పూడి శ్రీహరి
పూడి శ్రీహరి ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ప్రముఖ విలేఖరి, రచయిత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి యొక్క చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.[1]
పూడి శ్రీహరి | |
---|---|
వృత్తి | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి యొక్క చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చువిశాఖపట్నం జిల్లా మామిడిపల్లి (దేవరాపల్లి మండలం)లో పూడి శ్రీహరి జన్మించాడు. డిగ్రీ వరకు విశాఖ జిల్లాలోనే విద్యాభ్యాసం చేసారు. విశాఖ జిల్లా రూరల్ రిపోర్టర్ గా డిగ్రీ చివరి సంవత్సరంలో వృత్తిని ఆరంభించి ఆ తర్వాతి క్రమంలో డెస్క్ జర్నలిస్ట్, చీఫ్ న్యూస్ కో ఆర్డినేటర్, ఎడిటర్ గా పనిచేసారు.[2]
వృత్తి
మార్చువై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో అడుగడుగునా అంతరంగం అనే పుస్తకాన్ని 2019 లో రచించారు.[3] అసెంబ్లీ ఎన్నికలకి రెండేళ్ల ముందు నుండి వై ఎస్ జగన్ యొక్క మీడియా కార్యకలాపాల్ని పర్యవేక్షించిన పిమ్మట 2019 జూన్ 26 న ముఖ్యమంత్రి యొక్క చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా నియమితులయ్యారు.[4]
మూలాలు
మార్చు- ↑ "పూడి శ్రీహరి విచారణ అవసరం లేదని నిర్ణయానికొచ్చాం". ETV Bharat News. 2021-04-03. Retrieved 2021-11-17.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Varma, K. V. D. (2019-06-26). "సీఎం జగన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పూడి శ్రీహరి". www.hmtvlive.com. Archived from the original on 2021-11-13. Retrieved 2021-11-17.
- ↑ "అడుగడుగునా అంతరంగం.. వైఎస్ జగన్ జీవితంపై పుస్తకం ఆవిష్కరణ". Samayam Telugu. 2019-04-04. Retrieved 2021-11-17.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "సీఎం వైఎస్ జగన్ సీపీఆర్వోగా పూడి శ్రీహరి". Sakshi. 2019-06-25. Retrieved 2021-11-17.