భూవినియోగంపై చిత్రాలను తయారుచెయ్యడం వంటి పనులు చేయును.విపత్తులను విసృతంగాఅంచనావేసి సమాచారం పంపును. వ్యయసాయ సంబంధిత సమాచారం అందుబాటులోకి వచ్చును. భూమి పై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పొటోలుతీసి పంపును. రాకెట్, ఉపగ్రహనిర్మాణానికి సుమారు 350 కోట్లు ఖర్చు అయ్యినది.

2017 సంవత్సర మొదటి అర్థ భాగంలో ఇస్రో ప్రయోగాలు

మార్చు

ఇస్రో వారు 2017 సంవత్సరానికి సంబంధించి జూన్ 5 నాటికి 3రాకెట్లను విజయవంతంగా ప్రయోగించారు. జూన్ 23 న ప్రయోగించిన నాల్గవ( పీఎస్ఎల్వీ-సీ38) ప్రయోగం కూడా విజయవంతమయ్యింది. గత ఫిబ్రవరి లో పీఎస్ఎల్వీ-సీ37 ద్వారా 104ఉపగ్రహాలను విజయ వంతంగా కక్ష్యలొ ప్రవేశపెట్టారు.మేనెలలో జీఎస్ఎల్ వి-ఎఫ్09రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిగింది.అలాగే ఇదే నెల(జూన్)5న జీఎస్ఎల్ వి-మార్క్ 3 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించి నారు. 2011 నుండిరాకెట్ల ప్రయోగంలో ఇస్రోకు అపజయమన్నదేలేదు.

బయటి వీడియో లింకులు

మార్చు
  • [1] పిఎస్‌ఎల్‌వి-సీ38 లాంచింగు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "PSLV-C38 / Cartosat-2 Series Satellite". isro.gov.in. Archived from the original on 2020-10-25. Retrieved 2017-06-20.
  2. "PSLV-C38 Successfully Launches 31 Satellites in a Single Flight". pib.nic.in. Retrieved 2017-06-27.
  3. "PSLV rocket launches Cartosat 2E and 30 small sats". nasaspaceflight.com. Retrieved 2017-06-27.
  4. "ISRO PSLV-C38 launched: What is Cartosat-2 series satellite?". indianexpress.com. Retrieved 2017-06-27.