రాజశ్రీ (నటి)
రాజశ్రీ పేరుతో ఉన్న ఇతర వ్యాసాల కొరకు, రాజశ్రీ (అయోమయ నివృత్తి) చూడండి.
రాజశ్రీ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక నటీమణి. ఈవిడ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా నటించారు.
రాజశ్రీ(31,ఆగష్టు1945 | |
---|---|
జననం | కుసుమకుమారి(రాజశ్రీ)31ఆగష్టు1945 |
నివాస ప్రాంతం | మద్రాసు, హైదరాబాదు, విశాఖపట్నం |
వృత్తి | చలనచిత్ర నటి |
మతం | హిందూ మతం |
భార్య / భర్త | తోట పాంచజన్యం |
పిల్లలు | నాగశేషాద్రి శ్రీనివాస్ |
తండ్రి | సూర్యనారాయణ రెడ్డి |
తల్లి | లలితాదేవి |
నటనా కాలం:(1956 నుండి 1979)
జీవిత విశేషాలు
మార్చుఈమె అసలు పేరు కుసుమకుమారి. ఈమె విశాఖపట్నంలో ఎం.సూర్యనారాయణరెడ్డి, లలితాదేవి దంపతులకు రెండో సంతానంగా జన్మించింది. ఈమె తండ్రి రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా పనిచేసేవాడు. ఈమె బాల్యం విజయవాడ, ఏలూరులలో గడిచింది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసిన తోట పాంచజన్యంతో ఈమె వివాహం జరిగింది. ఈమెకు నాగశేషాద్రి శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు.
నటించిన చిత్రాలు
మార్చు- నాగులచవితి 1956 ... మొదటి చిత్రం (మరీ చిన్న పాత్ర)
- నిత్య కళ్యాణం పచ్చ తోరణం 1960
- మాంగల్యం 1960
- దక్షయజ్ఞం 1962
- ఆరాధన 1962
- మహామంత్రి తిమ్మరుసు 1962
- దశావతారములు 1962
- పూజాఫలం 1964
- అగ్గిపిడుగు 1964
- కాదలిక్క నేరమిల్లై (తమిళ సినిమా) 1964
- తోటలో పిల్ల కోటలో రాణి 1964
- ప్రేమించిచూడు 1965
- మనుషులు మమతలు 1965
- ఆత్మగౌరవం 1965
- ప్రమీలార్జునీయము 1965
- ప్రతిజ్ఞా పాలన 1965
- ప్యార్ కియే జా (హిందీ సినిమా) 1966
- భూలోకంలో యమలోకం 1966
- లోగుట్టు పెరుమాళ్ళకెరుక 1966
- అగ్గిబరాట 1966
- భీమాంజనేయ యుద్ధం 1966
- గోపాలుడు భూపాలుడు 1967
- శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న 1967
- రహస్యం 1967
- రణభేరి 1968
- గోవుల గోపన్న 1968
- అగ్గిమీద గుగ్గిలం 1968
- ఎవరు మొనగాడు 1968
- సత్తెకాలపు సత్తెయ్య 1969
- ఉక్కుపిడుగు 1969
- అగ్గివీరుడు 1969
- చిట్టి చెల్లెలు 1970
- జన్మభూమి 1970
- మెరుపు వీరుడు 1970
- భలే ఎత్తు చివరకు చిత్తు 1970
- పెళ్లి కూతురు 1970
- ఒకే కుటుంబం 1970
- విక్రమార్క విజయం 1971
- పట్టిందల్లా బంగారం (1971)
- అదృష్ట దేవత 1972
- పంజరంలో పసిపాప (1973)
- అల్లూరి సీతారామరాజు (1974)
- శ్రీరామాంజనేయ యుద్ధం (1975)
- ఉత్తమురాలు (1976)
- అందమె ఆనందం 1977 ... చివరి చిత్రం