పులి (2015 సినిమా)

పులి 2015లో తెలుగులో విడుదలైన సోషియో ఫాంటసీ సినిమా.[1] యస్.వి.ఆర్ మీడియా (ప్రై) లిమిటెడ్ బ్యానర్ పై సి. శోభ నిర్మించిన ఈ సినిమాకు చింబు దేవన్ దర్శకత్వం వహించాడు. విజయ్, శ్రీదేవి, సుదీప్, శృతి హాసన్, హన్సికా మోత్వాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2 అక్టోబర్ 2015న విడుదలైంది.

పులి
దర్శకత్వంచింబు దేవన్
రచనశర్మ దేవేన్
నిర్మాతసి. శోభ
నటవర్గంవిజయ్
శ్రీదేవి
సుదీప్
శృతి హాసన్
హన్సికా మోత్వాని
ఛాయాగ్రహణంనటరాజన్ సుబ్రమణ్యం
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
యస్.వి.ఆర్ మీడియా (ప్రై) లిమిటెడ్
విడుదల తేదీలు
2 అక్టోబర్ 2015
నిడివి
154 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

భేతాళ దేశాన్ని పరిపాలించే రాణి యవ్వనరాణి (శ్రీదేవి), ఆమె దళపతి జలంధరుడు (సుదీప్) ప్రజలను హింసలు పెడుతూ, వారిని బానిసలుగా చూస్తూ, వారి పంట, ధనాన్ని లాక్కుంటూ వుంటాడు. ఆ భేతాళ దేశం కింద వుండే గ్రామాల్లో భైరవ కోన ఒకటి. ఆ కోనకు నాయకుడు నరసింగ నాయకుడు (ప్రభు). నరసింగకు అనుకోకుండా నదిలో కొట్టుకు వచ్చిన ఓ బిడ్డ దొరుకుతాడు. ఆ బిడ్డకు మనోహరుడు (విజయ్) అనే పేరు పెట్టి, పెంచుతాడు. మనోహరుడిని ఆ భేతాళ జాతిని అడ్డుకోగల వీరుడిలా తయారు చేస్తాడు . అదే కోనలో వుండే మందార మల్లి (శృతిహాసన్) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అదే సమయంలో భేతాళ జాతి వారు వచ్చి భైరవ కోనలోని ప్రజలను కొట్టి, మందారమల్లిని ఎత్తుకెళ్లిపోతారు. దీంతో మందారమల్లి కోసం మనోహరుడు భేతాళ దేశానికి బయలుదేరుతాడు . అక్కడ మనోహరుడికి ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి? మనోహరుడికి భేతాళ దేశంలో తెలిసిన విషయాలేంటి ? మందార మల్లిని మనోహరుడు ఎలా కాపాడాడు ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్:యస్.వి.ఆర్ మీడియా (ప్రై) లిమిటెడ్
  • నిర్మాత:సి. శోభ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చింబు దేవన్
  • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
  • సినిమాటోగ్రఫీ: నటరాజన్ సుబ్రమణ్యం
  • ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

మూలాలుసవరించు

  1. Sakshi (29 September 2015). "పిల్లల కోసం 'పులి'". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. Sakshi (4 January 2015). "తమిళ పులిలో 'శ్రీదేవి'". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  3. Sakshi (16 July 2015). "పులి కోసం పాట". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.