పూజాఫలం

(పూజా ఫలం నుండి దారిమార్పు చెందింది)

పూజాఫలం శ్రీ శంభు ఫిలిమ్స్ పతాకంపై బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రధారులుగా నటించిన తెలుగు సాంఘిక చిత్రం. మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించాడు. డి. వి. నరసరాజు మాటలు రాశాడు.

పూజాఫలం
దర్శకత్వంబి.ఎన్.రెడ్డి
రచనడి. వి. నరసరాజు (మాటలు), దేవులపల్లి కృష్ణశాస్త్రి (పాటలు)
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు ,
సావిత్రి,
జమున,
జగ్గయ్య,
రమణారెడ్డి,
గుమ్మడి,
రేలంగి,
మిక్కిలినేని,
ఎల్.విజయలక్ష్మి,
రాజశ్రీ
సంగీతంసాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

మధు (అక్కినేని) సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతనికి బిడియం ఎక్కువ. ఆడవాళ్ళకు దూరంగా ఉండే మధు భవంతిలోకి అద్దెకు వచ్చిన వాసంతి అతనితో చనువుగా ప్రవర్తించడంతో అతనిలో ప్రణయ భావావేశం మొగ్గలు తొడుగుతుంది. ఆమె తండ్రికి బదిలీ అవటంతో దూరమౌతుంది. తరువాత అతని జీవితంలోకి తన ఎస్టేటు వ్యవహారాలు చూసే గుమస్తా కుమార్తె సీత ప్రవేశిస్తుంది. ఆమె మధుకి యెంతో సన్నిహితమౌతుంది. వారిద్దరి మధ్య అనురాగం చిగురించి పరస్పర ఆరాధనాభావంగా మారుతుంది. ఇంతలో మధు జీవితంలో చెలరేగిన తుఫాను ఫలితంగా నీలనాగిని అనే వేశ్య, ఆమె బంధుగణం ప్రవేశిస్తారు. ఒకవిధంగా ఆమె నుంచి మధుకు సాంత్వన లభించినా, వారి నిజస్వరూపాన్ని గ్రహించిన మధు వారిని తన్ని తగిలేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆస్తికి వారసత్వ పరమైన చిక్కుల్లో యిరుక్కుంటాడు మధు. దాని నుంచి సీత, ఆమె తండ్రి సహాయంతో బైటపడిన మధు, సీతను భార్యగా స్వీకరిస్తాడు. సీత చేసిన పూజలకు ఫలప్రాప్తి దక్కుతుంది.

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
ఎందు దాగి ఉన్నావో బృందా విహారి సి.నారాయణ రెడ్డి సాలూరు రాజేశ్వరరావు పి. సుశీల
నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగె సాగెనందుకో సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
పగలే వెన్నెల జగమే ఊయల సి. నారాయణ రెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఎస్ జానకి
ఓ బస్తీ దొరగారూ దిగి వస్తారా మీరు కొసరాజు సాలూరు రాజేశ్వరరావు బి. వసంత, బసవేశ్వర్
మదనా మనసాయెరా సి . నారాయణ రెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఎస్. జానకి
సుందర సురనందనవన మల్లీ జాబిల్లీ అందేనా ? ఈ చేతుల కందేనా దేవులపల్లి కృష్ణశాస్త్రి సాలూరు రాజేశ్వరరావు
వన్నెచిన్నెలదీ గులాబీ కొసరాజు సాలూరు రాజేశ్వరరావు సత్యారావు, స్వర్ణలత బృందం

అందేనా ఈ చేతుల కందేనా చందమామా, రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం. పి. సుశీల

ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయేైన , రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం. పి. సుశీల

తరతరమ్ములుగా దానధర్మములు చేసి( పద్యం), గానం.పి.సుశీల

పగలే వెన్నెల జగమే ఊయల , రచన: సి. నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల

మంచిదినము నేడే మహారాజు , గానం.ఎస్.జానకి

వస్తావు పోతావు నాకోసం వచ్చి కూర్చున్నాడు , రచన:కొసరాజు , గానం.బి.వసంత

శివదీక్షా పరురాలనురా నే శివాదీక్షా పరురాలనురా , రచన: ఘనం శీనయ్య , గానం.శిష్ట్లాజానకి బృందం.

మూలాలు

మార్చు
  • ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి. ఘంటసాల గళామ్రుతము, కొల్లూరిభాస్కరరావు బ్లాగ్.
"https://te.wikipedia.org/w/index.php?title=పూజాఫలం&oldid=4221950" నుండి వెలికితీశారు