కనిగిరి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా పట్టణం

కనిగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన పట్టణం.[3] కనిగిరిని మనుమసిద్ధిపై యుద్ధము చేసిన కాటమరాజు పరిపాలించాడని ప్రతీతి. కనిగిరి కొండపై కనిగిరి కోట, బావులు, దుర్గము ముఖ్యమైనవి.

పట్టణం
నిర్దేశాంకాలు: 15°24′00″N 79°31′00″E / 15.4°N 79.5166°E / 15.4; 79.5166Coordinates: 15°24′00″N 79°31′00″E / 15.4°N 79.5166°E / 15.4; 79.5166
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం
విస్తీర్ణం
 • మొత్తం49.3 కి.మీ2 (19.0 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం37,420
 • సాంద్రత760/కి.మీ2 (2,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి981
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08402 Edit this on Wikidata )
పిన్(PIN)523230 Edit this on Wikidata
జాలస్థలిhttps://kanigiri.cdma.ap.gov.in/ Edit this on Wikidata

చరిత్రసవరించు

కనిగిరిని పూర్వము కనకగిరి (బంగారుకొండ) అని పిలిచేవారు. దీని పూర్తిపేరు కనకగిరి విజయ మార్తాండ దుర్గము.[4] కవి, రాజు నన్నెచోడుడు ఉదయగిరిని పరిపాలించిన కాలంలో కనిగిరి సామంత రాజ్యంగా ఉండేది.[5] కనిగిరిని మనుమసిద్ధిపై యుద్ధము చేసిన కాటమరాజు పరిపాలించాడని ప్రతీతి. కనిగిరి కొండపై కొన్ని చారిత్రక కట్టడములు ఉన్నాయి. వాటిలో కనిగిరి కోట, బావులు, దుర్గము ముఖ్యమైనవి. కనిగిరి కొండపై రెండు జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. కొండపై ఒక చదరపు మైలు వైశాల్యము కలిగిన చదును నేల ఉంది. పూర్వము కొండపై ఒక పట్టణం ఉండేదని స్థానికుల కథనం[6]

మనుచరిత్రలో వర్ణించిన కనకగిరి ఇదియే అని పలువురి అభిప్రాయము.కనిగిరిసీమకు సంబంధించిన శాసనాలని పరిశీలించినచో కటకపురాధీశ్వరుండగు రుద్రుడీ సీమను పాలించినట్లు-అతడే-ఇక్కడ ఉన్న దుర్గములను నిర్మించి తన విజయసూచకముగా ఇక్కడ విజయమార్తాండదుర్గ అని పేరిడినట్లు చరిత్రపుటలలో కనబడుతున్నది. అతనిపిదప ఆతని వంశస్థులీ పరిసరములను కొంతకాలము పాలించిరి. అటుపై కొంతకాలము తరువాత 17వ శతాబ్దములో మైసూరు నవాబగు హైదరాలి ఈ కనిగిరిసీమను జయించి-పట్టణంను-కోటను కుంగుటేళ్ళతో కూడా నేలమట్టము గావించెను.ఈతను తరువాత ఇది నిజాము వశము కాబడింది.అటుపై ఆంగ్లేయుల దత్తము కాబడింది.ఆశ్వేతముఖుల పాలనలో ఈ తాలూక కొన్ని దినములు కర్నూలు కడప జిల్లాలలో చేర్చబడి-మరికొంతకాలమునకు నెల్లూరు జిల్లాలో ఉండెను. 1970 నుండి ప్రకాశము జిల్లాలో నున్నది.కనకగిరికి సంబంధించిన శాసనములు నెల్లూరు జిల్లా శాసన సంపుటములో 40 వరకు ఉన్నాయి.

చెన్నమ్మక్క బావిసవరించు

బొగ్గు గొందిలోనికి పోగా వచ్చునది చెన్నమ్మక్క బావి. దీనిని శ్రీ కృష్ణదేవరాయలు పట్టమహిషియైన చిన్నాదేవి సర్వ జనోపయోగార్దముగ నిర్మింపజేసినదియు-క్రమముగా మారుచు నేటికీ పేరు నిలిచినదని పలువురి అభిప్రాయము.ఇందలి నీరు లోదుర్గమున యాతాయాతవంబులకుపయోగిపడుచున్నది.దీని పరిసరములలో కొన్ని భిన్నములైన విగ్రహములున్నవి.పోయినవిపోగా ఉన్నవాటిలో చతుర్భుజుడైన శ్రీమహావిష్ణుమూర్తి.ఆనాటి కోటలోనుండు దేవాలయములోని విగ్రహమేమో? ఇక్కడనుండి కొంచెము ముందుకు సాగినచో భీముని పాదమట-అడుగు ఆకారము కల ఒక గుంటకలదు.

సింగారప్ప దేవాలయముసవరించు

ఈ సిద్ధపురుషుడెవ్వరో తెలియదు.ఈ ఆలయనిర్మాణమునకుపయోగించిన బండలు 3 అడుగుల మందముకలిగి అంతేలావు కలిగి ఉన్నాయి.ఈ దేవా;అయమునకు ప్రక్కనే కాశీ ద్వారమున్నది.ఈ పర్వతమంతయు పెద్ద శివలింగాకారముగా ఉంది.ఇందొక గుహలో దక్షిణాభిముఖుడగు మార్తాండేశ్వరుడున్నాడు.దక్షిణాభిముఖుడగు ఈశ్వరదేవాలయముంట అరుదుకదా! ఈ పరమేశ్వరునిని-మార్కాండేయ మహర్షి ప్రతిష్ఠించినని చెప్పుచున్నారు.

భౌగోళికంసవరించు

 

సమీప గ్రామాలుసవరించు

చల్లగిరిగల 4 కి.మీ, చకిరల 5 కి.మీ,మాచవరం 5 కి.మీ,చిన్న ఇర్లపాడు 6 కి .మీ ,

సమీప మండలాలుసవరించు

హనుమంతునిపాడు 13 కి.మీ,వెలిగండ్ల 22 కి.మీ,పెదచెర్లోపల్లి 22 కి.మీ, పామూరు 36 కి.మీ,చంద్రశేఖరపురం 37 కి.మీ, పొన్నలూరు 36 కి.మీ,మర్రిపూడి 28 కి.మీ,కొనకనమిట్ల 33 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

పామూరు 37 కి.మీ, చంద్రశేఖరపురం 38 కి.మీ, పెదచెర్లోపల్లి 29 కి.మీ, వెలిగండ్లల 22 కి.మీ, కందుకూరు 49 కి.మీ, ఒంగోలు 80 కి.మీ, కంభం 60 కి.మీ, దొనకొండ 52 కి.మీ.

పట్టణ పరిపాలనసవరించు

విద్యసవరించు

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ మోడల్ స్కూల్ తో పాటు చాలా ప్రైవేటు పాఠశాలలున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలున్నాయి.

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి

ఆర్ధిక రంగంసవరించు

పలు ప్రభుత్వరంగం, ప్రైవేట్ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి.

వినోదంసవరించు

2 సినిమాహాళ్లు (శ్రీనివాస మహల్ AC DTS సుదర్శన్ థియేటర్ AC DTS) ఉన్నాయి. గతంలో పనిచేసిన వెంకటేశ్వర థియేటర్, సాయి బాబా థియేటర్ మరమ్మత్తులో ఉన్నాయి.

సంస్కృతిసవరించు

కనిగిరి గ్రామ దేవత అంకలమ్మ, హిందువులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ముస్లింలు, క్రైస్తవులు పట్టణం అంతటా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. "భిన్నత్వంలో ఏకత్వం" అనే సూత్రానికి కందుకూరు మంచి ఉదాహరణ. ప్రజలు తిరునాళ్ళు, పీర్ల పండుగ,, నూతన సంవత్సరం పండుగ, ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), సంక్రాంతి (సంక్రాంతి), వైకుంఠ ఏకాదశి, ఉగాది (ఉగాది), గణేష్ చతుర్థి (వినాయక చవితి), దసరా (దసరా), దీపావళి (దీపావళి), క్రిస్మస్ (క్రిస్మస్) పండుగలు ఆచరిస్తారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామివారి ఆలయంసవరించు

ఇది శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయం. ఈ ఆలయంలో ఒకప్పుడు రాజులు పూజలు చేసేవారు. 100 ఎకరాలకు పైగా మాన్యం భూములు, కోట్ల రూపాయల ఆస్తులున్నా సాధారణ కైంకర్యాలు గూడా చేసే అవకాశం లేదు. తక్షణం మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉంది. [1]

శ్రీ బాలకోటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయంసవరించు

శ్రీ సాయిబాబా ఆలయంసవరించు

శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంసవరించు

రవాణా సౌకర్యాలుసవరించు

కనిగిరి నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) తో పాటు రెండు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు రవాణా రంగంలో సేవలందిస్తున్నాయి. సమీప రైల్వే స్టేషనులు సింగరాయకొండ, దొనకొండ. సమీప విమానాశ్రయం విజయవాడ విమానాశ్రయం.

రహదారి దూరముసవరించు

కనిగిరి పట్టణం నుండి భారతదేశము, భారతదేశం లోని కొన్ని ప్రధాన ప్రాంతాల మధ్యన దూరం

నగరం /పట్టణం దూరము (కి.మీ.) నగరం /పట్టణం దూరము (కి.మీ.) నగరం /పట్టణం దూరము (కి.మీ.) నగరం /పట్టణం దూరము (కి.మీ.)
శ్రీకాకుళం 654 కర్నూలు 221 నెల్లూరు 152 విజయవాడ 202
రాజమహేంద్రవరం 359 చిత్తూర్ 328 ఏలూరు 260 బెంగుళూరు 441
కలకత్తా 1867 గుంటూరు 167 ఢిల్లీ 1894 కడప 170
అనంతపురం 302 మైసూరు 593 వారణాసి 1573 విశాఖపట్నం 549
హైదరాబాదు 342 కాకినాడ 420 నాగపూర్ 842 తిరుపతి 264

శాసనసభా నియోజకవర్గముసవరించు

1952 జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో కనిగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉండేది. ప్రకాశం జిల్లా యేర్పాటైన తర్వాత అన్ని నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించి ఐదు మండలాలతో కనిగిరి నియోజక వర్గమును యేర్పరచారు.2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజక వర్గం ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగం.

కనిగిరికి చెందిన ప్రముఖులుసవరించు

సాంస్కృతిక ప్రముఖులుసవరించు

 • జానీ లీవర్ : బాలీవుడ్ సినీనటుడు, హాస్యనటుడు.[7]
 • కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి: కవి. వీరు పలు కవితా సంపుటాలు రచించారు. అలాగే అనేక విమర్శనాత్మక కవితలు వ్రాసినారు. వీరి ప్రతిభ గుర్తించిన కొత్తఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ, 2015, సెప్టెంబరు-5,6 తేదీలలో, అసోం లోని దిబ్రూఘర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించు అభివ్యక్తి జాతీయ కవి సమ్మేళనానంలో పాల్గొనడానికి వీరికి ఆహ్వానం పంపినది. [4]
 • తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా (1912-19.12.1978) హరికథకుడు

రాజకీయనాయకులుసవరించు

 • బుర్రా మధు సుధన్ యాదవ్. శాసన సభ్యులు (2019-ప్రస్తుతం)
 • కదిరి బాబూరావు. శాసన సభ్యులు (2014-2019)
 • ఈరిగినేని తిరుపతి నాయుడు Ex. MLA (1999-2009)
 • ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి Ex. MLA (2009-2014)
 • ముక్కు కాశీ రెడ్డి .Ex MLA,
 • చిన్నా మస్తాన్ షేక్..నగర్ పంచాయతీ చైర్మన్ (2014-2019)
 • పులి వెంకట రెడ్డి EX. MP
 • నంబుల వెంకటేశ్వర్లు MPP (2014-2019)
 • పులి వెంకట రెడ్డి (Ex. MP)

పట్టణ విశేషాలుసవరించు

మూలాలుసవరించు

 1. https://kanigiri.cdma.ap.gov.in/; ఈ సమయాన: 25 జూలై 2019.
 2. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
 3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 4. Gazetteer of the Nellore District: brought upto 1938 By Government Of Madras Staff పేజీ.325 [1]
 5. ఈతకోట, సుబ్బారావు (సెప్టెంబరు 2010). "చరిత్రకందని ఉదయగిరి కోట". అలనాటి నెల్లూరు (1 ed.). హైదరాబాద్: పాలపిట్ట బుక్స్. pp. 44–49. {{cite book}}: Check date values in: |date= (help)
 6. Lists of the Antiquarian Remains in the Presidency of Madras By Robert Sewell పేజీ.138 [2]
 7. "14th August 1957: Popular Bollywood Actor and Comedian Johnny Lever is Born". Retrieved 2014-01-05.
 • 1979 భారతి మాసపత్రిక. వ్యాసము: కనిగిరిలో దుర్గము. వ్యాసకర్త:విద్వాన్ శ్రీ కొమాండూరి రామానుజాచార్యులు.
 • చింతలపూడి కరుణానిధి రచించిన పరిశోధన గ్రంథం కనిగిరి దుర్గం చరిత్ర

ఇవి కూడా చూడండిసవరించు

కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం

కనిగిరి దుర్గం చరిత్ర రచయిత చింతలపూడి కరుణానిధి

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కనిగిరి&oldid=3563441" నుండి వెలికితీశారు