నెడుముడి వేణు
కేశవన్ వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ చలనచిత్ర నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన మలయాళం, తమిళంలో దాదాపు 500కి పైగా చిత్రాలలో నటించాడు. వేణు 1978లో కన్నడలో విడుదలైన ‘తంబు’ చిత్రంతో సినీరంగంలోకి అడుగు పెట్టాడు. నెడిముడి వేణు వివిధ కేటగిరీలలో మూడు జాతీయ అవార్డులు ‘హిస్ హైనెస్ అబ్దుల్లా’ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా, ‘మార్గం’ చిత్రానికి స్పెషల్ జ్యూరీ, ‘మినుక్కు’కు జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ నెరేషన్/వాయిస్ ఓవర్‌కు అందుకున్నాడు. ఆయన ఉత్తమ నటుడిగా మూడుసార్లు కేరళ ప్రభుత్వ అవార్డు, రెండు సార్లు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు.
నెడుముడి వేణు నటించిన పలు సినిమాలు
మార్చు- ‘తంబు’ (1978 మలయాళం) - తొలి సినిమా
- తకారా (1979 మలయాళం)
- మొగముల్
- భారతీయుడు (తెలుగు)
- అపరిచితుడు (తెలుగు)
- నవరస (వెబ్‌సిరీస్) (2021)
- మరక్కార్: అరేబియా సముద్ర సింహం (2021)
- అరబికాడలింటే సింహం (తమిళం)
- ఇండియన్ -2 (తమిళం)
- ‘సర్వం తాళమయం (తమిళం)
- రాజా నరసింహా
- భీష్మపర్వం
- పురు
మరణం
మార్చునెడుముడి వేణు లివర్ సంబంధిత వ్యాధితో తిరువనంత పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించిడంతో 2021 అక్టోబరు 11న మరణించాడు.[1][2][3][4]
మూలాలు
మార్చు- ↑ Eenadu (11 October 2021). "'అపరిచితుడు' నటుడు నెడుముడి వేణు ఇక లేరు - malayalam actor nedumudi venu passes away". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
- ↑ TV9 Telugu (11 October 2021). "సినీ ఇండస్ట్రీలో విషాదం.. నేషనల్ అవార్డ్ విన్నర్ నెడుముడి వేణు మరణం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andrajyothy (12 October 2021). "మలయాళ నటుడు నెడుముడి వేణు ఇక లేరు". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
- ↑ NTV (11 October 2021). "ప్రముఖ నటుడు నెడుముడి వేణు కన్నుమూత". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.