పుదుచ్చేరి జిల్లా

పుదుచ్చేరి జిల్లా, దీని పూర్వపు పేరు పాండిచేరి జిల్లా. ఇది దక్షిణ భారతదేశంలోని పుదుచ్చేరి కేంద్రపాలిత భూభాగంలోని నాలుగు జిల్లాలలో ఇది ఒకటి.ఈ జిల్లా 290 చ.కి.మీ. (110 చ.మైళ్ళు) లో విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[2] ఇది తమిళనాడు రాష్ట్ర సమీపంలోని దట్టమైన బంగాళాఖాతం తీరంలో  తమిళనాడు రాష్ట్రంలో అంతర్భాగంగా 11 స్వరాష్ట్ర ప్రాంతాలలో విస్తరించి ఉంది.2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 950,289 మంది జనాభా ఉన్నారు. [3]

పుదుచ్చేరి
పాండిచ్చేరి జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంపుదుచ్చేరి
ప్రధాన కార్యాలయంపాండిచ్చేరి
తాలూకాఅరియాంకుప్పం, ఓజుకారై, విల్లియనూర్
Government
 • Typeనగరపాలక సంస్థ
 • Bodyపాండిచ్చేరి నగరపాలక సంస్థ
 • జిల్లా కలెక్టరుటి.అరున్, ఐఎఎస్
 • సీనియర్ పోలీసు సూపరింటెండెంట్రాహుల్ అల్వాల్, ఐపిఎస్
Area
 • Total293 km2 (113 sq mi)
Elevation
3 మీ (10 అ.)
Population
 (2011)
 • Total9,50,289
 • Density3,200/km2 (8,400/sq mi)
భాషలు
 • అధికారతమిళ భాష, ఆంగ్ల భాష
 • అదనంప్రెంచి భాష[1]
Time zoneUTC+5:30
పిన్‌కోడ్
605xxx
ప్రాంతీయ ఫోన్‌కోడ్0413
ISO 3166 codeIN-PY
Vehicle registrationPY-01
సమీ ప జిల్లాలువిలుప్పురం జిల్లా , కడలూరు జిల్లా
Central location:11°13′N 78°10′E / 11.217°N 78.167°E / 11.217; 78.167

పరిపాలనా విభాగాలు మార్చు

 
భౌగోళికంగా, పుదుచ్చేరి జిల్లా వలసరాజ్యాల కాలంలో ఉన్నట్లుగా చాలా విచ్ఛిన్నమైంది.
జిల్లా తాలూకాలు పురపాలక సంఘాలు జిల్లావంటి విభాగం జనగణన పట్టణాలు
పుదుచ్చేరి బహౌర్ ఏదీ లేదు
  • బహౌర్
  • నెట్టపక్కం
ఏదీ లేదు
ఉజవర్కరై
  • ఉజవర్కరై
ఏదీ లేదు ఏదీ లేదు
పుదుచ్చేరి
  • పాండిచేరి
  • అరియాన్‌కుప్పం
  • అరియాన్‌కుప్పం
  • మానవీలీ
విల్లియనూర్ ఏదీ లేదు
  • మన్నాడిపేట
  • విల్లియనూర్
  • విల్లియనూర్

పుదుచ్చేరి కేంద్ర భూభాగాన్ని పరిపాలనా ప్రయోజనం కోసం ఎనిమిది తాలూకాలుగా విభజించారు.[4] పుదుచ్చేరి జిల్లాలో నాలుగు తాలూకాలు పుదుచ్చేరి, ఓజుకరై, విల్లియానూర్, బహౌర్ ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఒక్క ఓజుకరై తాలూకాలో మాత్రమే గ్రామీణ ప్రాంతాలు లేవు. [5] ఇతర మూడు తాలూకాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలను కమ్యూన్ పంచాయతీలు (సిపి) లేదా కేవలం కమ్యూన్‌లుగా విభజించారు.పుదుచ్చేరి తాలూకాలోని గ్రామీణ ప్రాంతం ఒకే కమ్యూన్ - అరియాన్‌కుప్పం పరిధిలో ఉంది.. విల్లియనూర్ తాలూకాలో విల్లియనూర్,  మన్నాడిపేట రెండు కమ్యూన్లు ఉన్నాయి.బహూర్ తాలూకాలోని గ్రామీణ ప్రాంతం బహౌర్, నెట్టప్పక్కం రెండు కమ్యూన్‌లను కలిగి ఉంది.

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పుదుచ్చేరి జిల్లాలో ప్రస్తుతం ఉన్నపాండిచ్చేరి, ఓజుకరై, పురపాలక సంఘం, కురంబపేట గ్రామ పంచాయితీ అనే మూడు చట్టబద్దమైన పట్టణాలను గుర్తించింది. [5] అరియాన్‌కుప్పం, మానవీలీ, విల్లియానూర్ పుదుచ్చేరి పట్టణ సముదాయంగా ఉన్నాయి.[6] ఈ ఆరు పట్టణాల పరిధిలో ఓడియంపేటతో పాటు కురుంబపేట పట్టణ అభివృద్ధిగా పరిగణించబడుతుంది.

పుదుచ్చేరి ప్రభుత్వం పుదుచ్చేరి జిల్లాను పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ విపత్తు నిర్వహణ అనే రెండు ఉప విభాగాలుగా నిర్వచించింది.పాండిచేరి నార్త్ సబ్ డివిజన్, పాండిచేరి సౌత్ సబ్ డివిజన్, ఒక్కొక్కటి రెండు తాలూకాలను కలిగి ఉంటాయి. [7] పాండిచేరి ఉత్తర ఉపవిభాగంలో పాండిచేరి, ఓజుకారై తాలూకాలు ఉన్నాయి. అయితే పాండిచేరి సౌత్ సబ్ డివిజన్ జిల్లాలోని ఇతర రెండు తాలూకాలు విల్లియనూర్, బహౌర్ కలిగి.ఉన్నాయి. [8] ఈ నాలుగు తాలూకాల్లో ప్రతి ఒక్కటి ఉప-తాలూకాలు / ఫిర్కాలుగా విభజించబడ్డాయి. ఇవి గ్రామీణ / పాక్షిక పట్టణ / పట్టణ ప్రాంతాల నుండి వచ్చే ఆదాయ గ్రామాలను కలిగి ఉంటాయి.

పుదుచ్చేరి ప్రభుత్వ ప్రణాళిక పరిశోధన విభాగం, ఒక బ్లాక్ భావనను మరింత నిర్వచిస్తుంది. పుదుచ్చేరి యూనియన్ భూభాగం ఆరు బ్లాక్‌లుగా విభజించబడింది. [9] వీటిలో మూడు పుదుచ్చేరి జిల్లాపరిధిలో ఉన్నాయి. అవి అరియాంకుప్పం, ఓజ్ఖురై, విల్లియానూర్.

జనాభా మార్చు

పుదుచ్చేరి జిల్లా జనాభా మొత్తం 9,50,289[3] ఇది ఫిజి దేశం [10] లేదా యుఎస్ రాష్ట్రమైన డెలావేర్ జనాభాకు సమానంగా ఉంది. [11] ఇది భారతదేశంలో జనాభాలో 460 వ ర్యాంకుగా ఉంది. (మొత్తం 640 లో ). జిల్లా జనాభా సాంద్రత చ.కి.మీ.కు 3,231 (8,370 చ.మైలుకు) ఉంది. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 28.73%గా ఉంది. పుదుచ్చేరి జిల్లా లింగ నిష్పత్తిని ప్రతి 1,000 మంది పురుషులకు 1,031 స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యత రేటు 86.13%గా ఉంది.

గమనికలు మార్చు

  1. "Official Languages of Pondicherry - E-Courts Mission, Government of India". Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 10 డిసెంబరు 2020.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Pondicherry: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1222. ISBN 978-81-230-1617-7.
  3. 3.0 3.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. "Literacy Rates by Residence and Sex - U.T. District and Taluk – 2011" (PDF). 2011 census of India. Retrieved 2 February 2013.
  5. 5.0 5.1 "Chapter 1 (Introduction)" (PDF). 2011 census of India. pp. 4, 5. Retrieved 2 February 2013.
  6. "Chapter 4 (Trends in Urbanisation)" (PDF). 2011 census of India. pp. 26, 27. Retrieved 2 February 2013.
  7. "Right to Information Act Manual, Manual 2" (PDF). Department of Revenue and Disaster Management, Government of Puducherry. Archived from the original (PDF) on 18 November 2007. Retrieved 4 February 2013.
  8. "Right to Information Act Manual, Manual 1" (PDF). Department of Revenue and Disaster Management, Government of Puducherry. Archived from the original (PDF) on 28 May 2012. Retrieved 4 February 2013.
  9. "Draft Annual Plan 2012-13" (PDF). Planning and Research Department, Government of Puducherry. p. 1. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 4 February 2013.
  10. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  11. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware 897,934

బాహ్య లింకులు మార్చు