పుష్పంతా ప్యాలెస్


కుంజబన్ ప్యాలెస్ అని కూడా పిలువబడే పుష్పబంత ప్యాలెస్ త్రిపురకు చెందిన పూర్వపు రాజభవనాలలో ఒకటి, దీనిని మహారాజా బీరేంద్ర కిషోర్ మాణిక్య 1917లో నిర్మించారు. ఇది 2018 వరకు త్రిపుర రాజ్‌భవన్‌గా ఉండేది. దానిని తర్వాత ప్రభుత్వం. [1] జాతీయ స్థాయి సాంస్కృతిక మ్యూజియంగా మార్చి, అభివృద్ధి చేపట్టింది. [2]

చరిత్ర

మార్చు

పుష్పబంత ప్యాలెస్, త్రిపుర మాజీ రాజ్ భవన్ . దీనిని మహారాజా బీరేంద్ర కిషోర్ మాణిక్య డెబ్బర్మాన్ బహదూర్ (1909-1923) నిర్మించారు. ఉజ్జయంత ప్యాలెస్‌కు ఉత్తరాన ఒక కి.మీ దూరంలో ఉన్న కుంజబాన్ అని పిలువబడే పచ్చని కొండపై అతను ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు. ఆ స్థలంలో ఈ ప్యాలెస్ 1917లో నిర్మించాడు. దీనికి పుష్పబంట ప్యాలెస్ అనే పేరు పెట్టారు. ఇది మొత్తం 1.76 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించబడింది.[3][4]

మాణిక్య రాజులకు అతిథి గృహంగా మారింది. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, రాజకుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. త్రిపురను ఏడుసార్లు సందర్శించారు.1926లో రాష్ట్రానికి తన చివరి పర్యటన సందర్భంగా, ఠాగూర్ పుష్పబంట ప్యాలెస్‌లో బస చేశారు.1941 మే లో ఒక కార్యక్రమంలో మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య ఠాగూర్ 80వ పుట్టినరోజును దీనిలో జరుపుకున్నారు. [5]

1949లో రాచరిక రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత, 4.31 ఎకరాల ప్యాలెస్ ప్రధాన కమిషనర్ బంగ్లాగా మారింది.అది 2018 వరకు త్రిపుర రాజ్ భవన్‌గా ఉపయోగించారు. చివరకు 2018లో రాజ్‌భవన్‌ను కొత్త భవనానికి మార్చారు. పార్క్ దక్షిణ భాగం ప్రజల సందర్శన కోసం తెరిచిఉంచారు. దానికి రవీంద్ర కానన్ అని పేరు పెట్టారు.[5][4]

కొత్త మ్యూజియం

మార్చు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,2022 అక్టోబరు 14,న పూర్వపు రాజభవనం అయిన పుష్పబంత ప్యాలెస్‌లో డిజిటల్ మ్యూజియం పునాది రాయిని వేశారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంచేందుకు త్రిపుర ప్రభుత్వం ఈ కొనసాగుతున్న ప్రాజెక్టుకు బడ్జెట్‌ను మంజూరు చేసింది. [6]

ఇది కూడా చూడండి

మార్చు
  • బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ప్రభుత్వ గృహాలు

సూచనలు

మార్చు
  1. "Tripura, Meghalaya governors sworn in". The Times of India. Retrieved 2018-10-29.
  2. "Tripura's Pushpabanta Palace to be turned into museum celebrating royal history, Tagore links". The New Indian Express. Retrieved 2023-01-06.
  3. "Tripura's Pushpabanta Palace To Be Turned Into A National Level Museum And Cultural Centre". August 2022.
  4. 4.0 4.1 "Tripura Palace To Become Museum Celebrating Rabindranath Tagore Links". NDTV.com. Retrieved 2023-01-06.
  5. 5.0 5.1 NEWS, NE NOW (2022-07-31). "Tripura: Pushpabanta Palace to be developed as museum". NORTHEAST NOW (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-06.
  6. Today, North East (2022-09-24). "President - Draupadi Murmu Likely To Lay Foundation Of Tripura's Digital Museum On October 14". Northeast Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-06.