పుణ్యగిరి ఆలయం (శృంగవరపుకోట)

విజయనగరం జిల్లా,శృంగవరపుకోటలోని దేవాలయం

పుణ్యగిరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలని శృంగవరపుకోటకు పశ్చిమ దిశను ఎత్తయిన కొండలలో (తూర్పు కనుమలు) ఉంది. ఈ గ్రామం విజయనగరానికి 35 కి.మీ. దూరంలో, శృంగవరపుకోటకు 4 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది.

పుణ్యగిరి దేవాలయం (శృంగవరపుకోట)
220px
పుణ్యగిరి ఆలయ ముఖద్వారం
పుణ్యగిరి దేవాలయం (శృంగవరపుకోట) is located in Andhra Pradesh
పుణ్యగిరి దేవాలయం (శృంగవరపుకోట)
పుణ్యగిరి దేవాలయం (శృంగవరపుకోట)
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :18°07′00″N 83°10′00″E / 18.1167°N 83.1667°E / 18.1167; 83.1667
పేరు
ప్రధాన పేరు :పుణ్యగిరి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:విజయనగరం
ప్రదేశం:శృంగవరపుకోట
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఉమాకోటిలింగేశ్వరస్వామి
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

దేవాలయం చరిత్ర

మార్చు

ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉమాకోటిలింగేశ్వరస్వామి ఆలయం ఒకటి.దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ దేవాలయం విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలో ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో లో ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం. ఈ దేవాలయానికి మహాభారత కాలానికి సంబంధం ఉందని తెలుస్తుంది. అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరాట్‌రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది. ఆ సమయంలో పాండవులు ప్రతి రోజూ ఇక్కడ జలధారలలో స్నానమాచరించి, పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఈ దేవాలయం సకల సౌకర్యాలతో భక్తులకు కనువిందు చేస్తోంది. కోటి లింగాల రేవులో ఉన్న శివలింగాల మీద పైనుంచీ నీటి బిందువులు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తరువాత పుట్టధార వస్తుంది. ఈ ధార నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివలింగాల్ని తాకుతూ వస్తుంది. ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.మహా శివరాత్రి రోజున జలధారల కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకొని జాగరణ చేసినట్టయితే సర్వపాపాలు తొలగిపోవడమేగాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.[1][2]

ఉత్సవాలు

మార్చు

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మూడు రోజుల పాటు ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా పాల్గొంటారు. ఎక్కువగా శివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు భక్తులు శ్రీఉమాకోటి లింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు.దాదాపుగా ఈ మూడు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.[3] [4]

రవాణా సౌకర్యం

మార్చు

ఈ దేవాలయానికి రవాణా సౌకర్యం ఉంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి శృంగవరపుకోట వరకు బస్సు సౌకర్యం ఉంది.అక్కడ నుంచి ఆటోలో వెళ్ళవచ్చు.శివరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. "నాటి పాండవుల ఆవాసం పుణ్యగిరి క్షేత్రం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2020-06-27. Retrieved 2020-06-27.
  2. "Tourism". web.archive.org. 2005-12-23. Archived from the original on 2005-12-23. Retrieved 2020-06-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-27.
  4. "పుణ్యగిరి జాతరకు సర్వం సిద్ధం". www.eenadu.net. Archived from the original on 2020-06-28. Retrieved 2020-06-27.

వెలుపలి లంకెలు

మార్చు