పూజా బెనర్జీ (హిందీ నటి)

పూజా బెనర్జీ (జననం 1991 నవంబరు 8) హిందీ టెలివిజన్‌ రంగానికి చెందిన భారతీయ నటి. ఆమె తన టెలివిజన్ కెరీర్‌ను ఎంటీవి రోడీస్‌లో పోటీదారుగా ప్రారంభించింది. ఆ తర్వాత తన మొదటి ప్రధాన కార్యక్రమం ఏక్ దూస్రే సే కర్తే హై ప్యార్ హమ్‌లో తేజల్ మజుందార్‌గా నటించింది.[2]

పూజా బెనర్జీ
స్టార్ పరివార్ అవార్డ్స్ 2018లో పూజా బెనర్జీ
జననం (1991-11-08) 1991 నవంబరు 8 (వయసు 32)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
జీవిత భాగస్వామి
సందీప్ సెజ్వాల్
(m. 2017)
[1]
పిల్లలు1

ఆమె చంద్రకాంత, చంద్ర నందిని, దిల్ హి తో హైలలో కొన్ని సహాయ పాత్రలు పోషించింది. ఏక్తా కపూర్‌తో జతకట్టిన ఆమె కెరీర్ ప్రారంభంలోనే కీర్తిని పొందింది. ఏక్తా కపూర్‌ రూపొందించి అత్యంత విజయవంతమైన షోలలో నివేదితా బసుగా కసౌతి జిందగీ కే, రియా మెహ్రాగా కుంకుమ్ భాగ్య పాత్రలతో పూజా బెనర్జీ విస్తృత ప్రజాదరణ పొందింది.[3][4]

అలాగే, 2018 నుండి ఆమె ఏక్తా కపూర్‌ వెబ్ సిరీస్ కెహ్నే కో హమ్సఫర్ హైన్ 3 సీజన్ల బనీ మెహ్రా కీలక పాత్రను కూడా పోషిస్తోంది.[5]

ఆమె నటించి జీ టీవీలో ప్రసారం అయిన ప్రముఖ హిందీ ధారావాహిక కుంకుమ్ భాగ్య తెలుగులో కుంకమ భాగ్యం గా వచ్చింది. దీనికి ముజమ్మిల్ దేశాయ్, శరద్ యాదవ్ దర్శకత్వం వహించారు.[6]

కెరీర్ మార్చు

పూజా బెనర్జీ తన నటనా జీవితాన్ని 2011లో ప్రారంభించింది, ఎంటీవి రోడీస్ సీజన్ 8లో పాల్గొంది. ఆమె 1వ ఫిక్షన్ షో 2012లో స్టార్‌ప్లస్‌లో ఏక్ దూస్రే సే కర్తే హై ప్యార్ హమ్‌తో వచ్చింది, ఇందులో ఆమె తేజల్ మజుందార్ ప్రధాన పాత్రను పోషించింది. 2013లో, ఆమె ఫాంటసీ షో ది అడ్వెంచర్స్ ఆఫ్ హతీమ్ ఆన్ లైఫ్ ఓకేలో పెరిజాద్‌గా నటించింది.[7][8]

ఆ సంవత్సరం ఆమె రుద్రాణి పాత్రలో సహారా వన్ షో ఘర్ ఆజా పరదేశిలో నటించింది. కొంతకాలం తర్వాత, ఆమె బాక్స్ క్రికెట్ లీగ్ మొదటి సీజన్‌లో పోటీదారుగా కొనసాగింది. ఛానల్ వి యూత్ డ్రామా స్విమ్ టీమ్‌లో రేవా మాధుర్‌గా కనిపించింది.[9]

2016లో, ఆమె లైఫ్ ఓకే డ్రామా షో నాగార్జునలో పెరల్ వి పూరి సరసన నూరీ శాస్త్రి పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.[10]

2017లో, ఆమె చారిత్రాత్మక శృంగారం చంద్ర నందినిలో విరోధి విశాఖగా, ఫాంటసీ డ్రామా చంద్రకాంతలో సూర్యకాంతగా సహాయక పాత్రల్లో నటించి మెప్పించింది.[11][12]

ఆ తర్వాత, ఆమె బాక్స్ క్రికెట్ లీగ్ నాల్గవ సీజన్‌లో కంటెస్టెంట్‌గా రియాలిటీ టెలివిజన్‌ షోకు తిరిగి వచ్చింది. జూన్ 2018లో దిల్ హి తోహ్ హై అనే రొమాన్స్‌ ధారావాహికలో ఆరోహి వర్మ పాత్రను పోషించింది, ఆ పాత్రను ఆమె తర్వాత సీజన్ 2లో నేరుగా ఆల్ట్ బాలాజీలో ప్రసారం చేసింది. ఆమె ఫాంటసీ డ్రామా విక్రమ్ బేతాల్ కి రహస్య గాథలో సోన్‌ప్రభగా అతిధి పాత్రలో కూడా కనిపించింది.[13][14] సెప్టెంబరు 2018లో, ఆమె కసౌతి జిందగీ కేలో పెళ్లయిన నివేదా బసుగా నటించింది, అది విజయవంతంగా రెండు సంవత్సరాల పాటు కొనసాగి అక్టోబరు 2020లో ముగిసింది.[15]

2018 నుండి 2020 వరకు, ఆమె కెహ్నే కో హమ్సఫర్ హైన్ అనే వెబ్ సిరీస్‌లో బనీ మెహ్రాగా కూడా నటించింది. ఆమె 2019లో నాచ్ బలియే సీజన్ 9లో పాల్గొంది.[16] 2020లో ఆమె ది క్యాసినో అనే వెబ్ సిరీస్‌లో నటించింది.[17]

2020 నుండి 2022 వరకు, ఆమె కుంకుమ్ భాగ్యలో రియా మెహ్రా గ్రే-షేడెడ్ లీడ్ క్యారెక్టర్‌ను పోషించింది.[18]

వ్యక్తిగత జీవితం మార్చు

పూజా బెనర్జీ ప్రొఫెషనల్ ఇండియన్ స్విమ్మర్ సందీప్ సెజ్వాల్‌ని 2017 ఫిబ్రవరి 28న వివాహం చేసుకుంది. ఈ జంటకు ఒక కూతురు సనా ఉంది.[19]

ఫిల్మోగ్రఫీ మార్చు

టెలివిజన్ మార్చు

సంవత్సరం ధారావాహిక పాత్ర మూలాలు
2011 ఎంటీవి రోడీస్ పోటీదారు
2012 ఏక్ దూస్రే సే కర్తే హై ప్యార్ హమ్ తేజల్ మజుందార్ [20]
2013–2014 ది అడ్వెంచర్స్ ఆఫ్ హతీమ్ పెరిజాద్ [21]
2013 ఘర్ ఆజా పరదేశి రుద్రాణి
2014–2015 బాక్స్ క్రికెట్ లీగ్ 1 పోటీదారు [22]
2015–2016 స్విమ్ టీం రేవా మాథుర్ [23]
2015 హల్లా బోల్ 2 మీరా
మాన్ నా మాన్ మేన్ తేరా మెహమాన్ అనార్కలి
2016-2017 నాగార్జున - ఏక్ యోద్ధ నూరి శాస్త్రి
2017 చంద్ర నందిని విశాఖ [24]
చంద్రకాంత సూర్యకాంత
2018 బాక్స్ క్రికెట్ లీగ్ 3 పోటీదారు
దిల్ హాయ్ తో హై ఆరోహి
విక్రమ్ బేతాల్ కి రహస్య గాథ సోనప్రభ
2018–2020 కసౌతి జిందగీ కే నివేదిత బసు సేన్‌గుప్తా
2019 బాక్స్ క్రికెట్ లీగ్ 4 పోటీదారు
నాచ్ బలియే 9
2020–2022 కుంకుం భాగ్య రియా మెహ్రా తెలుగులో కుంకమ భాగ్యం[25]
2023 బడే అచ్చే లాగ్తే హైన్ 2 పిహు కపూర్

మూలాలు మార్చు

  1. "Swimming is his first love: Pooja Banerjee on national swimmer husband Sandeep Sejwal". The Times of India. 27 August 2018. Retrieved 21 June 2022.
  2. "Pooja Banerjee's love for bikes". Times Of India. 19 April 2013.
  3. "Behind the scenes: Erica Fernandes and Pooja Banerjee deck up to celebrate Durga Puja in Kasautii Zindagii Kay 2 - Times of India". The Times of India. 9 October 2018.
  4. "Jodha Akbar and other TV shows: How the actors cope with shooting in hot, open locales". Archived from the original on 2 May 2015.
  5. "Jodha Akbar and other TV shows: How the actors cope with shooting in hot, open locales". Archived from the original on 2 May 2015.
  6. "Kumkum Bhagya Written Updates - Upcoming Story & Twists". The Times of India. Retrieved 2020-08-31.
  7. Pooja Banerjee to enter EK Dusre Se Karte Hain -Times Of India
  8. "It's all about the name for Pooja Banerjee". Times Of India. 30 December 2013.
  9. "Box Cricket League Teams: BCL 2014 Team Details With TV Actors & Names of Celebrities". india.com. Retrieved 14 December 2014.
  10. "Jodha Akbar and other TV shows: How the actors cope with shooting in hot, open locales". Archived from the original on 2 May 2015.
  11. "Pooja Banerjee Truly Believes In 'Pyaar Dosti Hai'; Says, 'I Know My Husband Since Standard 4'- EXCLUSIVE". Spotboye.
  12. "Pooja Banerjee on doing Chandra Nandini: I was dying to do a negative character". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-05-02. Retrieved 2018-08-09.
  13. "Pooja Banerjee: Being married to a swimmer means an extremely disciplined and healthy lifestyle". www.hindustantimes.com. 30 August 2018.
  14. "Ekta Kapoor's Dil Hi Toh Hai to premiere today; 5 reasons to watch the show". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-09-20.
  15. "Himesh Reshammiya's new album Aap se Mausiiquii star Puja Banerjee finds him sweet, caring". The Indian Express (in ఇంగ్లీష్). 2016-11-11. Retrieved 2021-09-20.
  16. "Kasautii Zindagii Kay's siblings Parth Samthaan and Pooja Banerjee to romance in this show". India Today.
  17. "Meet The Star Cast Of Upcoming ZEE5 Original Web Series The Casino #MyGameMyRules - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). Retrieved 2021-09-20.
  18. "Pooja Banerjee replaces Naina Singh in 'Kumkum Bhagya'". m.timesofindia.com. 18 July 2020. Retrieved 17 February 2021.
  19. "Pooja Banerjee Truly Believes In Paar Dosti Hai'; Says, 'I Know My Husband Since Standard 4'- EXCLUSIVE". Spotboye.
  20. Pooja Banerjee to enter EK Dusre Se Karte Hain -Times Of India
  21. "It's all about the name for Pooja Banerjee". Times Of India. 30 December 2013.
  22. "Box Cricket League Teams: BCL 2014 Team Details With TV Actors & Names of Celebrities". india.com. Retrieved 14 December 2014.
  23. "In Pics: National level swimmer Pooja Banerjee turns glamorous for 'Swim Team'". Daily Bhaskar. 24 March 2015.
  24. "Pooja Banerjee on doing Chandra Nandini: I was dying to do a negative character". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-05-02. Retrieved 2018-08-09.
  25. "Pooja Banerjee replaces Naina Singh in 'Kumkum Bhagya'". m.timesofindia.com. 18 July 2020. Retrieved 17 February 2021.