పి.ఎస్.వీరుస్వామి పిళ్ళై

పి.ఎస్.వీరుస్వామి పిళ్ళై కర్ణాటక నాదస్వర వాద విద్వాంసుడు.

తిరువిదైమరుదూర్ పి.ఎస్.వీరుస్వామి పిళ్ళై
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుதிருவிடைமருதூர் பி. எஸ். வீருசாமி
జననం(1896-11-09)1896 నవంబరు 9
తిరునగర్
మరణం1973 ఏప్రిల్ 19(1973-04-19) (వయసు 76)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తినాదస్వర విద్వాంసుడు
వాయిద్యాలునాదస్వరం

విశేషాలు మార్చు

ఇతడు తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరువిదైమరుదూరు గ్రామంలో 1896, నవంబరు 9వ తేదీన జన్మించాడు. ఇతడు ఇతని తండ్రి వద్ద మొదట నాదస్వరం నేర్చుకున్నాడు. తరువాత పి.వి.సుందరం పిళ్ళై, కోనేరిరాజపురం వైద్యనాథ అయ్యర్, గోవిందస్వామి పిళ్ళై, నటరాజ సుందరం పిళ్ళై వంటి నాదస్వర విద్వాంసుల వద్ద శిక్షణ పొందాడు.

ఇతడు సింగపూర్, మలేసియా, శ్రీలంక మొదలైన దేశాలలో నాదస్వర కచేరీలు చేశాడు. మైసూరు, తిరువాంకూరు, పుదుక్కోటై సంస్థానాలలో ఇతడు తన విద్యా ప్రదర్శన గావించి సన్మానాలు అందుకున్నాడు. ఢిల్లీ, హైదరాబాదు, తిరుమల, ధర్మపురి, మదురై వంటి అనేక ప్రదేశాలలో ఇతడు నాదస్వర కచేరీలు నిర్వహించాడు. ఆకాశవాణి ఢిల్లీ, హైదరాబాదు, చెన్నై కేంద్రాల నుండి ఇతని నాదస్వర సంగీతం ప్రసారమయ్యింది. ఇతడు స్వామిమలై, పళనిలలోని సంగీత కళాశాలలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. ఆకాశవాణి సెలెక్షన్ కమిటీ సభ్యునిగా సేవలందించాడు.

ఇతడు తిరువదుత్తురై ఆధీనం (శైవమఠం) ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు. తిరువాంకూరు సంస్థానంలో కూడా ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశాడు. 1961లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళానిధి పురస్కారాన్ని ఇచ్చింది.[1] 1959లో తమిళ్ ఇసై సంఘం "ఇసై పెరారిజ్ఞర్" బిరుదును ప్రదానం చేసింది.[2] 1966లో కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి ఇతనికి కర్ణాటక సంగీతం - వాద్యం (నాదస్వరం) విభాగంలో అవార్డు లభించింది.[3]

మరణం మార్చు

ఇతడు 1973, ఏప్రిల్ 19వ తేదీన మరణించాడు.

మూలాలు మార్చు

  1. "Recipients of Sangita Kalanidhi". Archived from the original on 2016-03-04. Retrieved 2021-03-20.
  2. "బిరుదులు". Archived from the original on 2012-02-12. Retrieved 2021-03-20.
  3. web master. "Akademi Awardee". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 20 March 2021.