పీర్ల పండుగలో పేరెన్నికగన్న ధులా

(పీర్ల పండగలో పేరెన్నిక గన్న ధులా నుండి దారిమార్పు చెందింది)

ధులా అనే కళా రూపం, సర్కారు ఆంధ్ర దేశంలో కానీ, రాయలసీమ ప్రాంతంలో కాని ఎక్కడా కనిపించక పోయినా, తెలంగాణా ప్రాంతంలో మాత్రం అధిక ప్రచారంలో ఉంది. ఇది ముఖ్యంగా శ్రమ జీవుల కళా రూపమనీ, అంత కంటే ముఖ్యంగా ముస్లింలు జరుపుకునే పీర్ల పండగకు సంబంధించిందనీ, జయధీర్ తిరుమల రావు గారు ప్రజా కళారూపాలు అనే తమ గ్రంథంలో వివరించారు. ఇది శ్రమ జీవుల కళారూపమైనా శ్రమ జీవులందరూ ఈ కళా రూపంలో పాల్గొన్నట్లు మనకు పెద్ద ఆధారాలు లేవు. ఇది అందరూ కలిసి సామూహిక నృత్యం చేస్తారు. పాటకు, పాటకు సంబంధించిన ఆటకూ సంబంధించిన జానపద కళారూపం. ధులా కళా రూపానికి సంబంధించిన పాటల్లో గానీ, పదాల్లో గానీ అవి అతి చిన్నవిగానూ, అంత కంటే కథా వస్తువు అతి చిన్నది గానూ వుంటుంది. ముఖ్యంగా మొహరం పండుగల్లోజరిగే పీర్ల పండుగల్లో ధులా ఎక్కువ ప్రచారమైనా, ఆ కళారూపాన్ని తెలంగాణా పోరాట సమయంలో సాయుద దళాల్లో వున్న ముస్లిం సహోదరులూ, ఇతర శ్రమ జీవులూ కూడా ఈ కళారూపాన్ని బాగా ఉపయోగించు కున్నారు. దళాలకు సంబంధించిన క్యాంపులలో వున్న వారందరూ వలయాకారంగా నిలబడి, ఒకరు పాటను ప్రారంభించి, ఆ పాటను సామూహికంగా అందరూ అందుకుని ఆ పాటకు తగిన అడుగులను అందరూ ఒకే రీతిగా క్రమశిక్షణతో లయ బద్ధంగా ధులా పాటను పాడుకునే వారు. ధులా కళా రూపంలో పాడుకునే పాటలు అనేకం వున్నా ఈ క్రింది ఉదహరించిన పాట ఎంతో ప్రచారంలో ఉంది.

లంబాడి గన్నె గాడుసవరించు

వాని పేరు గన్నె గాడు, లంబాడోడు గన్నెగాడు
వాడి పల్లె దోచి నాడు, ఓడ పైన ఎక్కి నాడు
కొండ పోల్లో కొని నాడు - కొండ లాగ ఎదిగి నాడు
మీర్సాలం చూసినాడు - మీసామె దువ్వి నాడు
గూడెంలో పేల్చి నాడు - గుండేంతో చేసి నాడు...........|వాన|
రామ్మడు గూరేసి నాడూ - రాళ్ళ గుట్ట కెక్కి నాడు
పిట్టల్ గూడెం కొట్టి నాడు - పిట్టల్లే ఎగిరి నాడు
నల్లగొండ తిరిగి నాడు - నలుగురితో మెలిగినాడు
పల్లెల్లో తిరిగి నాదు - ప్రజల బాధ తెలిసినోడు..........|వాని|
బుగతాలా చూసినాడు బలుపంతా తీస్తాడాడు
బందూకూ పట్టినాడూ - బరిగీసి నిల్చినాడు
పోకిళ్ళకు ఓర్చాడాడు - పోలీసోళ్ళ ముంగు తాడు.....|వాని|
రైతుల్లో రాజు వాడూ - లలలన్నీ పండిస్తాడు

మరుసటేడు వస్తాడాడు - మా యిండ్లకే వస్తాడాడు.....|వాని|

ధులా కళా రూపంలోని పాటలు ఈ విధంగా సాగుతాయి. ప్రజా పోరాటంలో ప్రజా కళా కారులు ఈ పాటలను ప్రజల్లో ప్రచారానికి బాగా ఉపయోగించారు.

యివి కూడా చూడండిసవరించు

సూచికలుసవరించు

యితర లింకులుసవరించు