పురుషోత్తమ చౌదరి
పురుషోత్తం చౌదరి (సెప్టెంబరు 5, 1803 - ఆగష్టు 23, 1890) తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. సి.పి. బ్రౌన్, త్యాగరాజుకు సమకాలికుడు. తాను రాసిన కీర్తన లను స్వయంగా గానం చేస్తూ ప్రజా బాహుళ్యానికి అందించారు.
జననం
మార్చుశ్రీకాకుళం జిల్లా తెంబూరు (పాతపట్నం) శివారు మదనాపురం (తెంబూరు (పాతపట్నం) లో 1803, సెప్టెంబరు 5 న బెంగాళీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుభద్రాదేవి, కూర్మానాథ చౌదరి దంపతులకు జన్మించారు. 1829 లో విశాఖపట్నంలో క్రైస్తవ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 1833లో 'కులాచార పరీక్ష' అనే పత్రికను రాసి, కులవ్యవస్థను ఖండించారు. 1833 అక్టోబరులో కటక్‌లో 'బాప్తిస్మం' తీసుకొని, క్రైస్తవ మత ప్రచారం ప్రారంభించారు. 18 రోజులు కాలినడకన పాటలు పాడుకుంటూ ప్రచారం చేస్తూ మద్రాసు వెళ్లారు. ఎన్నో కీర్తనలు రచించారు. ఈరోజు చౌదరి రాసిన కీర్తన వినిపించని చర్చి, క్రైస్తవుల ఇళ్లు లేవు. 67 ఏళ్ల వయసు వరకూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండి, జీవిత చరమాంకాన్ని కటక్‌లోని పిల్లల దగ్గర గడిపారు. 1933లో చౌదరి శతజయంతి ఉత్సవాలు ఆంధ్రా-ఒరిస్సాలో ఘనంగా నిర్వహించారు.పర్లాకిమిడిలో స్మారకమందిరం నిర్మించారు. 1994-95లో పురుషోత్తమ చౌదరి జీవితం రచనలపై డాక్టర్ సుధారత్నాంజలి సామ్యూల్ ఎం.ఫిల్‌ను మద్రాసు యూనివర్శిటిలో చేశారు. పురుషోత్తమ చౌదరి స్వహస్తాలతో శ్రీకాకుళం చిన్నబజారులోని తెలుగు బాప్తిస్టు చర్చిని దాదాపు 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆయన భార్య శ్రీకాకుళంలోనే మరణించారు.