పూజా చిట్గోపేకర్

పూజా చిట్గోపేకర్ ఫెమిన మిస్ ఇండియా 2007 పోటీల్లో 'మిస్ ఇండియా ఎర్త్'గా గెలిచింది. ఈమె నవంబరు 11 న మనీలాలో జరిగిన మిస్ ఎర్త్ 2007 పోటీల్లో పాల్గొంది. తరువాత 2007 లో మిస్ ఎర్త్ ఎయిర్ అయ్యింది.[1] మిస్ ఎర్త్ ఎయిర్ మిస్ ఎర్త్‌ మొదటి రన్నరప్‌కు సమానం. ఈమెకు బాలీవుడ్ సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్నట్టు వ్యక్తం చేసింది[2]. ఆమె ఆక్లాండ్‌లోని అగ్రశ్రేణి ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటైన డియోసెసన్ స్కూల్ ఫర్ గర్ల్స్ లో చదివింది.

పూజా

ముంబైలో ఫెమినా ఇండియా ఇచ్చే మూడు టైటిళ్లలో ఒకటైన మిస్ ఇండియా ఎర్త్‌ను ఆమె గెలుచుకుంది; మిగిలిన రెండు టైటిల్స్ - మిస్ ఇండియా యూనివర్స్ పూజా గుప్తాకు, మిస్ ఇండియా వరల్డ్ సారా జేన్ డయాస్ కూ దక్కాయి. మిస్ ఎర్త్ 2006 లో మొదటి రన్నరప్ అయిన అమృతా పాట్కి ఆమెకు పట్టాభిషేకం చేసింది. అమృతా మాదిరిగానే, మిస్ ఎర్త్ పోటీలో కూడా ఆమె మొదటి రన్నరప్‌గా నిలిచింది.

పూజా 2011లో ఆక్లండ్ విశ్వవిద్యాలయం నుండి మెడిసిన్ డిగ్రీ అందుకుంది.[3] 2011 జనవరి 7 న చికాగోకు చెందిన ఎవిజి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ వైస్ చైర్మన్ విక్రమ్ కుమార్‌ను పెళ్ళి చేసుకుంది. వారి పెళ్ళి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగింది. [4] పూజా చికాగోలోని మెడికల్ డెర్మటాలజీ అసోసియేట్స్‌లో చర్మవ్యాధి నిపుణురాలిగా మోహ్స్ సర్జనుగా పనిచేస్తోంది.

మూలాలు

మార్చు
  1. Kesharwani, Manoj (19 October 2007). "Pooja Chitgopekar". Times of India. Retrieved 20 September 2012.
  2. http://www.southasiabiz.com/2007/06/miss_india_earth_2007_pooja_ch.html Archived 2007-10-22 at the Wayback Machine తీసుకొన్న తేదీ అక్టోబర్ 31 2007
  3. "Pooja Chitgopekar".
  4. Morton, Frances (2011-01-09). "Wedding bill heads for $10m". New Zealand Herald (in New Zealand English). ISSN 1170-0777. Retrieved 2017-04-22.