పులగుర్త లక్ష్మీనరసమాంబ
పులగుర్త లక్ష్మీనరసమాంబ ప్రముఖ తెలుగు కవయిత్రి.[1] స్త్రీ విద్య పట్ల అభిమానం ప్రదర్శిస్తూ గ్రంథ రచన సాగిస్తూ, సావిత్రి పత్రికలో స్త్రీల రచనల్ని ప్రోత్సహిస్తుండేవారు. ఆనె కాల్పనిక రచనలు చేసే మహిళలలో ప్రథములు[2].
జీవిత వివరాలు
మార్చుఈవిడ తండ్రి చింతలపూడి నీలాచలం, భర్త పులుగుర్త వెంకటరత్నం, మేనమామ ప్రముఖ పండితుడు [[నడకుదుటి వీరరాజు]], గురువు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి.
సాహిత్యరంగం
మార్చు15 సంవత్సరాల వయస్సులోనే మహిళా కళా బోధిని అనే గ్రంథం రచించింది. కాకినాడ లో విద్యార్థినీ సమాజాన్ని స్థాపించింది. ఈవిడ రాసిన వ్యాసాలు సావిత్రి, హిందూ సుందరి, జనని మొదలైన పత్రికలలో ప్రచురించబడేవి.
లక్ష్మీనరసమాంబ ప్రారంభించిన సావిత్రి పత్రిక తొలి సంచిక (1904 జనవరి)[3] హైదరాబాద్ స్టేట్ ఆర్కైవ్ లో ఉంది. సతీ ధర్మాలు, నీతి కథావల్లరి లాంటి నీతి బోధకమైన రచనలు... ధైర్యస్థైర్యాలు, సావిత్రి, లోక బాంధవి లాంటి నాటికలు సావిత్రి పత్రికలో వచ్చాయి.
సావిత్రి పత్రిక
మార్చు1910లో ఆమె సావిత్రి అనే పత్రికను నిర్వహించారు. ఇది కాకినాడ నుండి ప్రచురితమయ్యేది. లక్ష్మీ నరసమాంబ మంచి వక్త. హిందీ, బెంగాలీ భాషలలో గొప్ప పాండిత్యమున్నదామెకు. స్త్రీలకు విద్య అవసరమని వాదిస్తూ, తన పత్రిక ద్వారా ప్రచారం చేసేది. కందుకూరి సంఘ సంస్కరణోద్యమం పట్ల ఈమెకు వ్యతిరేక భావాలుండేవి. ఈ అంశమై సావిత్రిలో చర్చోపచర్చలు జరుగుతుండేవి. పత్రికను ప్రోత్సహించమని ఈమె చేసిన విజ్ఞప్తిని గమనిస్తే ఆనాటికీ, ఈనాటికీ స్త్రీల పత్రికల ఆర్థిక స్థితిలో ఏమి మార్పులేదని అర్థమవుతుంది.[4]
రచనలు
మార్చు- లోకబాంధవి (గద్య గ్రంథం): 1904[5]
- వజ్రపేటిక (కథ) : 1904 [5]
- కామ మంజరి (గద్య గ్రంథం)
- యోగేశ్వరి (పద్య కావ్యం) (ఆంధ్ర ప్రచారణి గ్రంథమాల ద్వారా 1927లో ప్రచురించబడినది)[2]
- అన్నపూర్ణ (పద్య కావ్యం)
- వామన పురాణం (పద్య కావ్యం)
- మహిళా కళా బోధిని (పద్య కావ్యం)
- స్త్రీ నీతి గీతమాల (పద్య కావ్యం)
- సతీధర్మములు (పద్య కావ్యం)
- అమాల్య (పద్య కావ్యం)
- మంగళహారాలు
మూలాలు
మార్చు- ↑ పులగుర్త లక్ష్మీనరసమాంబ, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 99. ISBN 978-81-8351-2824.
- ↑ 2.0 2.1 Nidudavolu Venkatarao: a walking encyclopedia by Nidadavolu Malathi
- ↑ "A historical perspective of Women's writing in Andhra Pradesh 06/04/2013". Archived from the original on 2017-04-15. Retrieved 2017-04-25.
- ↑ మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు- కొండవీటి సత్యవతి
- ↑ 5.0 5.1 కథానిలయంలో పులుగుర్త లక్ష్మీనరసమాంబ కథలు[permanent dead link]