పుణ్యకుమారుని తిప్పలూరి శాసనం
పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము కడప జిల్లా యర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలో ఉంది. దీన్ని రేనాటి చోళరాజు ఎరికళ్ ముత్తురాజు మనుమడు పుణ్యకుమారుని కాలంలో చామణకాలు అనే ఉద్యోగి వేయించినాడు. పుణ్యకుమారుడు రేనాటి చోళరాజుల్లో గొప్పవాడు. దీని లిపి సొగసైన పల్లవ గ్రంథాక్షరములను పోలి ఉంటుంది. ఇది క్రీస్తు. 630. నాటిది కావచ్చును.[1]
శాసన విశేషాలు
మార్చు- సంస్ఫ్కత పదప్రయోగం ఎక్కువగా ఉన్న ప్రాచీన శాసనం.
- ఇది క్రియ లేకుండా వాక్యం ముగించిన తొలి శాసనం.
- ఇందులో ఏబది (50) అనే సంఖ్య చెప్పబడింది.
- ఇది తిథి, వార, నక్షత్ర, హోరలు చెప్పబడిన మొదటి తెలుగు శాసనం.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలుగు శాసనాలు (1975), రచించినవారు జి. పరబ్రహ్మశాస్త్రి