సుదీప్ (జననం: సెప్టెంబరు 2 1973) దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత, టీవీ వ్యాఖ్యాత.[1] కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.

సుదీప్
2013 లో టీచ్ ఎయిడ్స్ ఇంటర్వ్యూలో సుదీప్
జననం
సుదీప్ సంజీవ్

జాతీయతభారతీయుడు
విద్యాసంస్థదయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగుళూరు
వృత్తినటుడు, దర్శకుడు, టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ప్రియా రాధాకృష్ణన్
(m. 2001)
పిల్లలు1

సుదీప్ నటించిన ప్రముఖ కన్నడ సినిమాలు స్పర్శ (2000), హుచ్చా (2001), నంది (2002), కిచ్చా (2003), స్వాతి ముత్తు (2003), మై ఆటోగ్రాఫ్ (2006), ముస్సంజెమాటు (2008), వీరమడకరి (2009), జస్ట్ మాత్ మాతల్లి (2010), కెంపే గౌడ (2011).[2]

కన్నడంలో హుచ్చా (2001), నంది (2002), స్వాతి ముత్తు (2003) సినిమాలకు వరుసగా మూడు సంవత్సరాలు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. 2013 నుంచి కన్నడ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

బాల్యం

మార్చు

సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో సంజీవ్ మంజప్ప, సరోజ దంపతులకు జన్మించాడు.విరు బెదరులు అంటే బోయ రాజులు. బెంగుళూరు లోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు.[3] విశ్వవిద్యాలయం స్థాయిలో క్రికెట్ ఆటగాడు కూడా. రాష్ట్ర స్థాయిలో అండర్-17, అండర్-19 పోటీల్లో కూడా పాల్గొన్నాడు. నటుడు కావడానికి మునుపు ముంబై లోని తనేజా యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు.[4]

సినిమాలు

మార్చు

పురస్కారాలు

మార్చు
  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ ప్రతినాయకుడు (ఈగ)[5][6][7][8]

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

సైమా అవార్డులు

మూలాలు

మార్చు
  1. "sudeep biography". entertainment.oneindia.in. Archived from the original on 2014-07-07. Retrieved 2016-09-24.
  2. "Fame flies for Sudeep". The Hindu. 2 August 2014. Retrieved 12 April 2015.
  3. Sudeep (24 April 2016). Weekend with Ramesh Season 2 - Episode 33 - April 23, 2016 - Full Episode (in Kannada). ozee.com. Event occurs at 16:35. Archived from the original on 13 ఆగస్టు 2016. Retrieved 15 August 2016.{{cite AV media}}: CS1 maint: unrecognized language (link)
  4. "Sudeep Sanjeev – 'Sparsha' of the Kannada film industry". bangalorebest.com. Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 1 October 2014.
  5. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
  6. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  7. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  8. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=సుదీప్&oldid=3888433" నుండి వెలికితీశారు