అకాడమీ పురస్కారాలు - ఉత్తమ చిత్రం

ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధి చెందిన అకాడమీ పురస్కారాలలో ఉత్తమ చిత్రం విభాగంలో ప్రతియేటా ఇచ్చే బహుమతులను అకాడమీ ఆఫ్ మోషన్ ఫిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సస్ (AMPAS) 1929 నుండి ప్రదానం చేస్తున్నది. ఈ పురస్కారాలలో మిగిలిన విభాగాల కన్నా ఉత్తమ చిత్రం కేటగరీ ముఖ్యమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఈ పురస్కారం దర్శకత్వం, నటన, సంగీతం, కథ, ఎడిటింగ్ మొదలైన అన్ని అంశాలను పరిగణనలో తీసుకుని ప్రకటిస్తారు కాబట్టి. ఈ పురస్కారంపై మీడియా ఎక్కువ దృష్టి పెడుతుంది. ఈ పురస్కారాన్ని చిత్ర నిర్మాత/నిర్మాతలకు అందజేస్తారు. 1973 నుండి ప్రతి యేటా అకాడమీ పురస్కారాల ప్రదానోత్సవంలో ఉత్తమ చిత్రం పురస్కారం అన్ని పురస్కారాలను అందజేసిన తరువాత చిట్టచివరగా దీనిని ప్రకటిస్తున్నారు. 88వ అకాడమీ పురస్కారాల వరకు 528 చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగరీ కొరకు పరిశీలించబడ్డాయి.[1]

ఉత్తమ చలన చిత్రానికి అకాడమీ అవార్డు
వివరణఆ సంవత్సరంలో ఉత్తమ చలన చిత్రం
దేశంఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
అందజేసినవారుఅకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (AMPAS)
మొదటి బహుమతి1929 (1927,1928లో విడుదలైన సినిమాలకు)
Currently held byసిఓడిఏ (2021)
వెబ్‌సైట్https://oscar.go.com/nominees/best-picture Edit this on Wikidata

చరిత్ర

మార్చు

పేరుమార్పులు

మార్చు

మొదటి అకాడమీ పురస్కార ప్రదానోత్సవం (1927-28 సంవత్సరాలకు గాను)లో వింగ్స్ అనే చిత్రానికి విశిష్ట చిత్రం (Outstanding Picture)గా, సన్‌రైజ్ అనే చిత్రానికి అద్వితీయ, కళాత్మక చిత్రం (Academy Award for Best Unique and Artistic Production|Unique and Artistic Picture)గా రెండు పురస్కారాలను అందజేశారు. తరువాత సంవత్సరం నుండి అద్వితీయ, కళాత్మక చిత్రం అవార్డును ఉపసంహరించారు.[2] రెండవ సంవత్సరం కూడా ఈ పురస్కారాన్ని విశిష్ట చిత్రం అని పేరు పెట్టినా తరువాత ఈ పేరు అనేక మార్పులు చెంది 1962 నుండి ఉత్తమ చిత్రంగా స్థిరపడింది.[1]

గ్రహీతలు

మార్చు

1950 వరకు ఈ పురస్కారాన్ని నిర్మాణ సంస్థ ప్రతినిధికి ప్రదానం చేసేవారు. 1950లో ఈ పద్ధతిని మార్చి అందరు నిర్మాతలకు ప్రదానం చేయడం ప్రారంభించారు. ఈ నియమాన్ని 1998లో ముగ్గురు నిర్మాతలకు కుదించారు.[3][4][5]

ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు

మార్చు

అకాడమీ పురస్కారాలలో ఉత్తమ చిత్రం పురస్కారం, ఉత్తమ దర్శకుడు పురస్కారం ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్టు ఈ పురస్కారాల చరిత్ర గమనిస్తే తెలుస్తుంది. మొత్తం 88 ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన చిత్రాలలో 62 చిత్రాలకు ఉత్తమ దర్శకుడు పురస్కారం కూడా లభించింది. కేవలం నాలుగు చిత్రాలు మాత్రం ఉత్తమ చిత్రం పురస్కారం అందుకున్నా ఉత్తమ దర్శకుడు పురస్కార పరిశీలను నామినేట్ చేయబడలేదు. రెండు చిత్రాలు మటుకు ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని పొంది ఉత్తమ చిత్రం పురస్కార పరిశీలనకు ఎంపిక కాలేదు. .[6]

ఇతర విశేషాలు

మార్చు
  • ఈ కేటగరీలో పురస్కార ఎంపికకు పరిశీలించే చిత్రాల పరిమితి మొదట 8 నుండి 12 వరకు ఉండేది. తరువాత ఈ సంఖ్యను 5కు కుదించారు. 2009 నుండి ఎంపికకు 10 చిత్రాలను పరిశీలిస్తున్నారు.[7]
  • ఈ కేటగరీలో పరిశీలనకు నామినేట్ చేయబడే చిత్రాలలో ఆంగ్లేతర చిత్రాలను పరిగణించరనే విమర్శ ఉంది. ఇంత వరకు కేవలం 9 అన్యభాషా చిత్రాలు మాత్రమే ఈ కేటగరీలో పోటీకి నామినేట్ చేయబడ్డాయి.
  • ఈ పురస్కారల ఎంపికలో లింగ వివక్ష, జాతి వివక్ష, వర్ణ వివక్ష చోటు చేసుకుంటున్నదనే విమర్శ కూడా ఉంది.
  • కొన్ని సీక్వెల్ చిత్రాలు ఈ పురస్కారానికి పరిశీలించబడ్డాయి. వాటిలో ది గాడ్‌ఫాదర్ - 2, ది లార్డ్ ఆఫ్ రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ అనే చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా ఎంపిక అయ్యాయి.
  • 2011లో ఉత్తమ చిత్రంగా గెలిచిన ది ఆర్టిస్ట్ అనే సినిమా సంభాషణలు లేని మొట్టమొదటి చిత్రం కాగా, 1960లో గెలుపొందిన ది అపార్ట్‌మెంట్ చిత్రం ఏకైక నలుపు - తెలుపు చిత్రం.

విజేతలు

మార్చు

ఈ క్రింది పట్టికలో ఇంతవరకు ఉత్తమ చిత్రంగా ఎన్నికైన చిత్రాలు, వాటిని నిర్మించిన నిర్మాణ సంస్థలు, నిర్మాతల వివరాలు ఇవ్వబడ్డాయి.

అకాడమీ అవార్డ్ సినిమా నిర్మాణ సంస్థ (లు) నిర్మాత (లు)
1వ (1927-28) వింగ్స్ పారమౌంట్ పిక్చర్స్, Famous Players-Lasky లూసిన్ హబ్బర్డ్
2వ (1928-29) ది బ్రాడ్వే మెలొడి మెట్రొ గోల్డ్‌విన్ మేయర్ ఇర్వింగ్ థాల్బర్గ్, లారెన్స్ వీన్‌గార్టెన్
3వ (1929-30) ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్ యూనివర్సల్ కార్ల్ లీమ్లె జూనియర్
4వ (1930-31) సిమరాన్ RKO రేడియో విలియం లెబరాన్
5వ (1931-32) గ్రాండ్ హోటల్l మెట్రొ గోల్డ్‌విన్ మేయర్ ఇర్వింగ్ థాల్బర్గ్
6వ (1932-33) కావల్కేడ్ ఫాక్స్ విన్‌ఫీల్డ్ షీహన్
7వ (1934) ఇట్ హాపెన్డ్ వన్ నైట్ కొలంబియా పిక్చర్స్ హారీ కాన్, ఫ్రాంక్ కాప్రా
8వ (1935) మ్యూటినీ ఆన్ ది బౌంటీ [J] మెట్రొ గోల్డ్‌విన్ మేయర్ Irving Thalberg, Albert Lewin
9వ (1936) The Great Ziegfeld మెట్రొ గోల్డ్‌విన్ మేయర్ Hunt Stromberg
10వ (1937) The Life of Warner Bros. Henry Blanke
11వ (1938) You Can't Take It With You Columbia Frank Capra
12వ (1939) గాన్ విత్ ద విండ్ (సినిమా) సెల్జెనిక్ ఇంటర్నేషనల్, మెట్రో-గోల్డ్విన్-మేయర్ డేవిడ్ ఓ. సెల్జెనిక్
13వ (1940) Rebecca సెల్జెనిక్ ఇంటర్నేషనల్, United Artists డేవిడ్ ఓ. సెల్జెనిక్
14వ (1941) How Green Was My Valley 20th Century Fox Darryl F. Zanuck
15వ (1942) Mrs. Miniver మెట్రొ గోల్డ్‌విన్ మేయర్ Sidney Franklin (director)
16వ (1943) కాసాబ్లాంకా (సినిమా) వార్నర్ బ్రదర్స్ హాల్ బి.వాలిస్
17వ (1944) Going My Way Paramount Leo McCarey
18వ (1945) The Lost Weekend Paramount Charles Brackett
19వ (1946) The Best Years of Our Lives RKO Radio Samuel Goldwyn
20వ (1947) Gentleman's Agreement 20th Century Fox Darryl F. Zanuck
21వ (1948) Hamlet Two Cities Films, Universal Laurence Olivier
22వ (1949) ఆల్ ది కింగ్స్ మెన్ రోజెన్, కొలంబియా రాబర్ట్ రోజెన్
23వ (1950) All About Eve 20th Century Fox Darryl F. Zanuck
24వ (1951) An American in Paris మెట్రొ గోల్డ్‌విన్ మేయర్ Arthur Freed
25వ (1952) ది గ్రేటెస్ట్ షో ఆన్ ద ఎర్త్ పారమౌంట్ సిసిల్ బి.డి మిల్లీ
26వ (1953) ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి కొలంబియా బడ్డీ అడ్లర్
27వ (1954) On the Waterfront Columbia Sam Spiegel [N]
28వ (1955) Marty (film) United Artists, Steven Productions, Hecht-Lancaster Productions Harold Hecht
29వ (1956) ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్ యునైటెడ్ ఆర్టిస్ట్స్, మైకేల్ టాడ్ ప్రొడక్షన్స్ మైకేల్ టాడ్
30వ (1957) ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ కొలంబియా, హొరైజాన్ పిక్చర్స్ శామ్ స్పీగల్
31వ (1958) Gigi మెట్రొ గోల్డ్‌విన్ మేయర్ Arthur Freed
32వ (1959) బెన్ హార్ మెట్రొ గోల్డ్‌విన్ మేయర్ సాం జింబాలిస్ట్
33వ (1960) The Apartment United Artists, The Mirisch Company Billy Wilder
34వ (1961) వెస్ట్ సైడ్ స్టోరీ యునైటెడ్ ఆర్టిస్ట్స్ రాబర్ట్ వైస్
35వ (1962) లారెన్స్ ఆఫ్ అరేబియా కొలంబియా, హోరైజాన్ పిక్చర్స్ శామ్ స్పీగల్
36వ (1963) Tom Jones United Artists, Woodfall Film Productions Tony Richardson
37వ (1964) మై ఫెయిర్ లేడీ వార్నర్ బ్రదర్స్ జాక్ ఎ.వార్నర్
38వ (1965) ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ 20th Century Fox Robert Wise
39వ (1966) A Man for All Seasons Columbia, Highland Films Fred Zinnemann
40వ (1967) In the Heat of the Night United Artists Walter Mirisch
41వ (1968) Oliver! Romulus Films, Warwick Film Productions John Woolf
42వ (1969) Midnight Cowboy United Artists Jerome Hellman
43వ (1970) Patton (film) 20th Century Fox Frank McCarthy (producer)
44వ (1971) The French Connection 20th Century Fox Philip D'Antoni
45వ (1972) ది గాడ్‌ఫాదర్ Paramount Albert S. Ruddy
46వ (1973) ది స్టింగ్ యూనివర్సల్ టోనీ బిల్, మైకేల్ ఫిలిప్స్, జూలియా ఫిలిప్స్
47వ (1974) ది గాడ్‌ఫాదర్ పార్ట్ II [O] Paramount Francis Ford Coppola, Gray Frederickson, Fred Roos
48వ (1975) One Flew Over the Cuckoo's Nest United Artists Saul Zaentz [N], Michael Douglas
49వ (1976) Rocky United Artists Irwin Winkler, Robert Chartoff
50వ (1977) Annie Hall United Artists Charles H. Joffe
51వ (1978) The Deer Hunter Universal, EMI Films Barry Spikings, Michael Deeley, Michael Cimino, John Peverall
52వ (1979) Kramer vs. Kramer Columbia Stanley R. Jaffe
53వ (1980) Ordinary People Paramount Ronald L. Schwary
54వ (1981) Chariots of Fire Enigma Film Productions David Puttnam
55వ (1982) గాంధీ Columbia రిచర్డ్ అటెన్‌బరో
56వ (1983) Terms of Endearment Paramount James L. Brooks
57వ (1984) Amadeus (film) Orion Pictures Saul Zaentz
58వ (1985) Out of Africa Universal, Mirage Enterprises Sydney Pollack
59వ (1986) Platoon (film) Orion, Hemdale Arnold Kopelson
60వ (1987) The Last Emperor [O] Columbia, Hemdale, Recorded Picture Company, Yanco Films, TAO Films, AAA, Soprofilms Jeremy Thomas
61వ (1988) Rain Man United Artists Mark Johnson
62వ (1989) Driving Miss Daisy Warner Bros. Richard D. Zanuck, Lili Fini Zanuck
63వ (1990) Dances with Wolves Orion, TIG Productions Jim Wilson (producer) and Kevin Costner
64వ (1991) The Silence of the Lambs Orion Edward Saxon, Kenneth Utt, and Ron Bozman
65వ (1992) Unforgiven Warner Bros., Malpaso Productions Clint Eastwood
66వ (1993) షిండ్లర్స్ లిస్ట్ యూనివర్సల్, Amblin Entertainment స్టీవెన్ స్పీల్బర్గ్, Gerald R. Molen, and Branko Lustig
67వ (1994) Forrest Gump Paramount Wendy Finerman, Steve Tisch, and Steve Starkey
68వ (1995) Braveheart Paramount, 20th Century Fox, Icon Productions Mel Gibson, Alan Ladd, Jr., and Bruce Davey
69వ (1996) The English Patient Miramax, Tiger Moth Productions Saul Zaentz
70వ (1997) టైటానిక్ Paramount, 20th Century Fox, Lightstorm Entertainment జేమ్స్ కామెరాన్, జాన్ లాండౌ
71వ (1998) Shakespeare in Love Miramax, Universal, Bedford Falls Company David Parfitt, Donna Gigliotti, Harvey Weinstein, Edward Zwick, and Marc Norman
72వ (1999) American Beauty DreamWorks, Jinks/Cohen Co. Bruce Cohen and Dan Jinks
73వ (2000) Gladiator DreamWorks, Universal, Scott Free Productions Douglas Wick, David Franzoni, and Branko Lustig
74వ (2001) A Beautiful Mind DreamWorks, Universal, Imagine Entertainment Brian Grazer and Ron Howard
75వ (2002) Chicago Miramax, Producer Circle Co., Storyline Entertainment Martin Richards (producer)
76వ (2003) The Lord of the Rings: The Return of the King New Line Cinema, WingNut Films Barrie M. Osborne, Peter Jackson, and Fran Walsh
77వ (2004) Million Dollar Baby Warner Bros., Lakeshore Entertainment, Malpaso Clint Eastwood, Albert S. Ruddy, and Tom Rosenberg
78వ (2005) క్రాష్ (2004) Lionsgate Films, BlackFriar's Bridge, Harris Company, ApolloProScreen పాల్ హగ్గిస్ and క్యాథీ షుల్మన్
79వ (2006) The Departed Warner Bros., Plan B Pictures, Initial Entertainment Group, Vertigo Entertainment Graham King
80వ (2007) No Country for Old Men Paramount Vantage, Miramax, Mike Zoss Productions Scott Rudin, Joel Coen, and Ethan Coen
81వ (2008) స్లమ్‌డాగ్ మిలియనీర్ Fox Searchlight, Warner Bros., Celador, Film4 Productions Christian Colson
82వ (2009) The Hurt Locker Summit Entertainment, Voltage Pictures, First Light Productions, Kingsgate Films Kathryn Bigelow, Mark Boal, Nicolas Chartier, and Greg Shapiro
83వ (2010) The King's Speech The Weinstein Co., Momentum Pictures, UK Film Council, See-Saw Films, Bedlam Productions Iain Canning, Emile Sherman and Gareth Unwin
84వ (2011) The Artist (film) The Weinstein Co., La Petite Reine, ARP Sélection, Studio 37, La Classe Américaine, France 3, UMedia, Jouror Productions, JD Prod, Wild Bunch Thomas Langmann
85వ (2012) Argo Warner Bros., GK Films, Smoke House Pictures Grant Heslov, Ben Affleck and George Clooney
86వ (2013) 12 Years a Slave Fox Searchlight, Regency Enterprises, River Road Entertainment, Plan B Entertainment, New Regency, Film4 Productions Brad Pitt, Dede Gardner, Jeremy Kleiner, Steve McQueen (director) and Anthony Katagas
87వ (2014) బర్డ్‌మేన్ Fox Searchlight, Regency Enterprises, Worldview Entertainment Alejandro G. Iñárritu, John Lesher (producer) and James W. Skotchdopole
88వ (2015) స్పాట్‌లైట్ Open Road Films, Anonymous Content, First Look Media, Participant Media, Rocklin/Faust Blye Pagon Faust, Steve Golin, Nicole Rocklin and Michael Sugar
89వ (2016) మూన్ లైట్ (సినిమా) Adele Romanski, Dede Gardner, and Jeremy Kleiner
90వ (2017) ది షేప్ ఆఫ్ వాటర్ Guillermo del Toro and J. Miles Dale
91వ (2018) గ్రీన్ బుక్ Jim Burke, Charles B. Wessler, Brian Currie, Peter Farrelly, and Nick Vallelonga
92వ (2019) పారసైట్ క్వాక్ సిన్-ఎ, మూన్ యాంగ్-క్వాన్, బాంగ్‌ జూన్‌ హో, జాంగ్ యంగ్-హ్వాన్
93వ (2020) నోమాడ్ లాండ్ Frances McDormand, Peter Spears, Mollye Asher, Dan Janvey, and Chloé Zhao
94వ (2021) సిఓడిఏ Philippe Rousselet, Fabrice Gianfermi, and Patrick Wachsberger

Notes

  • A : The official name of the award from 1927/28 to 1928/29 was Outstanding Picture.
  • B : The official name of the award from 1929/30 to 1940 was Outstanding Production.
  • C : The official name of the award from 1941 to 1943 was Outstanding Motion Picture.
  • D : The official name of the award from 1944 to 1961 was Best Motion Picture.
  • E : The official name of the award since 1962 has been Best Picture.
  • F : There were two categories that were seen as equally the top award at the time: "Outstanding Picture" and Unique and Artistic Production where the winner for the latter was Sunrise (production company: Fox; producer: William Fox (producer)). This category was dropped immediately after the first year of the Academy Award and the former category was retroactively seen as the top award.[8]
  • G1 2 3 4 5 : Head of studio
  • H1 2 3 : The Academy also announced that A Farewell to Arms came in second, and Little Women third.
  • I1 2 3 : The Academy also announced that The Barretts of Wimpole Street came in second, and The House of Rothschild third.
  • J1 2 3 : The Academy also announced that The Informer came in second, and Captain Blood third.
  • K1 2 3 4 5 6 7 8 9 : Nominated motion picture with non-English dialogue track (AMPAS: foreign language film).[9] Four of which – Z; Life is Beautiful; Crouching Tiger, Hidden Dragon; and Amour – won the Academy Award for Best Foreign Language Film.[10]
  • L : Production company with the most nominations (38) and the most awards (5). Applying only from 1927/1928 to 1950.[11]
  • M : Person with the most nominations (8 nominations, 0 awards). Applying only from 1951 to 2012.[11]
  • N : Person with the most awards (3 awards, Spiegel 4 nominations, Zaentz 3 nominations). Applying only from 1951 to 2008.[11]
  • O1 2 3 : Winner with partly non-English dialogue track (AMPAS: foreign language).[12]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Academy Awards Database – Best Picture Winners and Nominees". Academy of Motion Picture Arts and Sciences. Retrieved 2012-05-24.
  2. "Why SUNRISE: A SONG OF TWO HUMANS is Essential". Turner Classic Movies. Retrieved 2012-05-24.
  3. "Who gets the Oscar?". Sydney Morning Herald. Associated Press. February 4, 2005. Retrieved October 23, 2013.
  4. "Academy restricts Oscar winners". BBC. June 26, 2001. Retrieved October 23, 2013.
  5. McNary, Dave (January 21, 2008). "PGA avoids credit limit". Variety.
  6. "Best Director Facts - Trivia (Part 2)". Filmsite. Retrieved 2009-11-13.
  7. Joyce Eng (24 June 2009). "Oscar Expands Best Picture Race to 10 Nominees". TV Guide Online. Archived from the original on 2012-12-08. Retrieved 2009-06-24.
  8. "Best Pictures - Facts & Trivia (part 1)". Filmsite.org. Archived from the original on 9 January 2010. Retrieved 2009-12-31.
  9. "Oscar Trivia". Oscars.org. Archived from the original on 2009-12-16. Retrieved 2009-11-13.
  10. Variety Staff (2007-03-01). "Best Foreign Film". Variety (magazine). Retrieved 2009-11-13.
  11. 11.0 11.1 11.2 "Academy Awards Statistics". Academy of Motion Picture Arts and Sciences. Retrieved 2009-11-13.
  12. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; filmsite2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లింకులు

మార్చు

మూస:Academy Awards మూస:Academy Awards lists మూస:AcademyAwardBestPicture