పూణెరీ పగడి
పూణెరీ పగడి అనేది పూణె నగర గౌరవం, ప్రతిష్ఠలకు చిహ్నంగా పరిగణించే తలపాగా[1] ఇది ధరించే సంప్రదాయం రెండు శతాబ్దాల క్రితం ప్రారంభమయింది.[2] ఇది గౌరవ చిహ్నమే అయినా పగడి వాడుక సంవత్సరాలుగా మారిపోయింది, ప్రస్తుతం కూడా కళాశాలల్లో సంప్రదాయ ఉత్సవాల రోజుల్లో ధరిస్తున్నారు.[3] పగడి గుర్తింపును రక్షించేందుకు, స్థానికుల నుంచి భౌగోళిక గుర్తింపును కల్పించాలన్న డిమాండ్లు వచ్చాయి.[3] వారి కోరిక నెరవేరుస్తూ 4 సెప్టెంబర్ 2009 నుంచి పగిడిని మేధోహక్కుగా గుర్తించారు.[1][3][4][5][6]
చరిత్ర
మార్చు19వ శతాబ్దంలో సంఘసంస్కర్త మహదేవ్ గోవింద్ రనడే పగడిని ఈ శైలిలో తయారుచేసి ధరించడం ప్రారంభించారు. లోకమాన్య తిలక్, జె.ఎస్. కరందికర్, డి.డి. సాత్యే, తాత్యాసాహెబ్ కేల్కర్, దత్తో వామన్ పోత్దార్ తదితర నాయకులు దీన్ని ధరించారు.[2] 1973లో మరాఠీ నాటకం, ఘషిరామ్ కొత్వాల్ ప్రారంభమయ్యాకా మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.[3]
వాడుక
మార్చుపగిడి ఎక్కువగా వివాహం, పాఠశాల, కళాశాల్లో జరిగే సంప్రదాయ కార్యక్రమాలల్లో ఈ పగడి వాడుతూంటారు. గాంధాల్ కళన ప్రదర్శించే గోంధాల్ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు యువకులు కూడా దీన్ని వాడుతున్నారు. పగడి గౌరవ చిహ్నంగానేకాక సావనీరులో కూడా ఉపయోగపడుతుంది, గత కాలాన్ని సినిమా చిత్రకాలంగా స్వీకరించిన చారత్రిక చలన చిత్రాలు, థియేటర్లలో దీన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.[3]
References
మార్చు- ↑ 1.0 1.1 "Indian association seeks IPR for 'Puneri Pagadi'". Business Standard. 7 April 2009. Retrieved 12 June 2012.
- ↑ 2.0 2.1 "Turban legend: Puneri Pagadi may soon get intellectual property tag". Mid-day. 6 April 2009. Retrieved 13 June 2012.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 Shruti Nambiar (2 August 2011). "The Pagadi Unravelled". The Indian Express. pp. 1–2. Retrieved 13 June 2012.
- ↑ "Puneri Pagadi gets GI tag; latest to join protected goods club". Zee News. 21 September 2009. Retrieved 13 June 2012.
- ↑ "Puneri Pagdi obtains geographical indication status". OneIndia News. 3 January 2010. Archived from the original on 14 మే 2013. Retrieved 13 June 2012.
- ↑ Chandran Iyer (22 September 2009). "Puneri Pagadi gets pride of place". Mid Day. Retrieved 13 June 2012.