పూజారి శైలజ (జననం (1982-06-12)1982 జూన్ 12 ) భారతీయ మహిళా వెయిట్ లిప్టర్. ఆమె అంతర్జాతీయ పోటీలలో 75 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2005 వరల్డ్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నది.[1]

పూజారి శైలజ
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుపూజారి శైలజ
జననం (1982-06-12) 1982 జూన్ 12 (వయసు 42)
బరువు73.92 కి.గ్రా. (163.0 పౌ.)
క్రీడ
దేశం India
క్రీడఒలెంపిక్ వెయిట్ లిఫ్టింగ్
Weight class75 కి.గ్రా
జట్టునేషనల్ టీం
Updated on 13 సెప్టెంబరు 2016.

జీవిత విశేషాలు

మార్చు

శ్రీకాకుళం జిల్లా , ఆమదాలవలస మండలంలోని వంజంగి గ్రామంలో అమ్మాజమ్మ, సీతమ్మ దంపతులకు జన్మించారు. డిగ్రీ పూర్తిచేసి సుమారు 7 సంవత్సరాల పాటు వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ పొంది అంచెలంచెలుగా ఎదిగారు. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో మూడు బంగారు పతకాలను సాధించారు. మహిళల 75 కి.గ్రా విభాగంలో జాతీయ రికార్డులను బద్దలుగొట్టి స్వర్ణం కైవశం చేసుకున్నారు. ఏడు గేమ్స్ పతకాలు సాధించడంతో ఆమె "ఇండియన్ స్ట్రాంగెస్ట్ ఉమెన్" గా రాష్ట్రానికి పేరు తెచ్చారు. స్నాచ్ లో 102.5 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 132.5 కిలోలతో మొత్తం 235 కిలోలు బరువెత్తి సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించారు. 1996-97లలో మధురైలో జరిగిన దక్షిణ భారత పోటీలలో పాల్గొని నాల్గవ స్థానంలో నిలిచారు. 1998లో హైదరాబాదులో జరిగిన ఇండిపెండెంట్ గోల్డ్ కప్ లో తొలి బంగారు పతకాన్ని సాధించారు. అదే యేడాది కోల్‌కతాలో జరిగిన జూనియర్ నేషనల్స్ లో కాంస్య పతకాన్ని సాధించారు. అదే యేడాది బెంగళూరులోజరిగిన సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ లో ప్రథమ స్థానంలో నిలిచారు. 1999లో కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ అధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన సదరన్ స్టేట్ గేమ్స్ లో పసిడి పతకాన్ని సాధించారు. అదే యేడాది మణిపూర్ లో జరిగిన జాతీయ క్రీడల్లో నాల్గవ స్థానంలో నిలిచారు. మైసూరులో జరిగిన దక్షిణ భారత క్రీడా పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధిచారు. విశాఖపట్నంలో జరిగిన 16వ మహిళల వెయిట్ లిఫ్తింగ్ లో రజత పతకం పొందారు. 2000 లో కేరళలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణపతకం పొందారు. 2002లో కామన్వెల్తు క్రీడల్లో మూడు పసిడి పతకాలు సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచారు.[2]

ప్రధాన ఫలితాలు

మార్చు
సంవత్సరం ప్రదేశం బరువు Snatch (kg) Clean & Jerk (kg) Total Rank
1 2 3 Rank 1 2 3 Rank
World Championships
2005 దోహా, ఖతర్ 75 kg 90 95 97 11 125 125 125 7 222.0 9

మూలాలు

మార్చు
  1. "2005 Weightlifting World Championships - Sailaja Pujari". iwf.net. Archived from the original on 24 మే 2016. Retrieved 23 June 2016.
  2. "biography of pujari sailaja". Archived from the original on 2016-07-05. Retrieved 2016-11-20.