పురు 2022లో మలయాళంలో విడుదలైన డ్రామా సినిమా. వేఫారెర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్‌ జార్జ్‌ నిర్మించిన ఈ సినిమాకు రథీనా పీటీ దర్శకత్వం వహించింది. మమ్ముట్టి, పార్వతి తిరువోతు, వాసుదేవ్‌ సజీత్, నెడుముడి వేణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 13న సోనీ లివ్‌ ఓటీటీలో విడుదలైంది.

పురు
దర్శకత్వంరథీనా పీటీ
రచనహర్షద్
షర్ఫు
సుహాస్
కథహర్షద్
నిర్మాతఎస్‌. జార్జ్‌
తారాగణంమమ్ముట్టి
పార్వతి తిరువోతు
మాళవిక మీనన్
నెడుముడి వేణు
ఛాయాగ్రహణంతేని ఈశ్వర్
కూర్పుదీపు జోసెఫ్
సంగీతంజాక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థ
వేఫర్ర్ ఫిలిమ్స్
పంపిణీదార్లుసోనీ లివ్
విడుదల తేదీ
2022 మే 13 (2022-05-13)
సినిమా నిడివి
115 నిమిషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

కథ మార్చు

కుట్ట‌న్ (మమ్ముట్టి) రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్‌, అతడి భార్య చ‌నిపోవ‌డంతో ఆమె జ్ఞాప‌కాల్ని త‌ల్చుకుంటూ తన కొడుకు కిచ్చునే (వాసుదేవ్) స‌ర్వ‌స్వంగా జీవిస్తుంటాడు. తండ్రి మితిమీరిన ఆంక్ష‌ల వ‌ల్ల కిచ్చు ఇబ్బంది పడుతూ లోప‌ల ద్వేషం ఉన్నా తండ్రి మీద భయంతో బ‌య‌ట‌కు వ్య‌క్తం చేయ‌లేక‌పోతాడు. కుట్ట‌న్ సోద‌రి భార‌తి(పార్వతి) పెద్ద‌ల‌ను ఎదురించి కేపీ అనే వ్యక్తిని ప్రేమ‌వివాహం చేసుకుంటుంది. కేపీది త‌క్కువ కులం కావ‌డంతో కుట్ట‌న్ కుటుంబ‌స‌భ్యులు వారిని దూరం పెడతారు, కానీ అనుకోకుండా కుట్ట‌న్ ఉండే అపార్ట్‌మెంట్‌లోకి భ‌ర్త‌తో క‌ల‌సి భార‌తి నివసిస్తుంది. ఈ క్రమంలో కుట్టన్‌ను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తుంటారు. కుట్టన్ చంపేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? వారికి కుట్టన్‌కు సంబంధం ఏంటీ ? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. 6TV News (16 May 2022). "మమ్ముట్టి పురు మూవీ ఎలా ఉందంటే..." Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
  2. The Hindu (12 May 2022). "'Puzhu' movie review: Mammootty's menacing presence anchors this important debut film with a few failings" (in Indian English). Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=పురు&oldid=3884427" నుండి వెలికితీశారు