డాక్టర్ పి.రమేష్ బాబు హృద్రోగ నిపుణులుగా, రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

పి.రమేష్ బాబు

బాల్యం

మార్చు

తల్లిదండ్రులు కమలాదేవి,సుబ్బారావు.జన్మస్థలం దెందులూరు.పెరిగింది గన్నవరం విజయవాడ

విద్యాభ్యాసం

మార్చు

రమేష్ బాబు ప్రఖ్యాత గుంటూరు వైద్య కళాశాలలో చదివి 1980లో ఎం.బి.బి.ఎస్. పట్టాను పొందారు. 1981లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1982-84 సంవత్సరాలలో ఎం.డి. (ఇంటర్నల్ మెడిసిన్) ప్రతిష్ఠాత్మక ఎ.ఐ.ఐ.ఎం.ఎస్. (న్యూఢిల్లీ) లో జూనియర్ రెసిడెంట్ గా చదువుకున్నారు. 1984లో ఎం.డి. పట్టా సాధించారు. 1985 ఎయిమ్స్ (న్యూఢిల్లీ) జాతీయస్థాయిలో నిర్వహించిన డి.ఎం. ప్రవేశపరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1985 – 88 వరకూ ఎయిమ్స్ లో చదివి 1988లో డి.ఎం. పట్టా సాధించారు.

వైద్యరంగం

మార్చు

1988లో విజయవాడ నగరంలో కార్డియాక్ ఐ.సి.సి.యూనిట్ ప్రారంభించారు. 1996లో కోస్తా జిల్లాల్లోకెల్లా తొలి కార్డియాక్ కేథరిషన్ లాబొరేటొరీని విజయవాడలో ప్రారంభించారు. 1996లో కోస్తా జిల్లాల్లోకెల్లా తొలి బాలూన్ ఆంజియోప్లాస్టీని, కరోనరీ బైపాస్ ని విజయవంతంగా నిర్వహించారు. 2011 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా 256 స్లైస్ సి.టి.లను ప్రారంభించారు.

కార్డియాలజీ రంగంలో అనుభవం

మార్చు
  • డా.రమేష్ కార్డియాక్, మల్టీ స్పెషాలటీ హాస్పిటల్స్ (విజయవాడ) లో 7229 పీసీఐలతో కలిపి 46697కు పైగా ఆంజియోగ్రామ్స్ చేశారు.
  • 727 ప్రాథమిక పీసీఐలు చక్కని ఫలితాలతో నిర్వహించారు.
  • 10417 గుండె శస్త్రచికిత్సలు చేయగా అందులో 99శాతం శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి.

పరిశోధన పత్రాలు

మార్చు
  • రమేష్ జాతీయ స్థాయి కాన్ఫరెన్సులలో కార్డియాలజీకి సంబంధించిన వివిధ అంశాలపై 10 పరిశోధన పత్రాలు సమర్పించారు.
  • ఆయన అంతర్జాతీయ స్థాయి జర్నల్సులో 5 పరిశోధన పత్రాలను ప్రచురితమయ్యాయి.

క్రీడలు

మార్చు

రమేష్ క్రీడల్లో ఆసక్తితో పలు క్రీడాపోటీల్లో పాల్గొని బహుమతులు పొందారు:

  • కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలో చదరంగం, క్యారమ్స్ ఆటల్లో పలు పోటీల్లో బహుమతులు పొందారు.
  • నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల స్థాయి టోర్నమెంటును 1979లో గెలుపొందారు.

మూలాలు

మార్చు