పీసీ ఆదిత్య
పోతుగంటి చంద్ర ఆదిత్య తెలుగు సినిమా దర్శకుడు. అయన 2002లో ‘పిల్లలు కాదు పిడుగులు’ సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[1]ఆయన 2016లో గ్రాండ్ కింగ్‌డమ్ డైనస్టీ సర్కార్ దక్షిణ భారతదేశం తరఫున అంబాసిడర్‌గా నియమితులయ్యాడు.[2][3]ఆయన 100 రోజుల్లో 100 లఘు చిత్రాలను తీశాడు, దీనికి గాను ఢిల్లీ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు లో చోటు సంపాదించాడు.పీసీ ఆదిత్య 2016లో సింగపూర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.
పీసీ ఆదిత్య | |
---|---|
జననం | పోతుగంటి విద్యా ప్రకాష్ 1960 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | సినీ దర్శకుడు & నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002– ప్రస్తుతం |
తల్లిదండ్రులు | పోతుగంటి నర్సమాంబ, రామజోగారావు |
జననం, విద్యాభాస్యం
మార్చుపీసీ ఆదిత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా , వేపాడ మండలం , కుమ్మపల్లి గ్రామం లో పోతుగంటి నర్సమాంబ, రామజోగారావు దంపతులకు జన్మించాడు.ఆయన 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విజయవాడలో పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్‌ను పూర్తి చేశాడు.
దర్శకత్వంవహించిన సినిమాలు
మార్చు- పిల్లలుకాదు పిడుగులు
- కిట్టిగాడు
- ఇదీ ప్రేమంటే
- వై.ఎస్.మహాప్రస్థానం
- ఆడవిలో ఏం జరిగింది
- రేపటి పౌరులు
- రెండు
- మిస్టరీ
- పూతరేకులు
- అనగనగా ఓ రాకుమారుడు
- మై డాడ్స్ గర్ల్ ఫ్రెండ్ [4]
మూలాలు
మార్చు- ↑ Sakshi (23 August 2017). "డైరెక్టర్ మేడ్ ఇన్ కమ్మపల్లి". Sakshi. Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
- ↑ Sakshi (13 September 2016). "దర్శకుడు ఆదిత్యకు అరుదైన అవకాశం". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
- ↑ The Hans India (3 May 2019). "Short film in making on Pilot Abhinandan" (in ఇంగ్లీష్). Retrieved 10 August 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Hans India (2 April 2015). "PC Aditya goes to Hollywood" (in ఇంగ్లీష్). Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.