పునీత్ రాజ్‍కుమార్
పునీత్ రాజ్ కుమార్ (1975 మార్చి 17 - 2021 అక్టోబరు 29) కన్నడ సినిమా నటుడు. ఆయన ఆరు నెలల వయస్సులో 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. పునీత్ రాజ్కుమార్ 2002లో అప్పూ సినిమాతో హీరోగా పరిచయమై తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు.
పునీత్ రాజ్ కుమార్ | |
---|---|
![]() | |
జననం | లోహిత్ రాజ్ కుమార్ 17 మార్చి 1975 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
మరణం | 2021 అక్టోబరు 29 | (వయసు 46)
ఇతర పేర్లు | అప్పు యువరత్నా పవర్ స్టార్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు |
|
జీవిత భాగస్వామి | అశ్విని రేవంత్ (1999) |
పిల్లలు | ధ్రితి, వందిత |
తల్లిదండ్రులు |
|
బంధువులు | రాఘవేంద్ర రాజ్కుమార్, శివ రాజ్‌కుమార్ (అన్నయ్యలు) |
జననం, విద్యాభాస్యంసవరించు
పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17లో తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశాడు.
సినీ జీవితంసవరించు
పునీత్ రాజ్ కుమార్ ను తన తండ్రి రాజ్ కుమార్ సినిమా సెట్స్ కు తీసుకువెళ్ళేవాడు. అలా ఆయన పుట్టిన ఏడాదిలోనే వి.సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమడ కనికే' చిత్రంలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. అప్పటికి పునీత్ వయసు కేవలం ఆరు నెలలు మాత్రమే. పునీత్ తరువాత బాల నటుడిగా భూమిగే బండ భగవంత, భాగ్యవంత, హోస బెళక్కు, చలిసువ మోడగులు, భక్త ప్రహ్లాద, ఎరాడు నక్షత్రగలు, యారీవను, బెట్టాడా హువు, శివ మెచ్చిడ కన్నప్ప, పరశురామ్ చిత్రాల్లో నటించాడు. ఆయన 1985లో నటించిన "బెట్టాడ హూవు" చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు.[1]
పునీత్ రాజ్కుమార్ 2002లో 'అప్పు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇది తెలుగులో రవితేజ నటించిన ఇడియట్ సినిమాకు రీమేక్. ఆయన అభి (2003), వీర కన్నడిగ (2004), మౌర్య (2004), ఆకాష్ (2005), అజయ్ (2006), అరసు (2007), మిలానా (2007), వంశీ (2008), పవర్, బిందాస్, జాకీ, హుడుగారు, అన్న బాండ్, రానా విక్రమ, రాజకుమార లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఆయన మిలనా చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, సువర్ణ ఫిల్మ్ అవార్డును, 2008లో బిందాస్ మూవీతో ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డు అందుకున్నాడు.
పునీత్ రాజ్కుమార్ 2019లో తొలిసారిగా కవలుదారీ చిత్రాన్ని నిర్మించాడు. ఆయన పలు టి.వి. షో లకు హోస్ట్ గా, జడ్జిగా, యూపీ స్టార్టర్స్ కు జడ్జిగా వ్యవహరించాడు. పునీత్ 2012, 2013లలో కన్నడద కొట్యాధిపతి షోను రెండు సీజన్స్ పాటు హోస్ట్ గా వ్యవహరించి, 2019లో మూడోసారి కన్నడద కొట్యాధిపతి షోకు హోస్ట్ గా వ్యవహరించాడు. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు.[2]
సేవ కార్య్రమాలుసవరించు
పునీత్ రాజ్‌కుమార్ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు మరియు 19 గోశాలలు ఏర్పాటు చేశాడు.
మరణంసవరించు
పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు.[3][4]
డాక్టరేట్‌సవరించు
మైసూరు విశ్వవిద్యాలయం 112వ స్నాతకోత్సవంలో భాగంగా పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది.[5]
మూలాలుసవరించు
- ↑ TV5 News (29 October 2021). "చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో.. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా." (in ఇంగ్లీష్). Archived from the original on 29 October 2021. Retrieved 29 October 2021.
- ↑ TV5 News (29 October 2021). "29 సినిమాలు.. ఎన్నో సేవా కార్యక్రమాలు.. పునీత్ రాజ్‌కుమార్ ప్రస్థానం ఇదే." (in ఇంగ్లీష్). Archived from the original on 29 October 2021. Retrieved 29 October 2021.
- ↑ Andrajyothy (29 October 2021). "పునీత్ రాజ్ కుమార్ మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు." Archived from the original on 29 October 2021. Retrieved 29 October 2021.
- ↑ TV9 Telugu (29 October 2021). "కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‌లో సినీ పరిశ్రమ." Retrieved 29 October 2021.
- ↑ Andhra Jyothy (23 March 2022). "పవర్‌స్టార్ పునీత్‌కు మరణానంతరం డాక్టరేట్". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.