జానపద నృత్యం
జానపద నృత్యం (ఆంగ్లం: Folk dance) అనేది ఒక నిర్దిష్ట దేశం లేదా ప్రాంతంలోని ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే నృత్యం. అన్ని జాతి నృత్యాలు జానపద నృత్యాలు కావు. ఉదాహరణకు, ఆచార నృత్యాలు, ఆచార మూలం నృత్యాలు జానపద నృత్యాలుగా పరిగణించబడవు. ఎందుకంటే వాటి ఉద్దేశ్యం మతపరమైన ఆచారవ్యవహారాలకు ముడిపడి ఉంటుంది. నృత్యం సాంస్కృతిక మూలాలను ప్రస్తావించాలంటే జాతి, సాంప్రదాయ పదాలను ఉపయోగించాల్సిఉంటుంది. ఈ కోణంలో, దాదాపుగా అన్ని జానపద నృత్యాలు జాతిపరమైనవి.[1]
జానపద నృత్యం సాంప్రదాయానికి కట్టుబడి ఉండే నృత్యాలకు ప్రత్యేకించబడింది. ఇవి సాధారణంగా సామాజిక కార్యక్రమాలలో వృత్తిపరమైన శిక్షణ లేని వ్యక్తులచే సాంప్రదాయ సంగీతంతో నిర్వహించబడతాయి, అంతేకాని పబ్లిక్ పెర్ఫార్మెన్స్, స్టేజ్ కోసం రూపొందించబడవు. జానపద సంప్రదాయాలు కాలక్రమేణా మారుతుంటాయి. అంతర్జాతీయ సంస్కృతుల నుండి వారసత్వంగా వస్తుంది. కొత్త నృత్యకారులు ఇతరులను గమనించడం ద్వారా లేదా ఇతరుల సహాయం పొందడం ద్వారా మాత్రమే పుట్టుకొస్తారు.
భారతదేశం
మార్చు- భాగవత మేళా కళాకారులు 500 ఏళ్లుగా చిత్తశుద్ధితో తెలుగు భాష ఖ్యాతిని, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారు.
- భాంగ్రా పంజాబ్ జానపద నృత్యాలలో అత్యంత ప్రజాదరణపొందిన నృత్యం.
- ఛోలియా అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం, నేపాల్లోని సుదుర్పాశ్చిమ్ ప్రావిన్స్‌లోని కుమావోన్ డివిజన్‌లో ఉద్భవించిన సాంప్రదాయ జానపద నృత్యం.
- చౌ నృత్యం ఇది యుద్ధ, జానపద సంప్రదాయాలతో కూడిన సెమీ క్లాసికల్ భారతీయ నృత్యం.
- ఫుగ్డి మహిళలు సాధారణంగా వారి పని ఒత్తిడి నుండి ఉపశమనం గురించి చేస్తారు.
- గర్బా అనేది దేశంలోని గుజరాత్ రాష్ట్రం నుండి ఉద్భవించిన గుజరాతీ నృత్యం.
- గౌడీయ నృత్య ఇది బెంగాలీ నృత్య సంప్రదాయం.
- గిద్దా ఇది భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో, పాకిస్తాన్ లోనూ ప్రసిద్ధి పొందిన జానపద నృత్యం.
- కల్బెలియా ఇది రాజస్థాన్‌లోని థార్ ఎడారి నుండి వచ్చిన ఒక తెగకు సంబంధించిన నృత్యం. ఇది వారి సంస్కృతిలో అంతర్భాగం.
- కంబార అనేది కేరళ రాష్ట్రంలోని ఉత్తర జిల్లా అయిన వాయనాడ్‌లోని ఆదియన్ తెగ వారు ప్రదర్శించే జానపద నృత్యం.
- లావణి అనేది మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన సంగీత శైలి. ఇది ముఖ్యంగా పెర్కషన్ వాయిద్యమైన ఢోల్కీ దరువులకు అనుగుణంగా ప్రదర్శించబడుతుంది.
- రాజస్థానీ
- సత్త్రియ అనేది 500 సంవత్సరాల చరిత్రగల అస్సాంకు చెందిన శాస్త్రీయ నృత్యం.
- తిప్పని అనేది గుజరాత్‌లోని సౌరాష్ట్రలో చోర్వాడ్, వెరావల్ ప్రాంతం నుండి ఉద్భవించిన జానపద నృత్యం.
- యక్షగానం అనేది నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ.[2][3]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Folk dance | Definition, Music, History, Types, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-10.
- ↑ "yaksha". Encyclopædia Britannica. Retrieved 2007-09-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-02-09. Retrieved 2013-05-18.