పిడుగు పాపిరెడ్డి


పిడుగు పాపిరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ తెలుగు రచయిత. 17 డిసెంబర్ 1939 తేదిన ఈయన జన్మించారు. ప్రస్తుతం ఈయన కనిగిరిలోని కొత్తపేట అప్పయ్యగారి వీధిలో నివసిస్తున్నారు. పాపిరెడ్డి రచించిన కథలన్నీ "శాలువా" పేరుతో ఓ సంపుటిగా ప్రచురితమయ్యాయి. కథలను ఉపోద్ఘాతంతో మొదలుపెట్టడం పాపిరెడ్ది ఎత్తుగడ. వస్తుపరమైన గుణవిశేషంతో పాటు శిల్పం కూడా ఈయన కథలలో ఉంటుంది. [1]సమాజంలోని కుళ్ళు కుతంత్రం, మూఢనమ్మకాలు, అవినీతి వంటి అంశాల మీద దృష్టి సారించి వాటి నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలనే సందేశం పాపిరెడ్డి కథలలో ఉంటుంది. [2]

పిడుగు పాపిరెడ్డి
జననం17 డిసెంబర్ 1939
ప్రకాశం జిల్లా

కథల పై ప్రముఖుల అభిప్రాయాలు

మార్చు

"పాపిరెడ్డి కథలను పరిశీలిస్తే కథకుడిగా ఆయన ఎంత పరిణతి సాధించాడో మనకర్థమౌతుంది. ఈ కథలన్నింటిలోను మనుషులను విభజించే కులమతాలకతీతమైన స్వచ్ఛమైన మానవతా దృక్పథం కనిపిస్తుంది. [3]ఉన్నత సామాజిక వర్గాల్లోని స్వార్థపరత్వాన్ని, పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతను, విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాల్సిన ఉపాధ్యాయుల నైచ్చాన్ని, అన్యాయానికి గురైనప్పుడు ఎంత బలహీనుడైనా తిరగబడే పరిస్థితిని పాపిరెడ్డి ఈ కథలలో చిత్రించాడు" అని ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ సాహిత్య ప్రస్థానం పత్రికకు రాసిన సమీక్షలో పేర్కొన్నారు. [4]


  • మారని విలువలు
  • దొంగలు
  • పెండ్లి చీర
  • అసలు ఫాయిదాలు
  • మేడిపండు
  • పరిష్కారం
  • గమ్యం
  • కృషితో అస్తి దుర్భిక్షమ్
  • శాలువా
  • మంచికి మరోజన్మ
  • యుద్ధ శాంతి
  • పెళ్లామంటే నువ్వేనే

మూలాలు

మార్చు
  1. "సాక్షి పత్రికలో పిడుగు పాపిరెడ్డి శాలువ కథల సంపుటి మీద వివరణ". sakshi.com. SAKSHI. Archived from the original on 2022-01-06. Retrieved 1 January 2022.
  2. "పిడుగు పాపిరెడ్డి పుస్తకాలపై సమీక్ష". kinige.com. KINEGE. Archived from the original on 2022-01-06. Retrieved 1 January 2022.
  3. "పిడుగు పాపిరెడ్డి పుస్తకాలపై సమీక్ష". andhrabhoomi.net. ANDHRA BHOOMI. Archived from the original on 2022-01-06. Retrieved 1 January 2022.
  4. "కాళీపట్నం రామారావు గారి కథానిలయం వెబ్ సైట్ నుందు పిడుగు పాపిరెడ్డి గారి రచనల వివరాలు".